జాదవ్, శామ్సన్ అర్థ సెంచరీలు | Kedar Jadhav, Sanju Samson guide India A to win over NPS | Sakshi
Sakshi News home page

జాదవ్, శామ్సన్ అర్థ సెంచరీలు

Published Tue, Jul 29 2014 5:08 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

Kedar Jadhav, Sanju Samson guide India A to win over NPS

డార్విన్: కేదార్ జాదవ్, సంజూ శామ్సన్ రాణించడంతో ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ పెర్మారెన్స్ స్క్వాడ్(ఎన్పీఎస్)పై భారత్ 'ఎ' జట్టు విజయం సాధించింది. మంగళవారమిక్కడ జరిగిన వన్డేలో 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ ను ఓడించింది. ఎన్పీఎస్ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని 61 బంతులు మిగులుండానే అధిగమించింది. 39.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.

జాదవ్(87), శామ్సన్(55) అర్థ సెంచరీలు సాధించారు. జాదవ్ 53 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఊతప్ప 17, వోహ్రా 25, ఆర్ ధావన్ 22 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement