SMAT 2023: మూడో పరాజయం.. ​క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలు లేనట్లే! | SMAT 2023: Saurashtra Beat Andhra By 7 Wickets | Sakshi
Sakshi News home page

SMAT 2023: మూడో పరాజయం.. ​క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలు లేనట్లే!

Published Thu, Oct 26 2023 12:00 PM | Last Updated on Thu, Oct 26 2023 12:15 PM

SMAT 2023: Saurashtra Beat Andhra By 7 Wickets - Sakshi

శ్రీకర్‌ భరత్‌- రషీద్‌ (ఫైల్‌ ఫొటోలు)

SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది.

షేక్‌ రషీద్‌ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశ్విన్‌ హెబ్బర్‌ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్‌ ఉనాద్కట్‌ (2/35), చిరాగ్‌ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్‌ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు.

క్వార్టర్‌ అవకాశాలు గల్లంతు
అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్‌ దేశాయ్‌ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), తరుణ్‌ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. గ్రూప్‌ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకునే అవకాశం లేదు.

చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ కోచ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement