ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. ఇండోర్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తిగా తేలిపోయింది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌తో పాటు ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అరంగేట్ర సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌ను నాలుగో టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
కాగా వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్న భరత్.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన భరత్.. వరుసగా 8, 6, 23(నాటౌట్), 17, 3, మొత్తం 57 రన్స్ మాత్రమే చేశాడు.
దీంతో అతడిపై వేటు పడడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు మూడో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్ టెస్టుకు సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో జట్టు మెనెజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ
చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment