యాషెస్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్టును గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో ఉన్న డిపెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు, ఇంగ్లండ్‌కు సమాన పాయింట్లు ఉండడం విశేషం. ఈ రెండు జట్లు 43.33 పర్సంటేజీ పాయింట్స్(PTC)తో 26 పాయింట్లు(ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా) కలిగి ఉన్నాయి. పెనాల్టీ కింద ఇరుజట్లకు రెండు పాయింట్లు కోత పడడంతో వారి పాయింట్స్‌లో వ్యత్యాసం లేకుండా పోయింది.
ఇక తొలి రెండు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇటీవలే లంకపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ 100 పర్సంటైల్‌తో 24 పాయింట్లతో(రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలుపు) తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా 66.67 పర్సంటైల్‌తో 16 పాయింట్లతో(రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక డ్రా) రెండో స్థానాన్ని నిలుపుకుంది.
ఇక వన్డే వరల్డ్‌కప్ ముగిసే వరకు ఏ జట్లకు టెస్టు సిరీస్‌లు లేవు. వరల్డ్‌కప్ ముగిశాకా టీమిండియా డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది. అటు పాకిస్తాన్ ఆస్ట్రేలియా గడ్డపై డిసెంబర్-జనవరిలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌ల ఫలితాల అనంతరం పాయింట్స్ టేబుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
చదవండి: WI Vs IND 3rd ODI: టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా, సిరీస్ గెలిచేనా?
Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
Comments
Please login to add a commentAdd a comment