ఆంధ్రా వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ ఎట్టకేలకు టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు తుది జట్టులో భరత్‌కు చోటు దక్కడంతో అతడి రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారత వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదగా టీమిండియా క్యాప్‌ను భరత్ అందుకున్నాడు.
ఇక బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్ ఆకాంక్షించారు.
సీఎం జగన్ ట్వీట్‌కు రిప్లే ఇచ్చిన భరత్
సీఎం జగన్ చేసిన ట్వీట్‌కు కేఎస్ భరత్ రిప్లే ఇచ్చాడు." మీ అభినందనలు, ఆశీస్సులను అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్లవేళలా కష్టపడుతూ దేశానికి, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తాను" అని భరత్ బదులు ఇచ్చాడు.
చదవండి: IND vs AUS: ఈజీ క్యాచ్ ఇచ్చిన రాహుల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్
Very humbled and blessed to receive your appreciation and blessings Sir 🙏🏻
— KonaSrikarBharat (@KonaBharat) February 9, 2023
Will always work hard and make our India and Telugu Flag fly higher 🇮🇳@ysjagan https://t.co/18Bx8r0aXt
Comments
Please login to add a commentAdd a comment