Manish Pandey
-
సంజూ శాంసన్‌కు షాక్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో శాంసన్ చోటు కోల్పోయాడు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందును సంజూని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. సంజూ గైర్హాజరీలో సల్మాన్ నిజర్ కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మొహమ్మద్ అజారుద్దీన్, ఎం అజ్నస్ కేరళకు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్‌గా ఉన్నారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సంజూ శాంసన్ కేరళకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో కేరళ తృటిలో నాకౌట్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఈ టోర్నీలో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 135 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున రెండు సెంచరీలు సాధించాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ జట్టు: సల్మాన్ నిజర్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, షోన్ రోజర్, మొహమ్మద్ అజారుద్దీన్ (వికెట్‌కీపర్), ఆనంద్ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే, సిజోమన్ జోసెఫ్, బాసిల్ థంపి, బాసిల్ NP, నిధీష్ MD, ఈడెన్ యాపిల్ టామ్, షరాఫుద్దీన్ , అఖిల్ స్కారియా, విశ్వేశ్వర్ సురేష్, వైశాక్ చంద్రన్, అజ్నాస్ M (వికెట్‌కీపర్)మనీశ్ పాండే ఔట్విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టును కూడా నిన్ననే ప్రకటించారు. ఫామ్‌ల లేమి కారణంగా స్టార్ ఆటగాడు మనీశ్ పాండే జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మనీశ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో మనీశ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. SMAT-2024లో కర్ణాటక నాకౌట్స్‌కు క్వాలిఫై కావడంలో విఫలమైంది. మనీశ్ గైర్హాజరీలో కర్ణాటక వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ గోపాల్ వ్యవహరిస్తాడు. కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ కొనసాగనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శ్రేయస్ గోపాల్ (వైస్ కెప్టెన్), ఎస్ నికిన్ జోస్, కెవి అనీష్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, అభినవ్ మనోహర్, హార్దిక్ రాజ్, వైషాక్ విజయ్‌కుమార్, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్, కిషన్ బెదరే, అభిలాష్ శెట్టి, మనోజ్ భండాగే , ప్రవీణ్ దూబే, లువ్నిత్ సిసోడియా -
విడాకులంటూ ప్రచారం: మనీష్ పాండే- ఆశ్రిత శెట్టి ఫొటోలు వైరల్
-
హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్?
టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. భార్య, కన్నడ నటి ఆశ్రిత శెట్టితో అతడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి.. ఈ జంట విడాకులకు సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది.మనీశ్ పాండే- ఆశ్రిత శెట్టి సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫొటోలను తొలగించడమే ఇందుకు కారణం. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకుల విషయం నేరుగా చెప్పకుండా.. ఇలా ఫొటోలు డిలీట్ చేసి సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.ఉత్తరాఖండ్ అబ్బాయి-కర్ణాటక అమ్మాయిఈ నేపథ్యంలో మనీశ్- ఆశ్రితల విడాకుల గురించి నెట్టింట చర్చ మొదలైంది. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్ పాండే 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.34 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారత్ తరఫున మొత్తంగా 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 566, 709 పరుగులు చేశాడు. మనీశ్ పాండేకు జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా ఐపీఎల్లో మాత్రం మంచి రికార్డు ఉంది.ఇప్పటి వరకు 171 మ్యాచ్‌లు ఆడిన మనీశ్ పాండే 3850 పరుగులు సాధించాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఐపీఎల్-2024లో కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు సాయం చేశాడు.హీరోయిన్గా నటిస్తూమరోవైపు.. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆశ్రిత శెట్టి తొలుత మోడల్‌గా రాణించింది. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టింది. తులు భాషలో ‘తెలికెడ బొల్లి’ అనే మూవీతో 2012లో నటిగా అరంగేట్రం చేసింది.అదే విధంగా.. ఉదయం ఎన్‌హెచ్4(హీరోయిన్గా), ఒరు కన్మియుమ్ మూను కలావానికలుమ్ వంటి తమిళ సినిమాల్లో కూడా ఆశ్రిత నటించింది.కాగా తమ తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనీశ్ పాండే- ఆశ్రిత శెట్టి కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారు. 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను అభిమానులతో పంచుకునే ఈ జంట.. అకస్మాత్తుగా తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి ఇలా షాకిచ్చింది.చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి -
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
శతక్కొట్టిన పడిక్కల్, మనీశ్ పాండే.. కర్ణాటక భారీ స్కోర్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్‌దత్ పడిక్కల్, మనీశ్ పాండే శతకాల మోత మోగించారు. పడిక్కల్ 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 193 పరుగుల భారీ శతకం బాదగా.. మనీశ్ పాండే సైతం మెరుపు శతకంతో (165 బంతుల్లో 118; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వీరిద్దరికి తోడు శ్రీనివాస్ శరత్ (76) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా.. ఓపెనర్ ఆర్ సమర్థ్ 38, నికిన్ జోస్ 8, శుభంగ్ హేగ్డే 27, విజయ్ కుమార్ వైశాఖ్ 19, రోహిత్ కుమార్ 22 నాటౌట్, విధ్వత్ కవేరప్ప 4 నాటౌట్ పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్ దత్, నమన్ ధిర్ తలో 2 వికెట్లు, సిదార్థ్ కౌల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (85), ప్రభసిమ్రన్ సింగ్ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్ స్కోర్ 169/0గా ఉంది. -
ఒకప్పుడు రూ.11 కోట్లు.. ఇప్పుడు రూ.50 లక్షలు! అయ్యో మనీష్
మనీష్ పాండే.. భారత జట్టు తరపున కంటే ఐపీఎలోనూ ఎక్కువగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్-2014 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలవడంలో పాండేది కీలక పాత్ర. ఫైనల్‌తో పాటు లీగ్ ఆసాంతం పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే మళ్లీ 6 ఏళ్ల తర్వాత కేకేఆర్‌తో పాండే జతకట్టాడు. ఐపీఎల్-2024 వేలంలో అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ గత సీజన్లలో కోట్లు పలికిన పాండే.. ఈసారి మాత్రం రూ.50 లక్షల కనీస ధరకే అమ్ముడుపోయాడు. ఫస్ట్ రౌండ్లో వేలానికి వచ్చిన పాండేను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు. అనంతరం రెండో సారి వేలంలోకి వచ్చిన పాండేను కనీస ధరకు కేకేఆర్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పాండే ఐపీఎల్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. ముంబైతో ఎంట్రీ.. మనీష్ పాండేను 2008 అరంగేట్ర సీజన్లో రూ. 6లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అనంతరం 2009 సీజన్లో ఈ కర్ణాటక బ్యాటర్‌ను రూ.12 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా పూణేవారియర్స్(రూ.20 లక్షలు), కేకేఆర్(రూ.1.70 కోట్లు)కు ప్రాతినిథ్యం వహించాడు. 2018 సీజన్‌కు ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. దీంతో మెగా వేలానికి వచ్చిన అతడిని రూ.11 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు సన్‌రైజర్స్ తరపున ఆడిన మనీష్.. ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని రూ.4.60 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో ఎల్ఎస్జీ విడిచిపెట్టింది. దీంతో ఐపీఎల్-2023 వేలంలో ఢిల్లీ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ అవకాశాన్ని కూడా పాండే సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఢిల్లీ కూడా విడిచి పెట్టింది. దీంతో ఈసారి కేకేఆర్ ప్రాంఛైజీలో చేరాడు. మరి ఈసారి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఇప్పటివరకు 178 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పాండే.. 3808 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
మనీశ్ పాండే, రచిన్‌తో పాటు అతడిని కొంటే సీఎస్కే టాప్-3లో!
ఐపీఎల్-2024 మినీ వేలానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంఛైజీలు తమ ప్రణాళికలతో సిద్ధమైపోయాయి. దుబాయ్ వేదికగా మంగళవారం జరుగనున్న ఆక్షన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ. 38.15 కోట్ల మేర ఖాళీగా ఉన్న పర్సుతో బరిలోకి దిగనుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ అత్యల్పంగా 13.15 కోట్లు కలిగి ఉండి ఆరు ఖాళీలను పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ. 31.4 కోట్ల రూపాయలు మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 28.95 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 32.7 కోట్లు, ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ ఖాతాలో రూ. 29.1 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ పర్సులో రూ. 14.5 కోట్లు , సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ. 34 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ సీఎస్కే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 వేలంలో చెన్నై యాజమాన్యం ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందని పలు సూచనలు చేశాడు. మనీశ్ పాండే, హర్షల్ పటేల్‌లను కొనుక్కుంటే సీఎస్కేకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఆర్సీబీతో పోటీ పడి మరీ సీఎస్కే హర్షల్ పటేల్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై వికెట్ మీద హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఒకవేళ వాళ్లు మనీష్ పాండే.. డారిల్ మిచెల్ లేదంటే రచిన్ రవీంద్రలలో ఒకరు.. హర్షల్ పటేల్‌లను కూడా కూడా కొనుక్కుంటే.. పాయింట్ల పట్టికలో కచ్చితంగా టాప్-3లో ఉంటుంది. ప్రస్తుతం సీఎస్కేకు మిడిలార్డర్లో రాణించగల భారత బ్యాటర్ అవసరం ఉంది. మనీశ్ పాండే ఆ లోటు భర్తీ చేయగలడు. కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. అతడొక మంచి ఫీల్డర్ కూడా! అయితే, ఇప్పటి వరకు తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటపెట్టలేదు. ఈసారి సీఎస్కే గనుక అతడికి అవకాశం ఇస్తే.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో కచ్చితంగా తనను తాను మరోసారి నిరూపించుకోగలడు. ఒకవేళ మనీశ్ పాండే మిడిలార్డర్లో సరైన బ్యాటర్ కాదనుకుంటే సీఎస్కే.. డారిల్ మిచెల్ వైపు చూసే అవకాశం ఉంది. లేదంటే.. రచిన్ రవీంద్రకు పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది’’ అని బ్రాడ్ హాగ్ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్ కావడంతో మిడిలార్డర్లో అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేసే దిశగా సీఎస్కే ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యావైపు మొగ్గు!? గావస్కర్ చెప్పిందిదే.. -
విజృంభించిన మనీశ్ పాండే.. రాణించిన కరుణ్ నాయర్
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్స్‌లో టైగర్స్ టీమ్.. మైసూర్ వారియర్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్.. మొహమ్మద్ తాహా (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (23 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో తాహా, మనీశ్‌లతో పాటు కృష్ణణ్ శ్రీజిత్ (31 బంతుల్లో 38; 5 ఫోర్లు), మాన్వంత్ కుమార్ (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మైసూర్ వారియర్స్ బౌలర్లలో కార్తీక్ 2, మోనిస్ రెడ్డి, సుచిత్, కుషాల్ వధ్వాని తలో వికెట్ పడగొట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మైసూర్ వారియర్స్.. ఇన్నింగ్స్ ఆరంభంలో రవికుమార్ సమర్థ్ (35 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (20 బంతుల్లో 37; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే ఆఖర్లో హుబ్లీ టైగర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మైసూర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హుబ్లీ బౌలర్లలో మాన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, మిత్రకాంత్, కరియప్ప చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
క్రికెటర్ మనీశ్ పాండే కూడా నటినే పెళ్లాడాడు! ఆమె ఎవరంటే.. (ఫోటోలు)
-
కోహ్లి, రాహుల్, హార్దిక్.. వీళ్లెవరూ కాదు! సౌత్ హీరోయిన్ను పెళ్లాడిన క్రికెటర్?
Ashrita Shetty: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ, యువరాజ్ సింగ్- హాజిల్కీచ్, హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్, కేఎల్ రాహుల్- అతియా శెట్టి.. హర్భజన్ సింగ్- గీతా బస్రా, జహీర్ ఖాన్- సాగరిక ఘట్కే... గత దశాబ్దకాలంలో పెళ్లితో ఒక్కటైన క్రికెట్- సినీ సెలబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్ నుంచి నేటి దాకా ఇలా క్రికెట్- సినీ రంగాలను ప్రేమతో ముడివేసిన జంటలెన్నో ఉన్నాయి. వారిలో మనీశ్ పాండే- ఆశ్రిత షెట్టి కూడా ఉన్నారన్న సంగతి కొంత మందికి మాత్రమే తెలుసు. నైనిటాల్ అబ్బాయి ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్ పాండే 2015లో జింబాబ్వేతో వన్డే ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20లలోనూ అరంగేట్రం చేశాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడిన మనీశ్ పాండే.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 566, 709 పరుగులు సాధించాడు. కాగా 2021లో శ్రీలంకతో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల మనీశ్‌కు ఇప్పటి వరకు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్లో మాత్రం యాక్టివ్‌గా ఉన్నాడు మనీశ్. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన అతడు క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కర్ణాటక అమ్మాయిని ప్రేమించి ఇక మనీశ్ పాండే వ్యక్తిగత విషయానికొస్తే... నటి, మోడల్ ఆశ్రిత శెట్టిని ప్రేమించిన అతడు 2019, డిసెంబరు 2న ఆమెను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ నైనిటాల్ అబ్బాయి- కర్ణాటక అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ముంబైలో విద్యనభ్యసించిన ఆశ్రిత తమిళ సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది. సిద్ధార్థ్ సినిమాలో హీరోయిన్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ఉదయం ఎన్‌హెచ్14తో పాటు బుల్లెట్ బాస్య వంటి సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆశ్రితకు ఇన్‌స్టాలో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుటికప్పుడు తన ఫొటోలు, లైఫ్ అప్డేట్లు పంచుకుంటూ ఉంటుంది. బర్త్‌డే విషెస్ కాగా ఆదివారం(జూలై 16) ఆశ్రిత తన ముప్పైవ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆశ్రితకు విషెస్ చెప్పడంతో పాటు మనీశ్ పాండే గురించి అడుగుతూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టడం విశేషం. ఇక ఆశ్రిత కూడా తనకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసింది. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ -
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే ప్రభావం చూపాల్సింది పోయి తన జట్టు ఆటగాడికే ఎసరు పెట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ను అనవసరంగా రనౌట్ అయ్యేలా చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ తొలి బంతిని మనీష్ పాండే కవర్స్ దిశగా ఆడాడు. మనీష్ ముందుకు కదలడంతో సింగిల్‌కు పిలిచాడనుకొని మార్ష్ పరిగెత్తాడు. మనీష్ పరిగెత్తినట్లే చేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే మార్ష్ సగం క్రీజు దాటాడు. బంతిని అందుకున్న రహానే తెలివిగా వ్యవహరించాడు. త్రో వేయకుండా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. మార్ష్ స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నప్పటికి మనీష్ పాండే తన వికెట్‌ను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రహానే వికెట్లను ఎగురగొట్టడంతో పాపం మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ తప్పంతా మనీష్ పాండేదే అని క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చిన మార్ష్.. మనీష్ పాండేను ముందుకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. అయితే మార్ష్ ఔట్‌కు తానే కారణమని తెగ బాధపడిపోయిన మనీష్ పాండే తన చేత్తో హెల్మెట్‌ను బలంగా కొట్టుకోవడం కొసమెరుపు. ఇక మార్ష్‌ను ఔట్ చేసి తాను ఏమైనా ఆడాడా అంటే అదీ లేదు. పైగా 29 బాల్స్ ఎదుర్కొని 27 పరుగులు చేసి పతీరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే పనితనం ఎలా ఉందంటే.. తాను ఆడకపోగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా ఔట్ చేసి విలన్‌గా తయరయ్యాడు. దీంతో మనీష్ పాండేపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా రనౌట్ చేశావు.. ఆడేవాడిని ఔట్ చేశావు.. నువ్వు ఆడకపోయావో అంతే సంగతి.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి! It’s so hilarious to see the way Manish Pandey bodied Marsh after calling him halfway through! 🤣🤣 pic.twitter.com/TIxVPOAlvj — Akif (@KM_Akif) May 10, 2023 Impact of Manish Pandey 🔥 pic.twitter.com/tNhUZtCF3i — Indian Memes (@Theindianmeme) May 10, 2023 చదవండి: రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ఔట్ అనుకుంటా!
ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మనీష్ పాండే అత్యంత పేలవంగా ఔటవ్వడం ఆసక్తి కలిగించింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మనీష్ పాండే ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన స్లో బంతిని ఆడేందుకు క్రీజు దాటిన పాండే అసలు ఎందుకు ఫ్రంట్‌ఫుట్ వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. కాస్త ఫ్రంట్‌ఫుట్ అనుకుంటే పర్వాలేదు.. కానీ రెండు అడుగుల దూరం వచ్చి మరీ వికెట్ సమర్పించుకున్నాడు పాండే. మాములుగా అయితే ఏ క్రికెటర్ అయినా స్లోబాల్‌ను క్రీజులోనే ఆడే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న మనీష్ పాండే ఇంత చెత్తగా ఆడడం ఆశ్చర్యపరిచింది. పాండే క్రీజు దాటిన మరుక్షణమే క్లాసెన్ బెయిల్స్ ఎగురగొట్టాడు. బహుశా మనీష్ పాండే ఔటైన తీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవమైన ఔట్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక మనీష్ పాండే 2021 నుంచి ఐపీఎల్లో అత్యంత చెత్త ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అప్పటినుంచి 20 మ్యాచ్‌లాడిన పాండే 512 పరుగులు మాత్రమే చేవాడు. ఇందులో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. He's actually disgrace to cricket.@im_manishpandey pic.twitter.com/oefH4MKKCU — Anil (@NANI57ANIL) April 29, 2023 చదవండి: అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా -
IPL 2023: పంత్‌కు యాక్సిడెంట్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరంటే..?
Rishab Pant: టీమిండియా యువ వికెట్‌కీపర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పంత్ గాయంపై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ విషయంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మాట్లాడుతూ.. పంత్ మరో 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇదే జరిగితే పంత్.. ఈ మధ్యకాలంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ (స్వదేశంలో జనవరి, ఫిబ్రవరిల్లో జరిగే 3 వన్డేలు, 3 టీ20లు), ఆస్ట్రేలియా సిరీస్ (స్వదేశంలో ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే 4 టెస్ట్‌లు, 3 వన్డేలు), ఐపీఎల్ (మార్చి నుంచి మే వరకు), జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (భారత్ క్వాలిఫై అయితే), జులై, ఆగస్ట్‌ల్లో జరిగే వెస్టిండీస్ టూర్ (2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు), సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్, స్వదేశంలో అక్టోబర్‌లో ఆసీస్‌తో వన్డే సిరీస్ (3 వన్డేలు), అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాగా, అంతర్జాతీయ స్థాయిలో పంత్‌కు (టీమిండియాకు) ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నప్పటికీ, ఐపీఎల్లో అతని స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం చాలా కష్టంగా కనిపిస్తుంది. పంత్ యాక్సిడెంట్ విషయం తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడిన డీసీ యాజమాన్యం.. తమ కెప్టెన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలని ప్రస్తుతం తలలు పట్టుకుంది. విదేశీ ఆటగాడిని కెప్టెన్ చేస్తే, ఓ ఫారిన్ ప్లేయర్‌ను బరిలోకి దించే అవకాశం కోల్పోతామన్నది ఓ సమస్య అయితే, స్వదేశీ ఆటగాళ్లలో అంత అనుభవజ్ఞుడైన నాయకుడు లేకపోవడం మరో సమస్య. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న సంకేతాల ప్రకారం డీసీ యాజమాన్యం విదేశీ ఆటగాడివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞుడు, ఓ సారి ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ (ఎస్ఆర్హెచ్) అయిన డేవిడ్ వార్నర్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని డిసైడైనట్లు సమాచారం. ఒకవేళ డీసీ యాజమాన్యం తమ ప్లాన్ మార్చుకున్నట్లైతే మనీశ్ పాండేను ఆ అదృష్టం వరిస్తుందని డీసీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో మిచెల్ మార్ష్, పృథ్వీ షా పేర్లు వినిపించినప్పటికీ.. వార్నర్ లేదా మనీశ్ పాండేల్లో ఎవరో ఒకరు డీసీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జట్టులో పంత్ స్థానం విషయానికొస్తే.. వికెట్‌కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టు స్థానం పక్కా అని సమాచారం. ఐపీఎల్ 2023 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్.. రిషబ్ పంత్, ఖలీల్ అహ్మద్, అమాన్ హకీం ఖాన్, యశ్ ధుల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేశ్ నాగర్కోటి, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, విక్కీ ఓస్వాల్, మనీశ్ పాండే, రిపల్ పటేల్, అక్షర్ పటేల్, రోవమన్ పావెల్, రిలీ రొస్సో, చేతన్ సకారియా, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం
Manish Pandey: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ఇవాళ రైల్వేస్‌తో మొదలైన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే విశ్వరూపం చూపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ టీ20 తరహాలో విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో క్రిష్ణమూర్తి సిద్ధార్థ్ సైతం అజేయమైన శతకం (221 బంతుల్లో 121 బ్యాటింగ్; 17 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా, మనీశ్ పాండే ధనాధన్ ఇన్నింగ్స్ కర్ణాటక రంజీ జట్టు కంటే అతన్ని ఇటీవలే కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టుకే అధిక ఆనందాన్ని కలిగించింది. కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో జట్టు మెగా వేలంలో మనీష్ పాండేను 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. మనీశ్‌పై ఎల్ఎస్జే భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే, మనీశ్ పాండే ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక జట్టుకే ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ (16), రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ (21) దారుణంగా నిరాశపరిచారు. వీరిద్దరు కర్ణాటక తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. పడిక్కల్‌కు ఆర్ఆర్ జట్టు 7.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేయగా, మయాంక్‌ను పంజాబ్ జట్టు 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే -
IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్ పాండే..?
Manish Pandey Likely To Replace Virat Kohli As RCB Captain: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఆ జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా కోహ్లి సహా మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్సీ, సిరాజ్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, అనూహ్యంగా ఆర్సీబీ కెప్టెన్సీ రేసులోకి మనీశ్ పాండే వచ్చాడు. దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన మనీశ్ పాండేను ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీ అభిమానులను నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మనీశ్కే పగ్గాలు అప్పజెప్పాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. మనీశ్ 2009లో ఆర్సీబీ తరఫున ఆడుతూ ఐపీఎల్లో తొలి శతకం బాదిన భారత అటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని కూడా ఆర్సీబీ యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా స్వతహాగా కర్ణాటక వాసి కావడం, అలాగే ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండటాన్ని సైతం యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మనీశ్ ఇప్పటివరకు 154 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.68 సగటుతో 3560 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, ఆర్సీబీ సారధిగా మనీశ్‌తో పాటు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు సైతం అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరిలో జరిగే మెగా వేలం వరకు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఐపీఎల్ మెగా వేలానికి డేట్స్ ఫిక్స్! -
ఐపీఎల్: ‘వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి.. తిరిగి డబ్బు చెల్లించమనండి’
Netizens Trolls SRH Players: ఐపీఎల్-2021లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతటి ఘోరమైన ఓటమిని తట్టుకోలేకపోతున్నామని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలుస్తారా అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ వంటి వాళ్లకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంఛైజీ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా పంజాబ్ కింగ్స్‌తో సెప్టెంబరు 25న జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఓటమితో.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి.. 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. వార్నర్ అన్నను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకుండా అవమానించారని, సరైన ప్రణాళిక లేకుండా ఈ సీజన్లో చేదు అనుభవాన్ని మిగిల్చారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు భారంగా మారిన మిడిలార్డర్ ‘జాతి రత్నాలు’.. మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌ను ఇకనైనా వదిలించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. వాళ్లిద్దరినీ బ్యాన్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో మనీశ్ పాండే 23 బంతుల్లో 13 పరుగులు చేయగా.. కేదార్ జాదవ్.. 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ రవి బిష్ణోయి బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఇక ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ (కేకేఆర్‌పై 61 (నాటౌట్)) మినహా మిగతా మ్యాచ్‌లలో మనీశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేదార్ జాదవ్ సైతం ఆశించినంతగా రాణించలేదన్న సంగతి తెలిసిందే. SRH owners after buying Kedar Jadhav :#SRHvsPBKS #KedarJadhav pic.twitter.com/mjNNoH3kaH — Vikrant Gupta (@SomewhereNowhe8) September 25, 2021 #PBKSvSRH (Bhuvi Shami Ellis) Well fought Holder you deserve to be in winning side for your tremendous all-round performance But situation of Warner Kane Saha Kedar Jadhav And Manish Pandey.... 🤣 🤣 🤣 🤣 🤣 pic.twitter.com/9v4131iI7O — Roopam Anurag (@RoopamAnurag) September 25, 2021 Manish Pandey played 4 seasons with SRH and cost them 44 crores plus many games, brand value as well. That has to be one of the costliest "CTC" kinda hiring of the IPL. — Manish (@iHitman7) September 25, 2021 We don't have just one we have 3 1.Manish pandey 2.kedar jadhav 3.vijay shankar pic.twitter.com/MOJSkFkJAz — tarakbingumalla (@taraksrinivas) September 25, 2021 -
పూర్తిగా నిరాశపరిచాడు.. జట్టులో చోటు దక్కకపోవచ్చు!
న్యూఢిల్లీ: 26.. 37... 11... శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో టీమిండియా బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే చేసిన పరుగులు. ఈ గణాంకాలను అనుసరించి... మూడు వన్డేల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ మనీశ్, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడంటున్నాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్న సమయంలోనూ హిట్టింగ్ ఆడలేక, తనను నిరాశపరిచాడని పెదవి విరిచాడు. అదే సమయంలో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఆటతో ఆకట్టుకున్నారని, కాబట్టి మిడిలార్డర్లో మనీశ్‌ను ఇకపై చూసే అవకాశం ఉండకపోవచ్చని వీరూ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైన ధావన్ సేన.. 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ... ‘‘హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండ్యా.. ఇద్దరూ పెద్దగా రాణించలేదు. 15- 20 పరుగులు చేసేందుకు ఆయాసపడ్డారు. నిజానికి ఈ సిరీస్‌లో అత్యంత ప్రయోజనం పొందింది ఎవరైనా ఉన్నారంటే అది మనీశ్ పాండే. తను మూడు మ్యాచ్‌లు ఆడాడు. పెద్దగా ఒత్తిడి కూడా లేదు. అయినా, సత్తా చాటలేకపోయాడు. నాకు తెలిసి తనకు ఇక వన్డేల్లో చాన్స్ రాకపోవచ్చు... ఒకవేళ జట్టులో చోటు దక్కినా తనను తాను నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో స్థానం సుస్థిరం చేసుకునేలా కనిపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా(43, 13, 49) కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. -
పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!
బెంగళూరు: అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ సానుభూతిని వ్యక్తం చేశాడు. మనీష్‌కు తగినన్ని అవకాశాలివ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తోక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరు క్రికెటర్లకులా మనీష్‌కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే, ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్, వేగం కలబోసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలో నిలిచిన పాండే 73 బంతుల్లోనే 114 సూపర్ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందాడు. ఆతర్వాత 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్‌కు ఆతర్వాత అవకాశాలు పలచబడ్డాయి. కాగా, మనీష్ ఇప్పటివరకు 26 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 492 పరుగులు చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాల సాయంతో 709 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మనీష్‌కు ఐపీఎల్లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్లో 151 మ్యాచ్‌ల్లో శతకం, 20 అర్ధశతకాలతో సాయంతో 3461 పరుగులు చేశాడు. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
‘ఫామ్‌లోకి రావాలంటే ముందు బ్రేక్ తీసుకో’
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పెట్టుకున్న నమ్మకాన్ని అందుకోలేకపోయిన మనీష్ పాండే తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటేనే మంచిదని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. గడిచిన మూడు మ్యాచ్‌లను చూస్తే ఒక్క సొగసైన ఇన్నింగ్స్(మ్యాచ్‌ను గెలిపించే) కూడా అతని బ్యాట్ నుంచి రాలేదని, దాంతో కాస్త విరామం తీసుకుంటే గాడిలో పడతాడన్నాడు. మనీష్ బ్రేక్ తీసుకుంటే అది అతనికి ఉపయోగపడుతుందని తెలిపాడు. స్పోర్ట్స్ టుడేతో ఓజా మాట్లాడుతూ.. ‘ ఈ ఐపీఎల్ సీజన్లో మనీష్‌కు అతని స్థాయిలో రాణించాలంటే కాస్త విశ్రాంతి అవసరం. వార్నర్, బెయిర్ స్టోలు ఆరంభం విఫలం కాకుండా మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు ఫేవర్‌గా ఉండాలంటే కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లని మిడిల్ ఆర్డర్ పరీక్షించండి. కేవలం వార్నర్-బెయిర్ స్టోలే మ్యాచ్‌లను గెలిపించలేరు. మనీష్‌కు కొన్ని మ్యాచ్‌లు రెస్ట్ ఇవ్వండి. అది అతనికే మంచిదే అవ్వడమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుంది’ అని ఓజా స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సన్‌రైజర్స్ ఇంకా ఖాతా తెరవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట పరాజయం చెందింది. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే పూర్తిస్థాయిలో ఆకట్టులేకవడం ఆ జట్టును నిరాశపరుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీష్ 44 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 7 బంతులాడి 2 పరుగులతో నిరాశపరిచాడు. ఇక్కడ చదవండి: గాయాల బారిన ‘సన్‌రైజర్స్’ అందుకోసమే బంతి విసిరాను..రనౌట్ ఊహించలేదు రోహిత్ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. -
పాండే 14 సార్లు.. ఎస్ఆర్హెచ్ 11 సార్లు
చెన్నై: 29 బంతుల్లో 55 పరుగులు.. 29 బంతుల్లో 43 పరుగులు.. 24 బంతుల్లో 27 పరుగులు.. 24 బంతుల్లో 35 పరుగులు.. ఇది సన్‌రైజర్స్ గత రెండేళ్లలో టార్గెట్‌ను ఛేదించే క్రమంలో చతికిలబడిన వైనం. 2019 ఐపీఎల్ నుంచి చూస్తే సన్‌రైజర్స్ పరిస్థితి ఇలా ఉంది. ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్ల సన్‌రైజర్స్ 24 బంతుల్లో 35 పరుగులు సాధిస్తే విజయం సాధిస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. 29 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకుని పరాజయాన్ని చవిచూసింది. అంతకుముందు గత రెండు సీజన్ల వారిగా చూస్తే గతేడాది దుబాయ్ వేదికగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 14 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. 24 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో సన్‌రైజర్స్ ఇలా కుప్పకూలింది. అదే ఏడాది ఆర్సీబీతో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. 29 బంతుల్లో 43 పరుగులు చేసే క్రమంలో ఆరెంజ్ ఆర్మీ ఇలా చతికలిబడింది. దాంతో అప్పుడు ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 15 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను నష్టపోయింది. ఎస్ఆర్హెచ్ 29 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇలా పేకమేడలా కూలిపోయింది ఎస్ఆర్హెచ్. పాండే 14సార్లు.. ఎస్ఆర్హెచ్ 11సార్లు గత నాలుగు సీజన్లు(2018 నుంచి) మనీష్ పాండే 30, అంతకంటే ఎక్కువ బంతులన్ని 14సార్లు ఆడగా, అందులో ఎస్ఆర్హెచ్ 11సార్లు ఓటమి పాలుకావడం ఇప్పుడు చర్చనీయాశమైంది. ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్‌లో పాండే 39 బంతులు ఆడి 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. షెహబాజ్ వేసిన ఒకే ఓవర్లో మూడు వికెట్లు సాధించాడు. ముందు బెయిర్ స్టోను, ఆపై మనీష్ పాండే, అబ్దుల్ సామద్‌లను బోల్తా కొట్టించి సన్‌రైజర్స్ క్యాంప్‌ను టెన్షన్లో పెట్టాడు. ఆపై మరుసటి ఓవర్‌ను హర్షల్ పటేల్ వేయగా విజయ్ శంకర్ పెవిలియన్ చేరాడు. ఫలితంగా 8 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్ నాలుగు వికెట్లను నష్టపోయింది. 19 ఓవర్లో మరొక వికెట్‌ను నష్టపోవడంతో 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకుంది. ఇలా 29 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఇక ఆర్సీబీ అత్యల్ప స్కోర్లను కాపాడుకుని గెలిచిన మ్యాచ్‌ల్లో నిన్నటి మ్యాచ్ టాప్-4లో చేరింది. 2008లో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేను 126 పరుగులకే పరిమితం చేసి గెలిచిన ఆర్సీబీ.. 2009లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్‌ను 133 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. అదే ఏడాది డర్బన్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జరిగిన మ్యాచ్‌లో 145 పరుగులకే నిలువరించిన ఆర్సీబీ గెలుపును అందుకుంది. -
ఒత్తిడిలో ఎలా ఆడాలో పాండేకు తెలియడం లేదు: నెహ్రా
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 27 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓటమికి మనీష్ పాండే బ్యాటింగ్ ఒక కారణమని టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ''అతను టీమిండియా జట్టులోకి రావడం.. పోవడం వంటివి జరగడానికి కారణం అతని బ్యాటింగ్‌లో అనుకూలత, స్థిరత్వం లేకపోవడమే ప్రధాన కారణం. అందుకే అతనితో పాటు జట్టులోకి వచ్చిన హార్థిక్ సహా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు తమ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే.. పాండే మాత్రం స్థిరత్వం లేని బ్యాటింగ్‌తో టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆడాలో పాండేకు ఇప్పటికి తెలియడం లేదు. అందుకు ఉదాహరణ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ ఉన్నంతసేపు అతనితో మంచి భాగస్వామ్యం నమోదు చేసిన పాండే.. అతను అవుట్ కాగానే అదే టెంపోను చూపించలేకపోయాడు. వార్నర్, బెయిర్ స్టోలు అవుటైనప్పటికి ఎస్ఆర్హెచ్ తాము సాధించాల్సిన పరుగులు తక్కువే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 39 బంతుల్లో 38 పరుగులు చేసిన పాండే చివరి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. అంతేగాక బాధ్యతాయుతంగా ఆడాల్సిన చోట అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకొని మ్యాచ్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది. చదవండి: బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్ ఇది వార్నర్ తప్పిదం కాదా? -
ఆఖరి బంతికి సిక్స్ కొట్టావ్.. అప్పటికే మ్యాచ్ పోయింది!
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే కడవరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడానికి కారణం బంతులు అతని రాడార్‌లో పడకపోవడేమేనని టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అసలు చివరి మూడు ఓవర్లలో మనీష్ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడానికి బంతులు అతని అంచనాకు అందకపోవడమేనన్నాడు. ఎంతో ఒత్డిడి భరిస్తూ ఒక సెట్ అయిన బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను గెలిపించే యత్నంచేసినా అది సఫలం కాలేదన్నాడు. క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘ చివరి మూడు ఓవర్లు చూడండి. పాండే ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. చివరి బంతికి సిక్స్ కొట్టినా అప్పటికి మ్యాచ్ అయిపోయింది. మనీష్ నిజంగానే కీలక పాత్ర పోషించాడు. ముఖ్యమైన వికెట్లు పడిపోయినప్పుడు క్రీజ్‌లో నిలదొక్కుకుని మ్యాచ్‌ను గెలిపించే దిశగా ప్రయత్నం చేశాడు. చాలా ఒత్తిడిలో క్రీజ్‌లో సెట్ అయ్యాడు. మనీష్ ఇంకొన్ని బౌండరీలు కొట్టుంటే ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదు. మనీష్ అనుకున్న రాడార్‌లో బంతులు పడలేదు. అందుకే విఫలమయ్యాడు. కొన్ని సార్లు అలానే జరుగుతుంది. మనీష్ సెట్ అయిన బ్యాట్స్‌మన్. అయినప్పటికీ బంతులు హిట్ చేసేందుకు ఏమాత్రం వీలుకాలేదు. లేకపోతే సన్‌రైజర్స్ ఆ మ్యాచ్ ఓడిపోయేది కాదు’ అని చెప్పుకొచ్చాడు. నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 177 పరుగులు చేసి పరాజయం పాలైంది. మనీష్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మనీష్ పాండే క్రీజ్‌లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు భావించినా కేకేఆర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ జట్టులో వార్నర్(3), సాహా(7)లు ఆరంభంలో పెవిలియన్ చేరగా, మనీష్-బెయిర్ స్టోలు 92 పరుగులతో గాడిలో పెట్టారు. బెయిర్ స్టో మూడో వికెట్‌గా ఔటైన తర్వాత ఆరెంజ్ ఆర్మీపై ఒత్తిడి పడింది. మహ్మద్ నబీ(14), విజయ్ శంకర్(11)లు విఫలం అయ్యారు. చివర్లో అబ్దుల్ సామద్(19 నాటౌట్) రెండు సిక్స్‌లతో అలరించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్‌తోనే సంతృప్తి పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటములతో కుదేల్ అయిన జట్టులో స్ఫూర్తినింపాల్సిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. దానికి భిన్నంగా వ్యవహరించాడు. లీగ్ దశ మ్యాచ్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వరుసగా అయిదింట్లో ఓడిపోయింది. అయితే ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ ఆటగాడు మనీష్ పాండేపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అతన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. సిరాజ్ వేసిన రెండోబంతిని పాండే కవర్స్ వైపు ఆడాడు. అక్కడ ఉన్న మొయిన్ అలీ ఆ బంతిని ఫీల్డ్ చేశాడు. దాన్ని కోహ్లికి అందించాడు. బంతిని అందుకున్న కోహ్లి.. మనీష్ పాండే వైపు చూస్తూ బిగ్గరగా నవ్వాడు. (ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) బహుత్ బడియా. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్ఛా చలో.. అంటూ పాండేను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. ఓపెనర్ గోస్వామి అవుట్ అయిన తరువాత వన్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన పాండే పరుగు చేయడానికి ఐదు బంతులు ఆడాడు. అయితే కోహ్లి స్లెడ్జ్ చేసిన తర్వాత ఒక బంతిని వదిలిపెట్టిన మనీష్ పాండే..ఆ ఓవర్ నాల్గో బంతికి సిక్స్‌తో సమాధానం చెప్పాడు. మనీష్ పాండేను రెచ్చగొట్టడానికి కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉంచితే, సహచర టీమిండియా ఆటగాడిపై స్లెడ్జింగ్ చేయడంపై సన్‌రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా జట్టుకు మనీష్ పాండే ఎంపికయ్యాడు. తనతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోబోయే క్రికెటర్‌పైనే స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో మనీష్ పాండే 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 24 పరుగులు చేశాడు. pic.twitter.com/E76DXLILAw — Simran (@CowCorner9) November 7, 2020 -
‘సిక్సర’ పాండే
హైదరాబాద్ చావోరేవో తేల్చుకుంది. రాజస్తాన్‌ను బంతితో ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాట్‌తో చకచకా పరుగులు జతచేసింది. ముఖ్యంగా మనీశ్ పాండే ఆట నిజంగా హైలైట్సే! ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ల (వార్నర్, బెయిర్‌స్టో)ను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో మనీశ్ సిక్సర్లతో శివతాండవం చేశాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతని మెరుపులు...విజయ్ శంకర్‌తో కలిసి జోడించిన పరుగులు రాజస్తాన్‌ను చిత్తు చేశాయి. దుబాయ్: ఓడితే ముందడుగు కష్టమయ్యే పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శ్రమించింది. ముందు బౌలింగ్‌తో తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హోల్డర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల జడివాన కురిపించాడు. విజయ్ శంకర్ (51 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే అభేద్యంగా 140 పరుగులు జత చేశారు. సన్‌రైజర్స్ జట్టులో గాయపడిన కేన్ విలియమ్సన్, బాసిల్ తంపి స్థానాల్లో హోల్డర్, నదీమ్‌లను తీసుకుంది. చప్పగా సాగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ గెలిచి తీరాల్సిన స్థితిలో రాజస్తాన్ రాయల్స్ బాధ్యత విస్మరించింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఆ నిర్లక్ష్యం కనబడింది. రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ స్టోక్స్ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ. ఇతను, సంజూ సామ్సన్ చాలా సేపే క్రీజులో ఉన్నా... అప్పటికీ చేతిలో 9 వికెట్లున్నా... పెద్దగా బ్యాట్‌కు పనిచెప్పలేదు. దీంతో 8.1 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ జోడీ కొట్టింది మూడే బౌండరీలు... సిక్సయితే ఒక్కటే! నింపాదిగా సాగిన వీరిద్దరి ఆట రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఏమాత్రం అక్కరకు రాకుండా పోయింది. ఇదే అదనుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పట్టు బిగించింది. సామ్సన్ను హోల్డర్, స్టోక్స్‌ను రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత బట్లర్ (9), కెప్టెన్ స్మిత్ (19) వచ్చినా రాజస్తాన్ రాత మార్చలేకపోయారు. స్మిత్‌ను, కాస్తోకూస్తో మెరిపించిన రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా హోల్డరే ఔట్ చేశాడు. ఆఖర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొట్టిన సిక్స్ ఫోర్‌తో రాయల్స్ 150 పరుగులు దాటగలిగింది. ఆరంభానికి ఆర్చర్ తూట్లు ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... హైదరాబాద్ తడబడింది. రాయల్స్ పేసర్ ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఆరంభానికి తూట్లు పొడిచాడు. వరుస ఓవర్లలో డాషింగ్ ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్చర్ నాలుగో బంతికి వార్నర్ (4)ను అవుట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ) బెయిర్‌స్టో (10)ను బౌల్డ్ చేశాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ శిబిరంలో ఉత్సాహం ఒక్కసారిగా ఉరకలెత్తింది. భారీ భాగస్వామ్యం... అయితే రాయల్స్ ఆనందం అంతలోనే ఆవిరైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీశ్‌పాండే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర పిడుగులతో చెలరేగాడు. కార్తీక్ త్యాగి తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన పాండే... స్టోక్స్ వేసిన వరుసటి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ల మీదుగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో విజయ్ శంకర్ నింపాదిగా అడుతూ పాండేకు అండగా నిలిచాడు. అంతటితో ఆగని మనీశ్... త్యాగి మళ్లీ బంతి బౌలింగ్‌కు దిగితే తను మళ్లీ భారీ షాట్లు బాదాడు. ఒక ఫోర్, 2 సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 5.4 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 50 దాటేసింది. తర్వాత కాసేపటికే శ్రేయస్ గోపాల్ ఓవర్లో పాండే మరో సిక్స్ బాదాడు. 28 బంతుల్లో తనూ ఫిఫ్టీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. విజయ్ శంకర్ కూడా అడపాదడపా బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్ స్కోరు, జోరు ఏమాత్రం తగ్గలేదు. 12.3 ఓవర్లలోనే సన్ 100 పరుగులను చేరుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం ఇలాగే దూసుకెళ్లడంతో సమీకరణం సులువైంది. ఆఖరి 30 బంతుల్లో 37 పరుగులే చేయాలి. ఈ దశలో 16వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో శంకర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు రావడంతో మిగిలిన నాలుగు ఓవర్లలో బంతికో పరుగు చేసేలా మారిపోయింది. మనీశ్ ఓవర్‌కో సిక్స్ బాదడంతో 11 బంతులు మిగిలుండగానే హైదరాబాద్ గెలిచింది. పాండే, శంకర్ అబేధ్యమైన మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. సన్‌రైజర్స్ తరఫున గతంలో పలు శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ విదేశీ ఆటగాడి ప్రమేయం లేకుండా... ఇద్దరు భారత ఆటగాళ్లే కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడం మాత్రం ఇదే తొలిసారి. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 19; స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30; సామ్సన్ (బి) హోల్డర్ 36; బట్లర్ (సి) నదీమ్ (బి) శంకర్ 9; స్మిత్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 19; పరాగ్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; తేవటియా (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–30, 2–86, 3–86, 4–110, 5–134, 6–135. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–31–0, హోల్డర్ 4–0–33–3, శంకర్ 3–0–15–1, నటరాజన్ 4–0–46–0, రషీద్ 4–0–20–1, నదీమ్ 1–0–9–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 10; మనీశ్ పాండే (నాటౌట్) 83; విజయ్ శంకర్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–4, 2–16. బౌలింగ్: ఆర్చర్ 4–0–21–2, అంకిత్ రాజ్‌పుత్ 1–0–11–0, కార్తీక్ త్యాగి 3.1–0–42–0, స్టోక్స్ 2–0–24–0, గోపాల్ 4–0–32–0, తేవటియా 4–0–25–0. హోల్డర్‌కు సహచరుల అభినందన -
రాయల్స్ రైజింగ్..
12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ స్కోరు 78/5. మేటి బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్ చేరుకున్నారు. దాంతో రాజస్తాన్ ఓటమి ఖాయంగానే కనిపించింది. స్వల్ప లక్ష్యాల్ని కాచుకునే సన్‌రైజర్స్ బౌలింగ్ దళం ముందర మిగతా రాయల్స్ బ్యాట్స్‌మెన్ ఏం నిలుస్తారులే అనుకున్నారంతా. కానీ రాహుల్ తేవటియా, రియాన్ పరాగ్ అందరి అంచనాలను తల్లకిందులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్ల భరతంపట్టిన ఈ జోడీ రాయల్స్‌కు అద్భుత విజయం అందించింది. స్లో పిచ్‌పై రైజర్స్ బ్యాట్స్‌మెన్ శ్రమించిన చోటే వీరిద్దరూ సులువుగా పరుగులు సాధించారు. వచ్చిన ప్రతీ బౌలర్ పరుగులు సమర్పించుకోవడంతో మరో బంతి మిగిలి ఉండగానే రాజస్తాన్ విజయాన్నందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత రాజస్తాన్ గెలుపు బాట పట్టగా... హైదరాబాద్ ఖాతాలో నాలుగో ఓటమి చేరింది. దుబాయ్: రాజస్తాన్ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. మనీశ్ పాండే (44 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విలియమ్సన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ తేవటియా (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలుత తడబాటు... 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. రైజర్స్ బౌలర్లు చెలరేగడంతో బెన్ స్టోక్స్ (5), బట్లర్ (16), స్మిత్ (5) పవర్‌ప్లే లోపే పెవిలియన్ చేరారు. తర్వాత సంజూ సామ్సన్ (26; 3 ఫోర్లు), ఉతప్ప (18; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త పోరాడినా రషీద్‌ఖాన్ ముందు వారి ఆటలు సాగలేదు. క్రీజులోకి రియాన్ పరాగ్, రాహుల్ తేవటియా వచ్చినప్పటికీ 15 ఓవర్లకు రాజస్తాన్ 94/5తో నిలిచింది. విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి. ఈదశలో సన్‌రైజర్స్ స్కోరు (96/2) కూడా దాదాపు అంతే. అలవోకగా పరుగులు... అప్పటివరకు సింగిల్స్‌కే పరిమితమైన పరాగ్ 16వ ఓవర్ చివరి బంతికి సిక్స్‌తో జోరు పెంచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో తేవటియా 6, పరాగ్ రెండు వరుస బౌండరీలు బాదడంతో 18 పరుగులు జతయ్యాయి. రషీద్ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తేవటియా... నటరాజన్ తర్వాతి ఓవర్లో 4,6 దంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి నాలుగు బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సిక్సర్ బాదిన పరాగ్ జట్టుకు ఊరటనిచ్చే విజయాన్ని అందించాడు. ఆకట్టుకున్న వార్నర్, మనీశ్.. ఆట ఆరంభంలో సన్‌రైజర్స్ అతి జాగ్రత్తకు పోయింది. నాలుగో ఓవర్లో వార్నర్ కొట్టిన ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరచింది. ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదిన బెయిర్‌స్టో (16) మరుసటి బంతికే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ స్కోరు 26/1. మనీశ్ వచ్చాక పరుగుల వేగం కాస్త పెరిగింది. ఏడో ఓవర్ తేవటియా బౌలింగ్‌లో మనీశ్, తర్వాతి ఓవర్లో వార్నర్ చెరో సిక్సర్‌తో అలరించారు. ఈ దశలో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 10–15 ఓవర్ల మధ్య వీరిద్దరు కలిసి కేవలం 2 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు. బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్న ఈ జంటను 15వ ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసి ఆర్చర్ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్లో 4, 6 బాదిన మనీశ్ 13 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత మనీశ్ పెవిలియన్ చేరినా... విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 6,4 బాదిన ప్రియమ్ గార్గ్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. చివరి 30 బంతుల్లో 62 పరుగులు సాధించింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే... అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ మూడో బంతికి రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్వికెట్లో ప్రియమ్ గార్గ్ క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో పరాగ్ బతికిపోయాడు. అప్పటికి పరాగ్ 12 పరుగులతో ఉన్నాడు. ఒకవేళ పరాగ్ క్యాచ్‌ను గార్గ్ పట్టిఉంటే సన్‌రైజర్స్‌కు తుది ఫలితం మరోలా ఉండేదేమో. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఆర్చర్ 48; బెయిర్‌స్టో (సి) సామ్సన్ (బి) త్యాగి 16; మనీశ్ (సి) తేవటియా (బి) ఉనాద్కట్ 54; విలియమ్సన్ (నాటౌట్) 22; ప్రియమ్ గార్గ్ (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–23, 2–96, 3–122, 4–158. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–1, శ్రేయస్ గోపాల్ 4–0–31–0, కార్తీక్ త్యాగి 3–0–29–1, ఉనాద్కట్ 4–0–31–1, తేవటియా 4–0–35–0, బెన్‌స్టోక్స్ 1–0–7–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) ఖలీల్ అహ్మద్ 5; బట్లర్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ అహ్మద్ 16; స్మిత్ (రనౌట్) 5; సంజూ సామ్సన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ ఖాన్ 26; ఉతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 18; రియాన్ పరాగ్ (నాటౌట్) 42; రాహుల్ తేవటియా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–63, 5–78. బౌలింగ్: సందీప్ 4–0–32–0, అహ్మద్ 3.5–0–37–2, నటరాజన్ 4–1–32–0, అభిషేక్ శర్మ 1–0–11–0, రషీద్ ఖాన్ 4–0–25–2, విజయ్ శంకర్ 3–0–22–0. -
మనీశ్ పాండే ఎంతో కీలకం
దుబాయ్: ఐపీఎల్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఎక్కువ భాగం విజయాలు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో జోరు కారణంగానే వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో తర్వాతి బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువగా అవకాశం రాలేదు. దాంతో కీలక సమయంలో ఒత్తిడికి గురై జట్టు విఫలమైంది. అయితే ఈ సారి లీగ్‌లో ఆ లోపాన్ని అధిగమిస్తామని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అన్నాడు. సీనియర్లు, కుర్రాళ్లతో జట్టు సమతూకంగా ఉందని చెప్పాడు. వివిధ అంశాలపై లక్ష్మణ్ చెప్పిన సమాధానాలు అతని మాటల్లోనే... కోవిడ్–19 నేపథ్యంలోని పరిస్థితులపై... బీసీసీఐతో పాటు మా ఫ్రాంచైజీ కూడా రూపొందించిన బయో సెక్యూర్ బబుల్ నిబంధనలు సరైన దిశలో ఉన్నాయి. వాటిని మేమందరం కచ్చితంగా పాటిస్తున్నాం. రిసార్ట్ ఉద్యోగులు, డ్రైవర్ కూడా బబుల్‌లో భాగమే. ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లకు స్పష్టత ఉంది. ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలకు హాజరవుతున్నాం. ట్రాకర్ కూడా అందరం ధరిస్తున్నాం. అంతకు ముందు భారత్‌నుంచి కూడా చార్టెట్ ఫ్లయిట్లోనే భారత ఆటగాళ్లంతా కలిసి వచ్చారు. నిబంధనల ప్రకారమే పరీక్షలకు హాజరయ్యాం. ఇక్కడకి వచ్చాక భోజనం కోసం గానీ ఇతర పనుల కోసం కానీ ఎవరూ ఎవరినీ కలవలేదు. అందరూ నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా అన్ని జాగ్రత్తల మధ్య ప్రాక్టీస్ సెషన్లు మొదలయ్యాయి. ఎల్లకాలం బబుల్‌లోనే ఉండటం కొంత కష్టమే అయినా తప్పదు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!) సన్‌రైజర్స్ జట్టు లోపాలపై... గత ఏడాది టాప్–4లో నిలిచాం. వార్నర్, బెయిర్ స్టో చాలా బాగా ఆడారు. అయితే అదే చివరకు మిడిలార్డర్‌కు తగినంత అవకాశం రాకుండా చేసింది. వారు తిరిగి వెళ్లిపోగానే జట్టు బలహీనంగా కనిపించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వేలానికి వెళ్లాం. దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతులైన కుర్రాళ్లను ఎంపిక చేసుకున్నాం. ప్రియమ్ గార్గ్, సమద్, విరాట్ సింగ్, సందీప్, సంజయ్ యాదవ్‌లు సత్తా చాటుతారనే నమ్మకం ఉంది. ఈ సారి సీనియర్ మనీశ్ పాండేపై బాధ్యత మరింత పెరిగింది. అతనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. పాండేకు తోడుగా విజయ్ శంకర్ మిడిలార్డర్లో ఉన్నాడు. అలాగే విదేశీయుల్లో నబీ, ఫాబియాన్, మార్‡్ష తమ స్థాయికి తగినట్లు ఆడితే మాకు తిరుగుండదు. అన్నింటికి మించి కేన్ విలియమ్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన నాయకత్వ లక్షణాలతో అతను టీమ్‌కు అదనపు బలం. ఈ సారి కూడా కేన్ కీలక పాత్ర పోషిస్తాడు. మొత్తంగా సీనియర్లు, జూనియర్ల కలయికతో టీమ్ చాలా బాగుంది. కొత్త కోచింగ్ బృందంపై... ఈ ఏడాది ట్రెవర్ బెలిస్ కోచ్‌గా వచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా బాగుంది. ఐపీఎల్లో కోల్‌కతాకు టైటిల్ అందించిన ఆయన ఇంగ్లండ్‌కు విశ్వ విజేతగా నిలిపారు. ఆటగాళ్లను బెలిస్ సన్నద్ధం చేస్తున్న తీరు అభినందనీయం. అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలంగా హాడిన్ నాకు తెలుసు. వీరంతా జట్టును గొప్పగా తీర్చి దిద్దుతుండటం చూస్తే సంతోషంగా అనిపిస్తోంది. ప్రేక్షకులు లేకపోవడం... బయటి అంశాల అవసరం లేకుండా తమంతట తాము స్ఫూర్తి పొందడం అగ్రశ్రేణి ఆటగాళ్ల లక్షణం. స్టేడియంలో ప్రేక్షకుల వల్ల ఉత్సాహం పెరుగుతుందనేది వాస్తవమే అయినా...గొప్ప ఆటగాళ్లు పరిస్థితులకు తొందరగా అలవాటు పడతారు కూడా. ఇంగ్లండ్‌లో కూడా ఆటగాళ్లంతా ఇటీవలి సిరీస్‌లలో అభిమానులు లేకుండానే బాగా ఆడగలమని నిరూపించారు. ఎదురుగా కనిపించకపోయినా తమను లక్షలాది మంది వీక్షిస్తున్నారనే విషయం వారికి కూడా తెలుసు. ప్రేక్షకులు లేరనే కారణంగా ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీ స్థాయి, నాణ్యత తగ్గవు. అయినా ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగడమే ఆటగాళ్లకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. వారంతా ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. -
నాకు వేరే చాయిస్ లేదు: మనీష్ పాండే
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌తో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిల ప్రదర్శనే ఎక్కువ హైలైట్ అయ్యింది. న్యూజిలాండ్ 7 పరుగులు చేయాల్సిన తరుణంలో 6 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను శార్దూల్ సాధించి మ్యాచ్‌ను టై చేయడంలో కీలక పాత్ర పోషించగా, సూపర్ ఓవర్లో రాహుల్, కోహ్లిలు బ్యాట్ ఝుళిపించి అద్భుతమైన విజయాన్ని అందించారు. కాగా, అసలు కివీస్ ముందు పోరాడే స్కోరును ఉంచడంలో మనీష్ పాండే ప్రధాన పాత్ర పోషించాడు. కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో సమయోచితంగా ఆడి అజేయంగా హాఫ్ సెంచరీ సాధించాడు. (ఇక్కడ చదవండి: మనీష్ పాండే డబుల్ హ్యాట్రిక్) ఫలితంగా టీమిండియా పోరాడే స్కోరును కివీస్ ముందుంచింది. మ్యాచ్ తర్వాత తన ప్రదర్శనతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌పై మనీష్ మాట్లాడుతూ.. ‘ నా ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నా. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాది ఆరో స్థానమనే ఫిక్స్ అయ్యా. ఆ రకంగానే సన్నద్ధమవుతున్నా. ఎందుకంటే ముందు వరుసలో రావడానికి నాకు చాయిస్ లేదు. ప్రస్తుతం ఆ స్థానం కోసమే మానసికంగా సన్నద్ధమవుతున్నాం. నేను సాధారణంగా మూడు లేదా నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఉంటా. అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో పోటీ నెలకొంది. దాంతో దిగువన రావాల్సి వస్తుంది. మన చాన్స్‌ల కోసం నిరీక్షించకతప్పదు’ అని మనీష్ పాండే తెలిపాడు. -
మనీష్ పాండే డబుల్ హ్యాట్రిక్
వెల్లింగ్టన్: టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20 టీమిండియా వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో పాండే ఆదుకున్నాడు. ఆద్యంతం సమయోచితంగా బ్యాటింగ్ చేసి అజేయంగా హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కేవలం మూడు ఫోర్లు మాత్రమే కొట్టిన మనీష్.. స్టైక్‌ను రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును చక్కదిద్దాడు. మనీష్ పాండే ఇన్నింగ్స్‌తోనే భారత్ జట్టు 165 పరుగుల స్కోరును బోర్డుపై ఉంచకల్గింది. ఇది గౌరవప్రదమైన స్కోరు కావడంతో టీమిండియా కడవరకూ పోరాడటానికి వీలు దొరికింది. (ఇక్కడ చదవండి: ‘సూపర్’ సీక్వెల్) మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లిందంటే అందుకు మనీష్ పాండే ఇన్నింగ్సే ప్రధానం కారణం. అయితే మనీష్ పాండే తన నాటౌట్ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ ఔట్ కానీ మనీష్ పాండే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచి ‘డబుల్ హ్యాట్రిక్’ కొట్టాడు. గత ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మనీష్ పాండే (50 నాటౌట్, 14 నాటౌట్, 14 నాటౌట్, 31 నాటౌట్, 22 నాటౌట్, 2 నాటౌట్) అజేయ యాత్రను కొనసాగించాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 46.40 యావరేజ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి, బాబర్ అజామ్‌ల తర్వాత అత్యుత్తమ యావరేజ్ మనీష్ పాండేదే కావడం విశేషం. 2019 ఆగస్టు 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ భారత్‌కు మనీష్ పాండే 9 సార్లు ప్రాతినిధ్యం వహించగా అందులో ఆరుసార్లు అజేయంగా ఉండటం మరొక విశేషం. అయితే ఈ సమయంలో మనీష్ పాండే ఆడిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. -
మనీష్ పాండే నిలబెట్టాడు..!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాల్గో టీ20లో టీమిండియా 166 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత జట్టులో మనీష్ పాండే(50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) మెరవగా, కేఎల్ రాహుల్(39; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శార్దూల్ ఠాకూర్(20;15 బంతుల్లో 2 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లు ఆరంభించారు. అయితే రెండో ఓవర్ మూడో బంతికే శాంసన్(8) భారీ షాట్‌కు పోయి పెవిలియన్ చేరాడు. ఆపై వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(11)సైతం నిరాశపరిచాడు. (ఇక్కడ చదవండి: శాంసన్ ఏందిది..?) కాసేపటికి అయ్యర్(1) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత జట్టు 52 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో దూబే(12), మనీష్ పాండేల జోడి కాసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 23 పరుగులు జత చేసిన తర్వాత దూబే ఔటయ్యాడు. అటు తర్వాత వాషింగ్టన్ సుందర్ మూడు బంతులాడి డకౌట్‌గా నిష్క్రమించగా, శార్దూల్ ఠాకూర్ ఫర్వాలేదనిపించాడు. పాండేతో కలిసి 43 పరుగుల్ని జత చేశాడు. దాంతో టీమిండియా తేరుకుంది. ఇక చివర్లో సైనీ(11 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో మనీష్ పాండే సమయ స్ఫూర్తితో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించగా, బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు.సౌతీ, కుగ్లీన్, సాన్‌ట్నార్‌లకు తలో వికెట్ లభించింది. -
ఆరుగురు బౌలర్ల వ్యూహం.. శాంసన్, పంత్ డౌటే?
ఆక్లాండ్: కొత్త ఏడాదిలో తొలి విదేశీ పర్యటనను విజయంతో ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లిసేన ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. శుక్రవారం జరిగే తొలి టీ20తో న్యూజిలాండ్ పర్యటనను టీమిండియాను ఆరంభించనుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం కోహ్లి సేన వరుసగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్‌లను కైవసం చేసుకుంది. కొత్త ఏడాదిలో తొలి విదేశీ పర్యటనతో పాటు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ టీ20 సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఆక్లాండ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా జట్టు కూర్పులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడిపై క్లారిటీ కోసమే.. రేపటి మ్యాచ్‌కు కేరళ కుర్రాడు, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆడేది అనుమానంగానే మారింది. అంతేకాకుండా రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఆడకపోవచ్చు. ఎందుకంటే కేఎల్ రాహుల్ కీపర్‌గా సక్సెస్ అవడం, మరో బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేపై స్పష్టత వచ్చేందుకు స్పెషలిస్టు వికెట్ కీపర్‌ను జట్టులోకి తీసుకోవడానికి టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపడంలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మిడిలార్డర్‌ను పరీక్షించే ఉద్దేశంతో మనీశ్ పాండేకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తోంది. దీంతో శాంసన్‌తో పాటు పంత్ కూడా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక గాయం కారణంగా ధావన్ దూరమవడంతో రోహిత్‌తో రాహుల్ ఓపెనింగ్‌కు వస్తాడు. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్లు ఫామ్‌లో ఉండటం, మనీశ్ పాండే నమ్మదగ్గ బ్యాట్స్‌మన్ కావడంతో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా భరోసాతో ఉంది. ఆరుగురు బౌలర్ల వ్యూహం? రోహిత్, రాహుల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండేలతో బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉండటంతో కివీస్‌తో జరిగే తొలి టీ20లో ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. స్పెషలిస్టు వికెట్ కీపర్‌ను తీసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. పేస్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీలు జట్టులో ఉండటం పక్కా అని తెలుస్తోంది. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌లు జట్టులో ఉండే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సుందర్‌లు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థులు కావడంతో ఆరుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక మ్యాచ్ సమయానికి ప్రత్యర్థి జట్టుకు, క్రీడా పండితుల ఊహకందని మార్పులు తుదిజట్టు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చదవండి: ‘అక్తర్.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’ ఆత్మహత్య చేసుకుందామనుకున్నా ‘ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరమా?’ -
'ధోనికి ప్రత్యామ్నాయం అతడే'
అంతర్జాతీయ క్రికెట్లో ఎంఎస్ ధోని భవితవ్యం ఏంటనే దానిపై దేశ వ్యాప్తంగా అతని అభిమానులు మల్లగుల్లాలు పడుతుంటే , పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఆడే ఐదో స్థానానికి మనీష్ పాండే సమర్థవంతుడని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టును షోయబ్ అక్తర్ య్యూట్యూబ్ వేదికగా అభినందించాడు. ఈ సందర్భంగా అక్తర్ తన భావాలను య్యూటూబ్ వేదికగా పంచుకున్నాడు.'ఇన్నాళ్లకు ధోని ఆడే ఐదో స్థానంలో టీమిండియా మేనేజ్మెంట్ సరైన ఆటగాడిని తీసుకువచ్చింది. నా దృష్టిలో మనీష్ పాండే ఐదో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం మనీష్‌కు ఉంది. శ్రేయాస్ అయ్యర్ కూడా తన బ్యాటింగ్ సామర్థ్యంతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడంటూ' తెలిపాడు. (అది భారత్‌కు ఎంతో అవమానకరం: అక్తర్) పనిలో పనిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. 'విరాట్ కోహ్లి మానసికంగా చాలా దృడంగా ఉండగలడు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మళ్లీ ఎలా పైకి రావాలో అతనికి తెలిసినంతగా ఎవరికి తెలీదు. తన సాధికారత బ్యాటింగ్‌తో కోహ్లి ఎన్నో సార్లు జట్టును గెలిపించాడు. ఈ విషయం అతని సహచరులు కూడా ఎన్నో సార్లు ఒప్పుకోవడం జరిగింది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ లాంటి క్రికెటర్లు ఉన్న టీమిండియాకు బెంగుళూరు పిచ్‌పై 300 పరుగుల లక్ష్యాన్ని చేధించడం పెద్ద విషయం ఏం కాదని' అక్తర్ చెప్పుకొచ్చాడు. అలాగే ఆసీస్- టీమిండియాల మధ్య జరిగిన సిరీస్‌ను 'బాటిల్ ఆఫ్ ప్రైడ్'గా అభివర్ణించాడు. ( ‘రోహిత్.. ఆనాటి మ్యాచ్‌ను గుర్తు చేశావ్’) -
ఇది మనీష్ పాండే వికెట్!
రాజ్‌కోట్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(15) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్ షమీ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతికి ఆఫ్ సైడ్‌కు హిట్ చేయగా, మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. బంతి గమనాన్ని అంచనా వేసిన మనీష్ పాండే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అమాంతం పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌కు స్టేడియంలో ప్రేక్షకులకు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురి కాగా, వార్నర్ మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఫోర్ వెళుతుందనుకున్న ఆ షాట్‌ను పాండే క్యాచ్‌గా అందుకోవడంతో వార్నర్ కాసేపు అలానే ఉండిపోయాడు. (ఇక్కడ చదవండి; ఆసీస్‌కు భారీ టార్గెట్) మనీష్ పాండే అసాధారణ ఫీల్డింగ్‌తో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇది షమీ వికెట్ అనడం కంటే పాండే వికెట్ అంటేనే సబబు. అది క్యాచ్‌గా అందుకుంటాడని ఎవరూ ఊహించని సమయంలో పాండే కచ్చితమైన టైమింగ్‌తో గాల్లోకి ఎగిరి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆసీస్ స్కోరు 20 పరుగుల వద్ద వార్నర్ ఔట్ కావడంతో ఫస్ట్ డౌన్లో స్టీవ్ స్మిత్ క్రీజ్‌లోకి వచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది.. శిఖర్ ధావన్(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. (ఇక్కడ చదవండి: కోహ్లి బ్యాడ్‌లక్) -
ఇంటివాడైన మనీష్ పాండే
ముంబై: భారత క్రికెటర్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. ఈరోజు(సోమవారం) సినీ నటి అశ్రిత శెట్టిని మనీష్ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్లో జరిగింది. తమ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన మనీష్-అశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించి ఫోటోను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ మేరకు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక అంతా మంచే జరగాలంటూ సన్‌రైజర్స్ పేర్కొంది. ఐపీఎల్లో మనీష్ పాండే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని మనీష్ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు తాజాగా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు పరుగు తేడాతో తమిళనాడుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. మనీశ్ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్’, ‘ఇంద్రజిత్’ సినిమాల్లోనూ నటించింది. Wishing good luck, happiness and lots of love to @im_manishpandey and Ashrita 🥰 Congratulations!! 🎉🎊#OrangeArmy #ManishPandey #SRHFamily pic.twitter.com/AjdlMOUPQ9 — SunRisers Hyderabad (@SunRisers) December 2, 2019 -
చాంప్ కర్ణాటక
సూరత్: చివరి ఓవర్లో 13 పరుగులు... డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని అందుకునేందుకు తమిళనాడు ముందున్న విజయ సమీకరణం. కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు ఫోర్లు బాది అశ్విన్ సమీకరణాన్ని సులువుగా మార్చాడు. అయితే తర్వాతి రెండు బంతులకు ఒకే పరుగు వచి్చంది. ఐదో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో విజయ్ శంకర్ రనౌటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా సింగిల్ మాత్రమే రావడంతో కర్ణాటక విజయం ఖాయమైంది. నేడు పెళ్లి చేసుకోబోతున్న తమ కెప్టెన్ మనీశ్ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో కర్ణాటక ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మనీశ్ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఆర్పీ కదమ్ (28 బంతుల్లో 35; 5 ఫోర్లు), దేవదత్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), విజయ్ శంకర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు) పోరాడినా లాభం లేకపోయింది. -
మనీశ్ పాండే మెరుపు సెంచరీ
సాక్షి, విజయనగరం: వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో కర్ణాటక మూడో విజయం నమోదు చేసింది. సర్వీసెస్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా వీరవిహారం చేశాడు. మనీశ్ పాండే, దేవదత్ రెండో వికెట్‌కు కేవలం 13.5 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. కర్ణాటక బౌలర్ శ్రేయస్ గోపాల్ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, మయాంక్ మిశ్రా ‘హ్యాట్రిక్’... మంగళవారం ఇతర వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన దీపక్ చాహర్... ఈ టోర్నీలో రాజస్తాన్ తరఫున బరిలోకి దిగాడు. తిరువనంతపురంలో విదర్భతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో దీపక్ చాహర్ (4/18) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దర్శన్, శ్రీకాంత్, అక్షయ్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. వర్షంవల్ల ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించగా... విదర్భ 9 వికెట్లకు 99 పరుగులు చేసింది. అనంతరం వీజేడీ పద్ధతిలో రాజస్తాన్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 107 పరుగులుగా నిర్ణయించారు. అయితే రాజస్తాన్ 8 వికెట్లకు 105 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. విశాఖపట్నంలో గోవాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా (4/6) హ్యాట్రిక్ సాధించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఆదిత్య, అమిత్ వర్మ, సుయశ్‌లను అవుట్ చేశాడు. తొలుత గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు సాధించగా... ఉత్తరాఖండ్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. -
కృనాల్ ఔట్.. మనీశ్ ఇన్
నాగ్‌పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతను తేల్చే పోరుకు రంగం సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల పోరులో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా, ఆదివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్ణయాత్మక చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో ఒక్కో మార్పు చోటుచేసుకున్నాయి. తొలి రెండు టీ20ల్లో అంతగా ప్రభావం చూపని ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై వేటు పడింది. అతడి స్థానంలో బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక బంగ్లా జట్టు నుంచి ఆఫ్ స్పిన్నర్ మొసద్దిక్ హుస్సేన్‌ను తప్పించి మిథున్‌ను తీసుకున్నారు. గత మ్యాచ్ ఫలితాన్ని బట్టి చూస్తే టీమిండియా ప్రత్యర్థికంటే బలంగా కనిపిస్తుండగా, తప్పులు సరిదిద్దుకొని మరో అద్భుత విజయం సాధించాలనే లక్ష్యం బంగ్లా జట్టులో కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్ సిరీస్‌ను విన్నర్‌గా డిసైడ్ చేసేదే కాదు.. యువ క్రికెటర్లకు చివరి సువర్ణావకాశం. ముఖ్యంగా రిషభ్ పంత్, ఖలీల్ అహ్మద్‌లు తర్వాతి సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. ఇక నాగ్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ గ్రౌండ్ పెద్దగా ఉండటంతో భారీ స్కోర్ నమోదవడం కష్టం. దీంతో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, మనీశ్, సుందర్, చహల్, చహర్, ఖలీల్ అహ్మద్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), సర్కార్, దాస్, నయీమ్, ముష్ఫికర్, అఫీఫ్, మిథున్, అమీనుల్, ముస్తఫిజుర్, అల్ అమీన్, తైజుల్. -
హీరోయిన్ను పెళ్లాడనున్న మనీశ్ పాండే
బెంగళూరు: టీమిండియా ఆటగాడు, కర్ణాటక బ్యాట్స్ మన్ మనీశ్ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. సినీ నటి అశ్రిత షెట్టిని అతను వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 2న వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్’, ‘ఇంద్రజిత్’ సినిమాల్లోనూ నటించింది. కాగా, మనీశ్ పాండే ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు సారథ్యం వహిస్తున్నాడు. మనీశ్–అశ్రిత పెళ్లి అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. -
పాండే సెంచరీ.. కృనాల్ పాంచ్ పటాక
అంటిగ్వా : సారథి మనీశ్ పాండే సెంచరీతో పాటు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్-ఏతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా-ఏ 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఆటగాళ్లలో మనీష్ పాండే(100; 87 బంతుల్లో) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(77), శ్రేయాస్ అయ్యర్(47)లు రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా(5/25) నిప్పులు చెరగడంతో విండీస్ కనీసం 150 పరుగులు కూడా దాటలేకపోయింది. కరేబియన్ ఆటగాళ్లలో క్యాంప్‌బెల్(21), సునీల్ అంబ్రిస్(30) మినహా ఎవరూ రాణించలేకపోయారు. -
ప్లే ఆఫ్‌కు రోహిత్ సేన అర్హత
-
ముంబై మురిసె...
సహజంగా సిక్స్‌లు, ఫోర్లతో ఊగే ఐపీఎల్ మ్యాచ్‌ను ఈసారి ఉత్కంఠ ఊపేసింది. ఈ మ్యాచ్‌లో ‘సూపర్’ ఫలితంతో ముంబై ఇండియన్స్ ముందంజ వేసింది. మూడో జట్టుగా ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సంపాదించింది. మనీశ్ పాండే ప్రదర్శనతో ఆఖరిదాకా పోరాడిన హైదరాబాద్ సూపర్ ఓవర్లో బోర్లా పడింది. ముందుకెళ్లే ఆశల్ని క్లిష్టం చేసుకుంది. చిత్రంగా ఈ సూపర్ ఓవర్ పోరు 7 బంతుల్లోనే ముగిసింది. హైదరాబాద్ మొదటి నాలుగు బంతుల్లో 2 వికెట్లను కోల్పోయి 8 పరుగులు చేయగా... ముంబై 3 బంతుల్లోనే 9 పరుగులు చేసి గెలిచింది. ముంబై: ఇరు జట్లకు కీలకమైన ఈ పోరులో ఆఖరిదాకా ముంబై, హైదరాబాద్ జట్లు పోరాడాయి. దీంతో 20 ఓవర్ల సమరంలో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ‘సూపర్ ఓవర్’ తేల్చేసిన ఫలితం హైదరాబాద్‌కు శరాఘాతమైంది. ముంబైని ముందుకు తీసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (58 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. సన్‌రైజర్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 162 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా, హార్దిక్, కృనాల్ తలా 2 వికెట్లు తీశారు. మ్యాచ్ ‘టై’ కావడంతో... ఫలితం తేలడానికి ఒక్కో ఓవర్‌తో కూడిన సూపర్ ఓవర్‌ను ఆడించారు. ఈ సూపర్ ఓవర్లో ముంబై మూడు బంతుల్లోనే గెలిచింది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చెన్నై, ఢిల్లీ, ముంబై ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో... మిగిలిన మరో బెర్త్ కోసం నాలుగు జట్లు హైదరాబాద్, పంజాబ్, కోల్‌కతా, రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటీలో ఉన్నాయి. ఎవరూ పెద్దగా నిలబడలేదు... టాస్ నెగ్గిన ముంబై కీలక మ్యాచ్‌లో ఛేదనలో ఎదురయ్యే ఒత్తిడి కంటే ముందు బ్యాటింగ్ చేయడమే నయమనుకుంది. మంచి పవర్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో మాత్రం పరుగులు చేయలేకపోయింది. మెరుపులు మెరిపించే బ్యాట్స్‌మన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. కడదాకా నిలబడిన ఓపెనర్ డికాక్ మాత్రం భారీ షాట్లు ఆడలేకపోయాడు. డికాక్‌తో ముంబై ఆట ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నంతసేపూ బౌండరీలతో అలరించాడు. కానీ ఈ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. భువీ, ఖలీల్ అహ్మద్ వేసిన తొలి రెండు ఓవర్లలోనే ఐదు బౌండరీలు బాది ఊపుమీదున్న రోహిత్ (18 బంతుల్లో 24; 5 ఫోర్లు) ఆట ఆరో ఓవర్లోనే ముగిసింది. తర్వాత డికాక్‌కు సూర్యకుమార్ యాదవ్ జతయ్యాడు. ఈ జోడి జోరుగా సాగిపోతున్న దశలో సూర్యకుమార్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)నూ ఖలీలే ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత లూయిస్ (1) విఫలమయ్యాడు. అతన్ని నబీ పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి దాకా ఆడింది డికాక్ ఒక్కడే... బాసిల్ థంపి వేసిన 14వ ఓవర్లో హార్దిక్ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదగా... డికాక్ మరో ఫోర్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ముంబై 16 పరుగులు చేసింది. దీంతో ముంబై స్కోరు వంద దాటింది. తర్వాత రషీద్ ఖాన్ మాత్రం తన ఓవర్లో ఆ అవకాశమివ్వలేదు. నాలుగు సింగిల్స్ ఇచ్చిన ఈ స్పిన్నర్ రెండు డాట్ బాల్స్ వేశాడు. 16వ ఓవర్లో భువీ 7 పరుగులిచ్చి హార్దిక్ పాండ్యా (10 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్‌ను పడగొట్టాడు. దీంతో పొలార్డ్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ డికాక్ 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తంపి బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదాడు. రషీద్ ఖాన్ 18వ ఓవర్లో పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టగా, డికాక్ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ వేసేందుకు బంతినందుకున్న భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ఈ డెత్ ఓవర్లో పొలార్డ్ క్రీజులో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. ఖలీల్ వేసిన ఆఖరి ఓవర్ తొలిబంతిని భారీ షాట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్ (9 బంతుల్లో 10; 1 సిక్స్) అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 11 పరుగులు జతయ్యాయి. భువీ, నబీ చెరో వికెట్ తీశారు. ధాటిగా మొదలైంది కానీ... వార్నర్ లేని సన్ ఇన్నింగ్స్‌ను సాహా, గప్టిల్ ధాటిగానే ప్రారంభించారు. తొలి ఓవర్లో సాహా, రెండో ఓవర్లో గప్టిల్ బౌండరీ కొట్టారు. ఇక మూడో ఓవర్లో అయితే ఇద్దరు కలిసి 17 పరుగులు పిండుకున్నారు. శరణ్ బౌలింగ్‌లో సాహా 2 ఫోర్లు, గప్టిల్ ఒక సిక్సర్ బాదాడు. దీంతో పరుగుల వేగం పెరిగింది. ఇదే జోరుతో బుమ్రా నాలుగో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన సాహా (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆఖరి బంతికి ఔటయ్యాడు. తర్వాత మనీశ్ పాండే రాగానే బ్యాట్‌కు పని చెప్పాడు. మలింగ వేసిన ఐదో ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ బాదేశాడు. ఈ ఓవర్లో కూడా 17 పరుగులు రాగా 4.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. సాఫీగా సాగుతున్న రైజర్స్ ఇన్నింగ్స్‌ను మళ్లీ బుమ్రానే దెబ్బతీశాడు. గప్టిల్‌ను (11 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) ఎల్బీగా వెనక్కిపంపాడు. గప్టిల్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. తర్వాత కాసేపటికే కెప్టెన్ విలియమ్సన్ (3) వికెట్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. కృనాల్ బౌలింగ్‌లో అతను స్వీప్ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎల్బీ అప్పీల్ చేసినా అంపైర్ తిరస్కరించాడు. దీంతో ముంబై రివ్యూకు వెళ్లి విలియమ్సన్‌ను బయటకు పంపింది. సన్‌రైజర్స్ 65 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రాణించిన మనీశ్ పాండే విజయ్ శంకర్ క్రీజ్‌లోకి రాగా... పాండే అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లలో హైదరాబాద్ 80/3 స్కోరు చేసింది. అయితే చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో సన్‌రైజర్స్ స్వల్పవ్యవధిలో 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 98 స్కోరు వద్ద విజయ్ శంకర్ (12)ను కృనాల్ పాండ్యా, 105 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (2)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ పంపారు. హైదరాబాద్ విజయ సమీకరణం చివరి 5 ఓవర్లలో 57 పరుగులుగా మారిపోయింది. జోరుతో స్కోరును నడిపిస్తున్న పాండే 37 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్ వేసిన బుమ్రా అద్భుతంగా కట్టడి చేసి 7 పరుగులే ఇచ్చాడు. మలింగ 18వ ఓవర్లో నబీ ఫోర్, సిక్స్ బాదడంతో 12 పరుగులు వచ్చాయి. ఆఖరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సివుండగా బుమ్రా 19వ ఓవర్లో పాండే 2 బౌండరీలు కొట్టాడు. ఈ ఓవర్లో 12 పరుగులు రాగా హైదరాబాద్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 17 పరుగులు చేయాలి. 5 బంతుల్లో 10 పరుగులు చేసిన హైదరాబాద్ నబి వికెట్‌ను కోల్పోయింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా పాండే సిక్స్ కొట్టాడు. మ్యాచ్ ‘టై’ అయింది. -
సెమీస్‌లో కర్ణాటక
బెంగళూరు: కెప్టెన్ మనీశ్ పాండే (75 బంతుల్లో 87 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (129 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో మెరవడంతో మాజీ చాంపియన్ కర్ణాటక రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. 184 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... ఆరంభంలోనే రోనిత్ మోరె (8) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మనీశ్, కరుణ్ దూకుడుగా ఆడారు. ఐదో వికెట్‌కు 24.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సంక్షిప్త స్కోర్లు: రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: 224; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 263; రాజస్తాన్ రెండో ఇన్నింగ్స్: 222; కర్ణాటక రెండో ఇన్నింగ్స్: 185/4. -
వారెవ్వా.. పాండే సూపర్ క్యాచ్!
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కేదార్ జాదవ్ వేసిన 25 ఓవర్ ఐదో బంతిని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత ఫీట్‌తో మైదానంలోని ప్రేక్షకులు.. ఆటగాళ్లు థ్రిల్ అయ్యారు. దీంతో సర్ఫరాజ్ (6) పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో లేని పాండే ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చాడు. రాయుడు అద్భుత త్రో.. క్రీజులో పాతుకుపోయి.. అప్పటికే ఓ లైఫ్ దక్కించుకొని ప్రమాదకరంగా మారుతున్న మాలిక్(43)ను అంబటి రాయుడు అద్బుత ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. జాదవ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి మాలిక్ (43) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకడం విశేషం. దీంతో పాక్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే అసిఫ్ అలీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. -
పాండే సూపర్ క్యాచ్!
