India A Team
-
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్‌ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్ ‘ఎ’
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోరీ్నలో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్ సింధు 4, రాజ్వర్ధన్ 3, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్ (21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’తో తలపడుతుంది. -
అదరగొట్టిన సౌరభ్, నవదీప్.. 112 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Bangladesh A vs India A, 1st unofficial Test: బంగ్లాదేశ్- ఏతో అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లతో చెలరేగగా.. పేసర్ నవదీప్ సైనీ 3 వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి తోడు ముకేశ్ కుమార్ రాణించడంతో బంగ్లా జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. కాగా టీమిండియా కంటే ముందు భారత- ఏ జట్టు బంగ్లాదేశ్‌కు పయనమైన విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్- ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్)లు ఆడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి కాక్స్ బజార్ వేదికగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు విజృంభించారు. నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావిలకమైంది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ 1, జాకిర్ హసన్ 0 పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన షాంటో 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొమినుల్ 4 పరుగులకే అవుట్ కాగా.. కెప్టెన్ మహ్మద్ మిథున్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొసద్దెక్ ఒంటరి పోరాటం ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మొసద్దెక్ హొసేన్ 63 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సౌరభ్ కుమార్ అతడిని పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ఈ క్రమంలో 45 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బంగ్లా- ఏ జట్టు ఆలౌట్ అయింది. సౌరభ్‌కు 4, నవదీప్‌నకు మూడు, ముకేశ్ కుమార్‌కు రెండు, అతిత్ షేత్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే.. -
టీమిండియా బంగ్లా పర్యటన.. నవంబరు 29న ‘మొదటి మ్యాచ్’! పూర్తి షెడ్యూల్, వివరాలు
India Tour Of Bangladesh 2022: న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌కు పయనం కానుంది. కివీస్ టూర్‌కు గైర్హాజరైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 4 నుంచి రోహిత్ సారథ్యంలో వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే అంతకంటే ముందు అంటే.. మంగళవారం నుంచి భారత- ఏ జట్టు బంగ్లా-ఏ జట్టుతో తలపడనుంది. ఇక ఈ పర్యటనలో భారత ఏ జట్టు రెండు టెస్టులు ఆడనుండగా.. రోహిత్ సేన మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బంగ్లా పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, ప్రత్యక్ష ప్రసారాలు, జట్లు తదితర వివరాలు బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత- ఏ జట్టు బంగ్లాదేశ్-ఏ జట్టుతో నాలుగు రోజుల టెస్టులు ఆడనున్న భారత- ఏ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో తెలుగు యువ కెరటం తిలక్ వర్మకు చోటు దక్కింది. జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కన్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షేత్. షెడ్యూల్ ఇలా మొదటి టెస్టు: నవంబరు 29- డిసెంబరు 2- కాక్స్ బజార్ రెండో టెస్టు: డిసెంబరు 6- డిసెంబరు 9- సెహ్లెట్ స్టేడియం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్- షెడ్యూల్ మొదటి వన్డే: డిసెంబరు 4- ఆదివారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా రెండో వన్డే: డిసెంబరు 7- బుధవారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా మూడో వన్డే: డిసెంబరు 10- శనివారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆరంభం జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్. టెస్టు సిరీస్ తొలి టెస్టు డిసెంబరు 14- 18: జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చట్టోగ్రామ్ రెండో టెస్టు డిసెంబరు 22- 26: షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభం జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్. లైవ్ స్ట్రీమింగ్ భారత్‌లో- సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం టీవీ బ్రాడ్‌కాస్టర్- సోనీ స్పోర్ట్స్ 3(హిందీ) సోనీ స్పోర్ట్స్ 4(తమిళ్/తెలుగు) సోనీ స్పోర్ట్స్ 5(ఇంగ్లిష్) బంగ్లాదేశ్‌లో- టీవీ బ్రాడ్‌కాస్టర్ గాజీ టీవీ చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు IPL 2023: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! భారీ ధర పలికే అవకాశం? -
భారత ‘ఎ’ వన్డే జట్టులో తిలక్ వర్మ
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌తో హైదరాబాద్ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ చాన్స్ మీద చాన్స్ కొట్టేస్తున్నాడు. తొలుత న్యూజిలాండ్ ‘ఎ’తో 3 మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతన్ని తాజాగా న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ కొనసాగిస్తున్నారు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. కెప్టెన్‌గా సంజూ సామ్సన్ వ్యవహరిస్తాడు. చెన్నై వేదికగా ఈ మూడు వన్డేలు ఈనెల 22, 25, 27 తేదీల్లో జరుగుతాయి. భారత్ ‘ఎ’ వన్డే జట్టు: సంజూ సామ్సన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్, తిలక్ వర్మ, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, శార్దుల్ ఠాకూర్, ఉమ్రాన్ మలిక్, నవ్‌దీప్ సైనీ, రాజ్ అంగద్, రాహుల్ చహర్, షహబాజ్ అహ్మద్. -
టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్ సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఔట్
స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నుంచి భారత-ఏ జట్టు స్టార్ బౌలర్ ఔటయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బెంగళూరు వేదికగా ఇవాల్టి (సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ తప్పుకున్నాడు. ఆఖరి నిమిషంలో ప్రసిద్ధ్ కృష్ణ తప్పుకోవడంతో టీమిండియా అనుభవలేమి పేస్ దళంతో బరిలోకి దిగింది. గత కొంతకాలంగా తరుచూ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రసిద్ధ్.. ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కే అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. కాగా, కివీస్-ఏతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ప్రియాంక్ పంచల్ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ధ్ తప్పుకోవడంతో భారత-ఏ జట్టు నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. ముకేశ్ కుమార్, యశ్ దయాల్, అర్జన్ నగ్వస్వల్లా, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్ భారం మొత్తాని మోయగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పార్ట్ టైమ్ బౌలర్‌గా సేవలందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్-ఏ టీమ్ 61 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చదవండి: మళ్లీ బ్యాట్ పట్టనున్న సెహ్వగ్.. గుజరాత్ కెప్టెన్‌గా ఎంపిక -
పతకం రేసులో భారత్ ‘ఎ’
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది. -
భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా..
India And South Africa A Series Draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికారిక టెస్టు కూడా ‘డ్రా’గా ముగిసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 0–0తో ‘డ్రా’ అయ్యింది. 304 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్... మ్యాచ్ చివరి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 311 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జుబేర్ హమ్జా (125 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. చాలెంజర్ విజేత ఇండియా ‘ఎ’ సాక్షి, విజయవాడ: సీనియర్ మహిళల క్రికెట్ చాలెంజర్ ట్రోఫీని ఇండియా ‘ఎ’ జట్టు గెలుచు కుంది. గురువారం మూలపాడు మైదానంలో జరిగిన ఫైనల్లో ‘ఎ’ 3 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ను ఓడించింది. ముందుగా ‘డి’ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (74 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు), ఎస్. మేఘన (44 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. డీడీ కసట్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ‘ఎ’ టీమ్ 45.4 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. యస్తిక భాటియా (102 బంతుల్లో 86; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చల్లా ఝాన్సీ లక్ష్మీ(70 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీసినా లాభం లేకపోయింది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..!
Two India A Coaches Tests False Positive For Covid: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన టీమిండియా సైతం ఈ వార్త విని ఆందోళనకు గురైంది. అయితే, ఆ ఇద్దరు కోచింగ్ సిబ్బందికి రెండోసారి కోవిడ్ పరీక్ష నిర్వహించగా, అందులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్లూంఫాంటేన్ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్‌లకు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ప్రాధమిక పరీక్ష ఫలితాలు తప్పు అని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సదరు పత్రిక తెలిపింది. భారత బృంద సభ్యులందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్‌ను యధాతథంగా కొనసాగిస్తున్నారు. ఫాల్స్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు కోచ్‌లను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్‌గా శుభ్‌దీప్ ఘోష్‌లను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపింది. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రకంపనల కారణంగా భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనున్నాయి. అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో.. -
ఆసీస్ ‘ఎ’కు ఆధిక్యం
సిడ్నీ: టెస్టు సిరీస్ సన్నాహాల కోసం జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/44), సిరాజ్ (2/71) టచ్‌లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఆధిక్యం లభించింది. ముందుగా సోమవారం 237/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ మరో 10 పరుగులే చేసి 247/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 85 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్రీన్ (114 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. టిమ్ పైన్ (44; 4 ఫోర్లు) కూడా రాణించాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆటకు ఆఖరి రోజు. మిగిలిన 2 వికెట్లను పడగొట్టాక... భారత ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. -
శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘ఎ’ జట్టు డ్రాగా ముగించింది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 346 పరుగుల వెనుకబడి ఉన్న సమయంలో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. దాంతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అజేయం నిలిచి మ్యాచ్‌ను ఓడిపోకుండా కాపాడాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 279 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 4 సిక్స్‌లు సాయంతో 204 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వికెట్‌కు ప్రియాంక్ పాంచల్(115)తో కలిసి 167 పరుగులు జత చేసిన గిల్.. అనంతరం హనుమ విహారి(100 నాటౌట్)తో కలిసి నాల్గో వికెట్‌కు అజేయంగా 222 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. గిల్ డబుల్ సెంచరీకి తోడు, హనమ విహారి, ప్రియాంక్ పాంచ్లు సెంచరీలు సాధించడంతో మ్యాచ్‌ను భారత్ కోల్పోకుండా కాపాడుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 216 పరుగులకు ఆలౌటైతే, కివీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 562/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. -
పోరాడుతున్న భారత్ ‘ఎ’
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి భారత్ ‘ఎ’ పోరాడుతోంది. 346 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (0) ‘గోల్డెన్ డక్’గా అవుటై మరోసారి నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (26; 1 ఫోర్) కూడా విఫలమయ్యాడు. అయితే ప్రియాంక్ పాంచల్ (67 బ్యాటింగ్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (33 బ్యాటింగ్; 2 ఫోర్లు) మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ప్రస్తుతం భారత్ మరో 219 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 385/5తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 160.3 ఓవర్లలో 7 వికెట్లకు 562 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డేన్ క్లీవర్ (196; 20 ఫోర్లు, సిక్స్) త్రుటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. మార్క్ చాప్‌మ్యాన్ (114; 11 ఫోర్లు) శతకం సాధించాడు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్ చెరో రెండు వికెట్లు తీశారు. -
భారత్ ‘ఎ’ 216 ఆలౌట్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 83; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హనుమ విహారి (79 బంతుల్లో 51; 8 ఫోర్లు) మినహా... మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 54.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ‘ఎ’ బౌలర్లు మైకెల్ రే (4/54), కోల్ మెకోంచి (3/33) రాణించారు. అనంతరం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. -
