పాండే సెంచరీ బాదాడు | Manish Pandey, Dhawal Kulkarni star in India A win over South Africa A | Sakshi
Sakshi News home page

పాండే సెంచరీ బాదాడు

Published Wed, Aug 17 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

పాండే సెంచరీ బాదాడు

పాండే సెంచరీ బాదాడు

టౌన్స్ విల్లే: కెప్టెన్ మనీష్ పాండే సెంచరీకి, ధవళ్ కులకర్ణి పదునైన బౌలింగ్ తోడవడంతో దక్షిణాఫ్రికా-ఎ టీమ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్-ఎ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 7 వికెట్లు కో్ల్పోయి ఛేదించింది. వరుసగా వికెట్లు పడుతున్నా సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు పాండే. 105 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 100 పరుగులు సాధించి నాటౌట్ గా మిగిలాడు.

బంతితో పాటు బ్యాటింగ్ లోనూ రాణించిన కులకర్ణి 23 పరుగులతో పాండేకు తోడుగా నిలిచాడు. జాదవ్ 26 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. మిల్లర్(90), ఆడమ్స్(52), బ్రుయిన్(40) రాణించారు. కులకర్ణి 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్, హార్థిక్ పాండ్యా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. పాండేకు 'మ్యాన్ ది మ్యాచ్' దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement