కేఎస్ భరత్- కేఎల్ రాహుల్
India Vs Australia - BGT 2023: రిషబ్ పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌ల రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు ఉండగా.. మేనేజ్‌మెంట్ ఎవరివైపు మొగ్గుచూపుతుందోనన్న ఆసక్తి పెరిగింది.
కాగా, దేశవాళీ క్రికెట్‌లో తమ జట్టు తరఫున రెగ్యులర్‌గా కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఆంధ్ర ఆటగాడు భరత్. అతడు ఈ సిరీస్‌తో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కీలక సిరీస్ నేపథ్యంలో సీనియర్, వైస్ కెప్టెన్ రాహుల్‌కే కీపర్‌గా అవకాశం ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌ను నమ్ముకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘పిచ్ స్వభావం గురించి పక్కన పెడితే.. టెస్టు మ్యాచ్‌లో పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌తో ప్రయోగాలు చేయకూడదు.
ఈ తప్పిదం కారణంగా మ్యాచ్ మాత్రమే కాదు.. ఏకంగా సిరీస్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్‌గా కీపింగ్ చేసే వ్యక్తిని కాదని వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. కాగా కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
చదవండి: BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..!
Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి'
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment