అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియంకు వచ్చారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.
ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, హెడ్‌లు భారత పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వదిలేయడంతో హెడ్ బతికిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఐదో బంతిని హెడ్ ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అయితే సునాయాస క్యాచ్‌ను అందుకోవడంలో భరత్ విఫలమయయ్యాడు. ఇక భరత్ విడిచి పెట్టిన క్యాచ్‌కు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్) శుబ్‌మన్ గిల్ ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్‌కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియాన్
Comments
Please login to add a commentAdd a comment