
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్ 10) జరుగబోయే కీలక సెమీస్ సమరానికి ముందు టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కింగ్ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
అయితే కోహ్లికి ఎక్కడ గాయమైంది, దాని తీవ్రత ఏంటి, రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉంటాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడిన విషయం తెలిసిందే. అయితే హిట్‌మ్యాన్‌కు తగిలిన గాయం చిన్నది కావడంతో అతను తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment