సర్ఫరాజ్ ఖాన్ (PC: X)
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు.
సర్ఫరాజ్ సెంచరీ మిస్
పాటిదార్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి.
223 ఇంగ్లండ్ ఆలౌట్
ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు.
మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు.
భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు
మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది.
సర్ఫరాజ్‌ను ఇకనైనా టీమిండియాలోకి?
మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది.
అయితే, మిగిలిన మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు.
చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ..
Comments
Please login to add a commentAdd a comment