టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ పేసర్‌ ఔట్‌ | Prasidh Krishna Out Of NZ A Series Due Back Spasms | Sakshi
Sakshi News home page

టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ పేసర్‌ ఔట్‌

Published Thu, Sep 1 2022 9:34 PM | Last Updated on Fri, Sep 2 2022 7:22 AM

Prasidh Krishna Out Of NZ A Series Due Back Spasms - Sakshi

స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ నుం‍చి భారత-ఏ జట్టు స్టార్‌ బౌలర్‌ ఔటయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బెంగళూరు వేదికగా ఇవాల్టి (సెప్టెంబర్‌ 1) నుంచి ప్రారంభమైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి ప్రసిద్ధ్‌ కృష్ణ తప్పుకున్నాడు. ఆఖరి నిమిషంలో ప్రసిద్ధ్‌ కృష్ణ తప్పుకోవడంతో టీమిండియా అనుభవలేమి పేస్‌ దళంతో బరిలోకి దిగింది. గత కొంతకాలంగా తరుచూ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రసిద్ధ్‌.. ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కే అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. 

కాగా, కివీస్‌-ఏతో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ప్రియాంక్‌ పంచల్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసింది. ప్రసిద్ధ్‌ తప్పుకోవడంతో భారత-ఏ జట్టు నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతోనే బరిలోకి దిగింది. ముకేశ్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, అర్జన్‌ నగ్వస్వల్లా, కుల్దీప్‌ యాదవ్‌లు బౌలింగ్‌ భారం మొత్తాని మోయగా.. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా సేవలందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌-ఏ టీమ్‌ 61 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసిం‍ది. 
చదవండి: మళ్లీ బ్యాట్‌ పట్టనున్న సెహ్వగ్‌.. గుజరాత్‌ కెప్టెన్‌గా ఎంపిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement