ఆసీస్‌ ‘ఎ’కు ఆధిక్యం | Cameron Green set for Test debut against India | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ ‘ఎ’కు ఆధిక్యం

Published Tue, Dec 8 2020 5:35 AM | Last Updated on Tue, Dec 8 2020 5:35 AM

Cameron Green set for Test debut against India - Sakshi

సిడ్నీ: టెస్టు సిరీస్‌ సన్నాహాల కోసం జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (3/44), సిరాజ్‌ (2/71) టచ్‌లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఆధిక్యం లభించింది. ముందుగా సోమవారం 237/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ‘ఎ’ మరో 10 పరుగులే చేసి 247/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ‘ఎ’ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 85 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గ్రీన్‌ (114 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించాడు. టిమ్‌ పైన్‌ (44; 4 ఫోర్లు) కూడా రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్‌ ‘ఎ’ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆటకు ఆఖరి రోజు. మిగిలిన 2 వికెట్లను పడగొట్టాక... భారత ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్‌ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement