ఓవల్ వేదికగా స్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ ఓ అద్భుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు.
భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో బోలాండ్ వేసిన ఇన్‌స్వింగ్ డెలివరీకి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి ఆఫ్ సైడ్ పడి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో గిల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు.
ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. జట్టును గట్టుక్కించే బాధ్యత మొత్తం ప్రస్తుతం రహానే పైనే ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: WTC FINAL 2023: పీకల్లోతు కష్టాల్లో భారత్.. భారం మొత్తం అతడిపైనే! లేదంటే అంతే సంగతి
Comments
Please login to add a commentAdd a comment