దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా యంగ్ వికెట్‌కీపింగ్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్న పలంగా స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాల చేత ఇషాన్ ఇండియాకు బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత టెస్ట్ జట్టులో ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్న భరత్.. భారత టెస్ట్ జట్టుతో త్వరలోనే కలుస్తాడని పేర్కొంది.
కాగా, సౌతాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు ఇషాన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. టెస్ట్ సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి అతను ఇంటి వెళ్లిపోవడంతో అనూహ్యంగా కేఎస్ భరత్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. భరత్.. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్‌కీపర్ ఛాయిస్‌గా టీమిండియాలో చేరతాడు.
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్)
భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుండగా.. రెండో టెస్ట్ కేప్‌టౌన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 మధ్యలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment