KS Bharat Pulls off MS Dhoni Esque Stumping To Dismiss Labuschagne - Sakshi
Sakshi News home page

IND vs AUS: వారెవ్వా భరత్‌.. ధోనిని గుర్తుచేసేలా స్టంపౌట్‌! వీడియో వైరల్‌

Published Thu, Feb 9 2023 1:58 PM | Last Updated on Thu, Feb 9 2023 5:40 PM

KS Bharat pulls off MS Dhoni esque stumping to dismiss Labuschagne - Sakshi

Twitter Pic

టీమిండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ అరంగేట్ర టెస్టులోనే తన వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో అందరిని అకట్టుకుంటున్నాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో భరత్‌ అద్భుతమైన స్టంపౌట్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లాబుషేన్‌ను మెరుపు వేగంతో స్టంప్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో ఐదో బంతికి లాబుషేన్‌ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి కవర్‌డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్‌ అయ్యి నేరుగా వికెట్‌ కీపర్‌ భరత్‌ చేతికి వెళ్లింది. ‍బంతిని అందుకున్న భరత్‌ రెప్పపాటు వేగంలోనే బెయిల్స్‌ను పడగొట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.

పలు కోణాల్లో పరీశీలించిన థర్డ్‌ అంపైర్‌.. లాబుషేన్‌ క్రీజుకు దూరంగా ఉండటంతో ఔట్‌గా ప్రకటించాడు. దీంతో 49 పరుగులు చేసిన లాబుషేన్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. భరత్‌ స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనిని భరత్‌ గుర్తుచేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్‌ వికెట్‌.. రోహిత్‌, ద్రవిడ్‌ రియాక్షన్‌ మామూలుగా లేదుగా! వీడియో వైరల్‌
                  KS Bharat: కేఎస్‌ భరత్‌ అరంగేట్రం.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement