Ranji Trophy 2022- 23 Andhra vs Hyderabad- సాక్షి, విజయనగరం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 62 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. తద్వారా తమ ఆధిక్యాన్ని 168 పరుగులకు పెంచుకుంది.
సీఆర్ జ్ఞానేశ్వర్ (96 బంతుల్లో 72; 15 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (33; 4 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 70 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 43 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆంధ్ర జట్టును నిలబెట్టారు. ఆంధ్ర కోల్పోయిన మూడు వికెట్లను హైదరాబాద్ బౌలర్ రక్షణ్ రెడ్డి పడగొట్టాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 79/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 118 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులవద్ద ఆలౌటై 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది.
శశాంక్ (55 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/64), కేవీ శశికాంత్ (3/40), సుదర్శన్ (2/47) విజృంభించి హైదరాబాద్‌ను 200 స్కోరులోపు కట్టడి చేశారు.
సౌరాష్ట్ర 503/6
రాజ్‌కోట్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 184/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది. అర్పిత్ (127 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (107; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తొలి రోజు జైదేవ్ ఉనాద్కట్ (8/39) ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం
Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment