
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.
ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్
ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
ఐదు పరుగులకే అవుట్
ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్‌తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు.
మండిపడుతున్న ఫ్యాన్స్
మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు
కష్టాల్లో టీమిండియా
ఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).
చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవే
విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
Extra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024
We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h
— Div🦁 (@div_yumm) November 22, 2024