భారత ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా విహారి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో న్యూజిలాండ్ పర్యటించే భారత ‘ఎ’ జట్లను సెలక్టర్లు ప్రకటించారు. ఈ టూర్లో భాగంగా ‘ఎ’ టీమ్ 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన పలువురు ఆటగాళ్లను రెండు అనధికారిక టెస్టుల కోసం ఎంపిక చేశారు. ఈ రెండు టెస్టులకు ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి నాయకత్వం వహిస్తాడు. చతేశ్వర్ పుజారా, రహానే, మయాంక్ అగర్వాల్, సాహా, అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఆడతారు. డోపింగ్ నిషేధం ముగిసిన మళ్లీ దేశవాళీ బరిలోకి దిగిన పృథ్వీ షాకు కూడా ఇందులో చోటు దక్కింది. ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ రెండు టీమ్‌లలోనూ ఉన్నాడు. వన్డే జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టీమ్‌లో కూడా సిరాజ్‌కు అవకాశం దక్కింది. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయడం విశేషం. ‘ఎ’ సిరీస్ తర్వాత భారత సీనియర్ జట్టు కివీస్‌తో తలపడనున్న నేపథ్యంలో సన్నాహకంగా అనేక మంది రెగ్యులర్ ఆటగాళ్లను ముందే న్యూజిలాండ్‌కు బీసీసీఐ పంపిస్తోంది. 24 జనవరి నుంచి భారత సీనియర్ టీమ్ పర్యటన మొదలవుతుంది. -
ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టుదే సిరీస్
బ్రిస్బేన్: సిరీస్ విజేతను నిర్ణయించే అనధికారిక మూడో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు సమష్టిగా విఫలమైంది. దీంతో చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (70 బంతుల్లో 45; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ వేద కృష్ణమూర్తి (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఆకట్టుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రానో 3 వికెట్టు తీయగా... అన్నాబెల్ సదర్‌ల్యాండ్ , తహిలా మెక్‌గ్రాత్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 39.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. 119/7తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను బర్న్స్ (52 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), స్ట్రానో (37 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) ఆదుకున్నారు. వీరు అజేయంగా ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు, తనూజా కన్వర్ 2 వికెట్లు దక్కించుకున్నారు. -
ప్రియా సెంచరీ వృథా
బ్రిస్బేన్: తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 81 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. జార్జియా రెడ్మేన్ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, సిక్స్), ఎరిన్ అలెగ్జాండ్రా బర్న్స్ (59 బంతుల్లో 107; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. భారత ‘ఎ’ బౌలర్లలో దేవిక వైద్యకు రెండు వికెట్లు లభించాయి. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ 44.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పూనియా (127 బంతుల్లో 112; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 98 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే షెఫాలీ అవుటయ్యాక... ప్రియా సెంచరీ పూర్తి చేసుకోగా... మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. హేమలత, అరుంధతి రెడ్డి, అనూజా పాటిల్, తనూజ కన్వర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఫలితంగా భారత ‘ఎ’ మహిళలకు ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
వికెట్ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది!
తిరువనంతపురం: తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బౌలర్ల జోరును వర్షం అడ్డుకున్నా... సఫారీని మాత్రం ఆదుకోలేకపోయింది. మూడో రోజు ఆటలో కేవలం 20 ఓవర్ల ఆటే జరిగినా... దక్షిణాఫ్రికా ‘ఎ’ పతనం మాత్రం క్రితం రోజులాగే కొనసాగింది. బుధవారం రెండు సెషన్లను వర్షం తుడిచిపెట్టింది. ఆట చాలా ఆలస్యంగా ఆఖరి సెషన్లో ఆరంభమైంది. ఓవర్‌నైట్ స్కోరు 125/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 55 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సఫారీ జట్టు గత స్కోరుకు కేవలం 54 పరుగులు జోడించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ (48; 5 ఫోర్లు), ముల్డర్ (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు కుదురుగా ఆడారు. కానీ ఆఫ్‌స్పిన్నర్ జలజ్ సక్సేనా ఈ జోడీని విడగొట్టడంతో సఫారీ కష్టాలు మొదటికొచ్చాయి. ఆట నిలిచే సమయానికి సిపమ్లా (5 బ్యాటింగ్), ఇన్‌గిడి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. భారత్ ‘ఎ’ కంటే సఫారీ జట్టు కేవలం 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. ఆఖరి వికెట్‌ను తీసి... నిర్దేశించే కొద్దిపాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు తొలి సెషన్ సరిపోతుంది. -
ఇండియా ‘ఎ’ జట్టులో శిఖర్ ధావన్
వెస్టిండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో చివరి రెండు అనధికారిక వన్డేలలో తలపడే భారత ‘ఎ’ జట్టులోకి ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం శిఖర్ విండీస్ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు. కుడి చేతి బొటన వేలి గాయంతో విజయ్ శంకర్ ‘ఎ’ సిరీస్‌కు దూరమయ్యాడు. -
భారత్ ‘ఎ’ విజయం
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఆరంభమైన ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ ‘ఎ’ శుభారంభం చేసింది. 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టాడు. మొదట బ్యాటింగ్‌లో (36 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి, అనంతరం కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 5 వికెట్లతో రాణించాడు. 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ 6 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (46), మనీశ్ పాండే (39), ఇషాన్ కిషన్ (37) రాణించారు. శివమ్ దూబే (60 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. అనంతరం దక్షిణాఫ్రికా ‘ఎ’ చహల్ స్పిన్ దెబ్బకు 45 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (108 బంతుల్లో 110; 12 ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింది. రెండో వన్డే ఈ నెల 31న జరగనుంది. -
రుతురాజ్ 187 నాటౌట్
బెల్గామ్: ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (136 బంతుల్లో 187 నాటౌట్; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడటంతో... శ్రీలంక ‘ఎ’తో గురువారం జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 48 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. రుతురాజ్ రెండో వికెట్‌కు అన్మోల్ప్రీత్ సింగ్ (67 బంతుల్లో 65; 6 ఫోర్లు)తో కలిసి 163 పరుగులు... మూడో వికెట్‌కు ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, సిక్స్)తో కలిసి 99 పరుగులు జోడించాడు. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసి ఓడిపోయింది. షెహాన్ జయసూర్య (120 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. భారత ‘ఎ’ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. -
భారత్ ‘ఎ’ ఘన విజయం
బెల్గామ్: శ్రీలంక ‘ఎ’ జట్టుపై భారత్ ‘ఎ’ గర్జించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో లంక పనిపట్టింది. దీంతో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 205 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ (4/78, 4/45) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. డిక్వెలా (103; 15 ఫోర్లు) పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేసిన శ్రీలంక ‘ఎ’... రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. ఏ ఒక్కరూ కనీసం 50 పరుగులైనా చేయకుండానే భారత బౌలర్లకు తలవంచారు. సోమవారం 16 వికెట్లు కూలడంతో నాలుగు రోజుల మ్యాచ్ కాస్తా మూడు రోజుల్లోనే ముగిసింది. 83/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లో ప్రియాంజన్ (49; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డిక్వెలా శతకం సాధించాడు. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. సందీప్ వారియర్, జయంత్ చెరో 2 వికెట్లు తీశారు. భారత్‌కు 390 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో అనంతరం ఫాలోఆన్ ఆడిన శ్రీలంక ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. -
తేనెటీగల దాడి.. ఆగిన మ్యాచ్
తిరువనంతపురం : భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో అనుకొని సంఘటన.. కలకలం రేపింది. తిరవనంతపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ మైదానం వేదికగా మ్యాచ్ జరగుతుండగా.. ప్రేక్షకులపైకి ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అభిమానులంతా లబోదిబోమంటూ మైదానం బయటకు పరుగు తీశారు. తేనెటీగల దాడి నుంచి రక్షించుకోవడం కోసం చొక్కాలు విప్పి మరీ పరుగెత్తారు. ఈ అనుకోని ఘటనతో మ్యాచ్ 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. సరిగ్గా మ్యాచ్ 28వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అవి అసలు మైదానంలోకే రాలేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రమే దాడి చేశాయన్నారు. తేనెటీగల దాడి సమయంలో భారత్-ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో నడుస్తున్నాడని, వాటి బారిన పడకుండా పరుగు తీశాడని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. ఇదో దురృష్టకరమైన ఘటనని, ప్రేక్షకుల కోసం గ్యాలరీలను శుభ్రం చేయించమన్నారు. కానీ కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనతో ప్రేక్షకులను పశ్చిమ దిశ గ్యాలరీ నుంచి తూర్పుదిశకు మార్చమన్నారు. -
భారత ‘ఎ’ జట్టులో విహారి, సిరాజ్, భరత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్న ‘ఎ’ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేశారు. ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్ ‘ఎ’ జట్టుకు అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే సారథ్యం వహిస్తారు. ఇక దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్... ‘రెడ్’కు అభిమన్యు మిథున్... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘రెడ్’ జట్టులో ఆంధ్ర పేసర్ ఎర్రా పృథ్వీరాజ్‌కు స్థానం దక్కింది. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్ కీపర్ అభిషేక్ గుప్తాను కూడా ‘రెడ్’కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది. -
భారత్ ‘ఎ’ను గెలిపించిన మయాంక్
లెస్టర్: ముక్కోణపు వన్డే టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘ఎ’ చేతిలో పరాజయం పాలైన భారత ‘ఎ’ జట్టు వెంటనే కోలుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ‘ఎ’ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 49.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. డీసీ థామస్ (64 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా, హేమ్రాజ్ (45) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో దీపక్ చహర్ (5/27) ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం భారత్ 38.1 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు సాధించింది. మయాంక్ అగర్వాల్ (102 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో సత్తా చాటగా, శుబ్‌మన్ గిల్ (92 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్ లో నేడు ఇంగ్లండ్‌తో రెండో సారి తలపడుతుంది.