టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్‌గా రాణించిన శ్రీకర్ భరత్.. తన హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తాచాటాలని భరత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది.
"వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్ భరత్‌ను ఘనంగా సన్మానించనున్నాం. ఈ కార్యక్రమం గురువారం స్టేడియంలో నిర్వహించనున్నాం. ఇది అతడి విజయానికి దగ్గిన గౌరవం" అని న్యూస్ 18తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
బాల్ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా..
కేఎస్ భరత్ క్రికెట్ జర్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంతోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్‌గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో
భరత్ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్ సీకే నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నారు. ఎమ్‌ఎస్‌కె ప్రసాద్, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment