బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది.
మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్‌వైపు మొగ్గు చూపింది. అశ్విన్‌తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.
ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్‌మెంట్ సుందర్‌నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్‌లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది.
బుమ్రా భారత పేస్ అటాక్‌ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్‌గా ఉంటాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపగా.. పడిక్కల్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment