విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా దీటుగా బదులిస్తోంది. 25 ఓవర్లకు ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(21), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ స్టారర్ బ్యాటర్ ఓలీ పోప్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్టంపౌట్ ఛాన్స్‌ను మిస్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్‌ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది.
వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టి ఉంటే పోప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చెరేవాడు. రిప్లేలో క్లియర్‌గా పోప్ క్రీజుకు బయట ఉన్నట్లు కన్పించింది. వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పనిచేశావు భరత్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కాగా తొలి టెస్టులో కూడా పోప్‌కు అవకాశాలు ఇవ్వడంతో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు మరోసారి ఛాన్స్ రావడంతో అందుకు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి.
Early reprieve for Ollie Pope as KS Bharat missed a stumping chance! 👀#CricketTwitter #INDvENG #India #England #KSBharat pic.twitter.com/Z7dYmLHXTv
— CRICKETNMORE (@cricketnmore) February 3, 2024
Comments
Please login to add a commentAdd a comment