క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.
అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
శుబ్‌మన్ గిల్ స్థానంలో..
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
కేరళకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.
ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లోనూ
అయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.
ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!
ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.
అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్‌ను కూడా మిడిలార్డర్‌లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.
ఓపెనర్‌గా రాహుల్ బెస్ట్
కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment