ఆస్ట్రేలియాతో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే రెండు బ్యాచ్‌లగా లండన్‌కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను షురూ చేసింది. అదే విధంగా ఐపీఎల్-2023 ఫైనల్ ముగిశాక శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు చేరుకోనున్నారు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో గాయపడిన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ప్రస్తుత జట్టులో వికెట్ కీపర్లగా కిషన్‌తో పాటు శ్రీకర్ భరత్ కూడా ఉన్నాడు.
ఈ క్రమంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో భరత్‌కు బదులుగా కిషన్‌కు ఛాన్స్ ఇస్తే మంచింది అని కొంతమంది అభిప్రయాడుతుంటే.. మరికొంతమంది భరత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో వికెట్ కీపర్‌గా కిషన్ కంటే భరత్ మంచి ఎంపిక అని కార్తీక్ తెలిపాడు.
"డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్‌ను ఎంపిక చేయడం బెటర్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పటివరకు టెస్టుల్లో ఆడిన అనుభవం లేదు. అతడు తొలిసారి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి మ్యాచ్‌లో ఆడడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో భరత్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో మరోసారి ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నా" అని ఐసీసీ షేర్ చేసిన వీడియోలో కార్తీక్ చెప్పుకొచ్చాడు.
చదవండి: #MS Dhoni: 15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment