చటోగ్రామ్: వరుస ఓటమిలు, గాయాలతో సతమతమవుతున్న భారత్ ముందు క్లీన్‌స్వీప్ ప్రమాదం పొంచి ఉంది. సిరీస్ గెలిచేందుకు వచ్చి... తక్కువ ర్యాంక్ జట్టు చేతిలో వరుస పరాజయాలతో సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు... పరువు కాపాడుకునే పనిలో పడింది. శనివారం ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగే చివరిదైన మూడో వన్డేలో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
కోహ్లి చెలరేగితే...
టాపార్డర్ వైఫల్యంతోనే భారత్ సిరీస్‌ను మూల్యంగా చెల్లించుకుంది. తాజాగా గాయంతో రోహిత్ గైర్హాజరీ జట్టుకు మరింత ప్రతికూలాంశం. దీంతో ధావన్–ఇషాన్ కిషన్ జోడీ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయమైంది. అనుభవజ్ఞుడైన స్టార్ బ్యాటర్ కోహ్లి తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలోనే ఎప్పట్లాగే చెలరేగితే భారత్ కష్టాలు సగం తీరుతాయి.
మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్ కూడా బాధ్యతను పంచుకుంటే ఏ బెంగా ఉండదు. ఈ పర్యటనలో మన బౌలింగ్ మెరుగనే చెప్పాలి. మరోవైపు బంగ్లాదేశ్ ఖాతాలో ఇప్పటికే సిరీస్ ఉంది. వాళ్లకు ఈ మ్యాచ్ ఓడినా నష్టం లేదు. కాబట్టి యథేచ్ఛగా ఆడే అవకాశముంది. ఇది సత్ఫలితాలిస్తే భారత్‌లాంటి ఓ మేటి జట్టుపై క్లీన్‌స్వీప్ అనేది బంగ్లా క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
పిచ్, వాతావరణం
బంగ్లాదేశ్‌లో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే పిచ్ ఇదే! గత రెండు వన్డేలతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో భారీస్కోర్లు ఖాయం. వర్షం ముప్పు లేదు.
జట్లు (అంచనా)
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధావన్, ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, సుందర్, అక్షర్, శార్దుల్, షహబాజ్/కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఉమ్రాన్.
బంగ్లాదేశ్: లిటన్ దాస్ (కెప్టెన్), అనాముల్, నజ్ముల్, షకీబ్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, అఫీఫ్, మెహదీ హసన్, నజుమ్, ముస్తఫిజుర్, ఇబాదత్.
చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. రోహిత్ దూరం! ఇషాన్ కిషన్‌కు ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment