టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ-2024లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్..మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.
తండ్రిలానే ప్రత్యర్ధి బౌలర్లను ఆర్యవీర్ ఊచకోత కోశాడు. తనదైన స్టైల్లో కేవలం 229 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్క్‌ను జూనియర్ సెహ్వాగ్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
ఆర్యవీర్ సరిగ్గా 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. అతడితో పాటు ధన్యా నక్ర(98) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఢిల్లీ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అరంగేట్రంలోనే అదుర్స్..
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే ఆర్యవీర్ అదరగొట్టాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందించాడు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. మరోవైపు ఆర్యవీర్ ఐపీఎల్‌లో ఆడితే చూడాలన్న తన కోరికను సెహ్వాగ్ ఇప్పటికే వెల్లడించాడు.
చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment