సాక్షి, విజయవాడ: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికారిక తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. స్పిన్నర్లు కరణ్ శర్మ, షాబాజ్ నదీమ్‌లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిదేసి వికెట్లు పడగొట్టారు. దీంతో మూలపాడులోని ఏసీఏ మైదానంలో జరిగిన ఈ నాలుగు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 64/2తో మూడో రోజు ఆట కొనసాగిం చిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్లు జార్జ్ వోర్కర్ 35, జీత్ రావల్ 21 పరుగులు చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ భారత స్పిన్ ద్వయానికి తలవంచారు. నదీమ్ (4/51), కరణ్ (4/62) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో కివీస్ జట్టులో ఏ ఒక్కరు క్రీజ్‌లో నిలిచే సాహసం చేయలేకపోయారు. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ‘ఎ’ 147, భారత్ ‘ఎ’ 320 పరుగులు చేశాయి. రెండో అనధికారిక టెస్టు కూడా ఇదే వేదికపై ఈ నెల 30న మొదలవుతుంది.
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ విజయం
Published Mon, Sep 25 2017 11:59 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement