భారత్‌ ‘ఎ’ 216 ఆలౌట్‌ | India A Team Scored 216 Against New Zealand A Team | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ 216 ఆలౌట్‌

Published Fri, Jan 31 2020 3:22 AM | Last Updated on Fri, Jan 31 2020 3:22 AM

India A Team Scored 216 Against New Zealand A Team - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. శుబ్‌మన్‌ గిల్‌ (83 బంతుల్లో 83; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హనుమ విహారి (79 బంతుల్లో 51; 8 ఫోర్లు) మినహా... మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 54.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ ‘ఎ’ బౌలర్లు మైకెల్‌ రే (4/54), కోల్‌ మెకోంచి (3/33) రాణించారు. అనంతరం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement