PC: IPL
KS Bharat Slams Century In Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో దేశీయ ఐపీఎల్ స్టార్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్‌కే) హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్ కేఎస్ భరత్ సైతం భారీ శతకం(161) సాధించి.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సత్తా చాటాడు.
హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ 109 బంతుల్లో 16 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. భరత్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతనిపై కన్నేశాయి. గత ఐపీఎల్ వేలంలో బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో భారీ ధర పలికే అవకాశం ఉంది.
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించిన ఈ ఆంధ్రా కుర్రాడు ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
చదవండి: Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్‌లో ఇరగదీశాడు..
Comments
Please login to add a commentAdd a comment