
IND Tour OF BAN 2022: 3 వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో పర్యటించనుంది. డిసెంబర్ 4 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటన కోసం సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించింది.
ఈ పర్యటనకు ముందు జరిగే న్యూజిలాండ్ టూర్‌కు రెస్ట్ తీసుకునే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టుతో చేరతారు. బంగ్లా పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్‌లకు రోహిత్, కేఎల్ రాహుల్‌లు కెప్టెన్, వైస్ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.
టెస్ట్ జట్టులో తెలుగు ఆటగాడు, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కేఎస్ భరత్‌కు అవకాశం దక్కగా.. మరో తెలుగు ఆటగాడు హనుమ విహారికి ఉద్వాసన పలికారు. కాగా, ఈ పర్యటనలో భారత్ తొలుత వన్డే సిరీస్ ఆతర్వాత టెస్ట్ సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 14, డిసెంబర్ 22 తేదీల్లో టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
బంగ్లాదేశ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్
బంగ్లాదేశ్ పర్యటనకు భారత వన్డే జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment