భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలా ఉండాలో విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్.. టీమిండియా ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
మెజారిటీ విశ్లేషకులు టీమిండియా ఎలా ఉండాలని అనుకున్నారో, పాంటింగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వికెట్ కీపర్ విషయంలో మాత్రం పాంటింగ్ కాస్త భిన్నంగా స్పందించాడు. కేఎస్ భరత్‌తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్, గిల్ ఓపెనింగ్ స్థానాల్లో ఎలాగూ ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఆరో స్థానంలో ఇషాన్ బెటర్ ఛాయిస్ అవుతాడని అన్నాడు.
ఓవల్ పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో యాజమాన్యం సైతం ఇషాన్ పేరునే పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. వేగంగా ఆడటం ఇషాన్‌కు అదనంగా కలిసొచ్చే అంశమని అన్నాడు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
చదవండి: ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
Comments
Please login to add a commentAdd a comment