-
ఐపీఎల్లో ఫ్లాప్ స్టార్స్
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ ముగిసింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్ వేలంలో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అయితే కోట్లు పెట్టిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఆయా ప్రాంఛైజీలు వరుస ఓటములను చవిచూశాయి. వేలానికి కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు అంచనాలు అందుకోవడంలో ఘోరంగా చతికిలబడ్డారు. సదరు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో జట్టు అవకాశాలను కోల్పయింది. వేలంలో కోట్లు పలికి ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన టాప్ 5 ఆటగాళ్లు వీరే. అరోన్ ఫించ్( కింగ్స్ లెవన్ పంజాబ్) టీ20 ఫార్మాట్లో ప్రత్యేకంగా స్థానమున్న ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ పోటీపడి రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్లో అరోన్ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌గా, మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది. మొత్తంగా ఈ సీజన్లో 134 పరుగులు మాత్రమే ఫించ్ చేయగలిగాడు. గ్లెన్ మాక్స్వెల్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను అమాంతం మలుపు తిప్పగల ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. దీంతో మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్లో మంచి అనుభవం కూడా ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో కేవలం 169 పరుగులు సాధించి, 5 వికెట్లు మాత్రమే తీశాడు. బెన్‌స్టోక్స్(రాజస్తాన్ రాయల్స్) 10 వ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అదే జోరు ఈ ఏడాది కొనసాగిస్తాడని ఆశించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతను షాకిచ్చాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికిన స్టోక్స్.. ఈ ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఆల్‌రౌండర్‌గా పేరొందిన స్టోక్స్ 196 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. మనీశ్ పాండే(సన్‌రైజర్స్ హైదరాబాద్) ఈ ఏడాది జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీశ్ పాండేను రూ.11.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే జట్టు తనపై పెట్టుకున్న ఆశల్ని మాత్రం మనీశ్ నెరవేర్చలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో మనీశ్ పాండే స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యాడు. తమ జట్టు కోసం ఆడకుండా.. ప్రత్యర్థి జట్టు గెలుపు కోసం మనీశ్‌కు కష్టపడుతున్నాడని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలేయాయి. ఈ టోర్నీలో మనీశ్ కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు. జయ్‌దేవ్ ఉనాద్కత్(రాజస్తాన్ రాయల్స్) ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర రూ.11.5 కోట్లు పలికిన భారత ఆటగాడు జయ్‌దేవ్ ఉనాద్కత్. టీ20ల్లో స్పెషలిస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉనాద్కత్‌ను రాజస్తాన్ రాయల్స్ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. గత సీజన్లో పుణె తరపున 12 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అదరగొట్టడంతో ఉనాద్కత్‌పై రాజస్థాన్ కోట్లు కుమ్మరించింది. కానీ ఈ సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేసి రాజస్థాన్ అంచనాలను తలక్రిందు చేశాడు. ఈ టోర్నీలో ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. -
మనీష్ అన్నా.. ప్లీజ్...
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమ తమ ఫేవరెట్ టీమ్‌ల గురించి, ఆటగాళ్ల గురించి కొందరు అనుకూలంగా పోస్టులు పెడితే, ట్రోలింగ్ మాత్రం అంతకు మించే జరుగుతూ వస్తోంది. సన్‌రైజర్స్ ప్లేయర్ మనీష్ పాండేను టార్గెట్ చేస్తూ వేస్తున్న జోకులకు కోదవు లేకుండా పోతోంది. రూ.11 కోట్లతో ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తే.. కనీసం పరుగులు చెయ్యకపోతుండటం, దానికి తోడు మైదానంలో క్యాచ్‌లు వదిలేస్తూ ఫీల్డింగ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు.(అఫ్ కోర్స్ ఒక మ్యాచ్‌లో 57 పరుగులు.. ఒకటి రెండు అద్భుతమైన క్యాచ్‌లను వాళ్లు పరిగణనలోకి తీసుకోలేదు). దీంతో ఫేస్‌బుక్‌లోని కొన్ని ట్రోలింగ్ పేజీలు అతన్ని దారుణంగా ఏకీపడేశాయి. సినిమాల్లోని ఫన్నీ డైలాగులన్నింటిని మనీష్‌కు ఆపాదించి మెమెలు సృష్టించాయి. అది తట్టుకోలేక పాండే సైతం ఘాటుగానే బదులిచ్చాడు. చివరాఖరికి రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతన్ని జట్టులోకి తీసుకోకపోవటం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న వారు లేకపోలేదు. అయితే నేటి ఫైనల్ నేపథ్యంలో మళ్లీ పాండేపై ట్రోల్ మొదలైపోయింది. ‘ప్లీజ్.. మనీష్ అన్నా ఇవాళ మ్యాచ్‌కు దూరంగా ఉండూ’... ‘విలియమ్సన్ సర్ పాండే అన్నకు ఇవాళ కూడా రెస్ట్ చాలా అవసరం’... ‘మనీష్ అన్న ఇన్ కప్ అవుట్’.. ఇలాంటి కామెడీ డైలాగులు పేలుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరో అంశంలో కూడా అతను బుక్కయ్యాడు. అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ ఉన్న ఫోటోలనే ఇంకా కవర్ ఫోటోగా ఉంచటంతో ఏకీపడేస్తున్నారు. ఇది కాస్త ఆలస్యంగా గమనించిన కొందరు.. ఇంకా ఆ టీమ్‌లోనే ఉన్నాడనుకుంటున్నాడా? అంటూ కొందరు, మ్యాచ్‌ల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అంతే బద్ధకమా? అని మరికొందరు, అది నెక్స్ట్ సాల్(వచ్చే ఏడాది) జెర్సీ.. అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతనికి మద్ధతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. -
మళ్లీ 'సన్' చలనం
సన్‌రైజర్స్ బౌలింగ్ సత్తా మరోసారి ప్రదర్శితమైంది. ఐపీఎల్లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో తమకు తామే సాటి అనిపించుకున్న హైదరాబాద్ టీమ్ సొంతగడ్డపై మరోసారి ఆ సంచలనాన్ని చేసి చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రెండు రోజుల క్రితం 118 పరుగులే చేసి మ్యాచ్ గెలుచుకున్న రైజర్స్ ఇప్పుడు 132 పరుగులు చేసి మళ్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ 42 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 13 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మనీశ్ పాండే (51 బంతుల్లో 54; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, షకీబుల్ హసన్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించాడు. పంజాబ్ బౌలర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంకిత్ రాజ్‌పుత్ 14 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ 19 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. లక్కీ పాండే... 4, 9, 46 ... పంజాబ్ ఫీల్డర్లు మనీశ్ పాండే ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలేసినప్పుడు అతని స్కోర్లు ఇవి. అతని క్యాచ్ పట్టడమే పాపం అన్నట్లుగా ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ సాగింది. వారి సహకారంతో అర్ధ సెంచరీ చేసుకోగలిగిన పాండే వల్లే రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. యువ పేసర్ రాజ్‌పుత్ పదునైన బౌలింగ్‌తో సన్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ (0) నాలుగో బంతికే వెనుదిరగ్గా, రాజ్‌పుత్ తర్వాతి ఓవర్లో శిఖర్ ధావన్ (11) కూడా అవుటయ్యాడు. సాహా (6)ను కూడా డగౌట్ చేర్చి అతను వరుసగా మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్, టై క్యాచ్‌లు వదిలేయడంతో మరో అవకాశం దక్కించుకున్న పాండే... సున్నా వద్ద ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చినా నోబాల్ కావడంతో బతికిపోయిన షకీబ్ కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన పాండేకు మళ్లీ లైఫ్ లభించింది. 48 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. 7 పరుగుల వద్ద తివారీ క్యాచ్ వదిలేసిన అనంతరం చివర్లో యూసుఫ్ పఠాన్ (19 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. వికెట్ల వరుస కట్టి... 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ సాధారణ రీతిలోనే ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లలో ఆ జట్టు 14 పరుగులు చేసింది. ఆ తర్వాత నబీ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ వరుసగా 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో గేల్ కూడా రెండు సిక్సర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి రైజర్స్ దెబ్బ తీసింది. రాహుల్‌ను రషీద్ బౌల్డ్ చేయగా, గేల్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను థంపి వెనక్కి పంపాడు. మయాంక్ అగర్వాల్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. రషీద్ అద్భుత బౌలింగ్‌కు కరుణ్ నాయర్ (13) వెనుదిరగ్గా, ఫించ్ (8)ను షకీబ్ అవుట్ చేశాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మనోజ్ తివారి (1) కూడా విఫలం కావడంతో పంజాబ్ పరిస్థితి దిగజారింది. అశ్విన్ (4) కూడా చేతులెత్తేయడంతో కింగ్స్ కుప్పకూలింది. -
‘సన్‌రైజర్స్’లో చిలిపి చేష్టలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. క్రికెటర్లు భువనేశ్వర్, మనీశ్ పాండే, అలెక్స్ హేల్స్ శనివారం 30 మంది వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు. ‘జస్ట్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఆటగాళ్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. క్రికెట్ ఆడకపోయి ఉంటే ఏం చేసేవారని ఓ చిన్నారి భువనేశ్వర్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను ఆర్మీలో చేరేవాడినని అతను తెలిపాడు. మిగతా ప్రశ్నలకు సమాధానమిస్తూ భువీ ‘క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలి. శ్రమిస్తేనే ఏదైనా సాధించగలం. నాకే కాదు ప్రతీ క్రికెటర్‌కు సచిన్ టెండూల్కరే మార్గదర్శి’ అని చెప్పాడు. తన 13వ ఏటనే క్రికెట్లోకి అడుగుపెట్టానన్న భువీ... అండర్–19లో ఆడుతున్నప్పుడే భారత జట్టుకు ఆడతాననే నమ్మకం కలిగిందని గుర్తుచేసుకున్నాడు. సన్‌రైజర్స్ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారని మరో చిన్నారి ప్రశ్నించగా, బిపుల్ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తుంటాడని మనీశ్ పాండే సమాధానమిచ్చాడు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యం 139
కోల్‌కతా : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సన్‌రైజర్స్ అద్భుత బౌలింగ్‌కు మైమరిపించే ఫీల్డింగ్ తోడవ్వడంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్ చతికిలపడ్డారు. క్రిస్‌లిన్, దినేశ్ కార్తీక్,రానా తప్ప అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో కోల్‌కతా స్పల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు రాబిన్ ఊతప్ప (3) వికెట్ తీసి భువనేశ్వర్ షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో క్రిస్‌లిన్ రెచ్చిపోయాడు. దీంతో 7 ఓవర్లకు కోల్‌కతా 52 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. పాండే ఫీల్డింగ్ అదుర్స్.. వర్షం తగ్గిన అనంతరం ఎలాంటి ఓవర్లు కుదించకుండా అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ పునఃప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణాను పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన సునీల్ నరైన్(9) నిరాశ పరిచాడు. ఆ వెంటనే క్రిస్‌లిన్49( 34 బంతులు,7 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్ ఔటవ్వగా.. ఆండ్రూ రస్సెల్‌ను పాండే మరోమారు మైమరిపించే ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. నిరాశ పరిచిన అండర్-19 స్టార్స్ ఇక దినేశ్ కార్తీక్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. యువ ఆటగాడు అండర్-19 సూపర్ హీరో శుభ్‌మన్ గిల్(3) తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 29(27 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగగా.. చివరి బంతికి మరో అండర్-19 ఆటగాడు శివం మావి (7) క్యాచ్ ఔటవ్వడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌కు మూడు, స్టాన్లేక్, షకీబ్ అల్ హసన్‌లకు రెండు, సిద్దార్థ్ కౌల్‌కు ఒక వికెట్ దక్కింది. -
వావ్.. మనీష్ పాండే సూపర్ క్యాచ్.!
-
వావ్.. మనీష్ పాండే సూపర్ క్యాచ్.!
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. తన మైమరిపించే ఫీల్డింగ్‌తో నితీష్ రాణా, ఆండ్రూ రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోగా.. పునప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా స్టాన్ లేక్ బౌలింగ్‌లో ఆఫ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని గల్లీలో ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పాండే రెప్పపాటు సమయంలో గాల్లో డైవ్ చేసి అందుకున్నాడు. అయితే తొలుత పాండే చేతుల నుంచి బంతి జారినట్లే జారి చిక్కింది. దీంతో నితీష్ రాణా18(14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు) పెవిలియన్ చేరాడు. చేజారిన నరైన్ క్యాచ్.! షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే మరో సారి అద్భుత ఫీల్డింగ్‌తో బంతిని సిక్సు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో సమన్వయం కోల్పోయిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి క్యాచ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి దూరంగా పడటంతో క్యాచ్ చేజారింది. సెకన్ల వ్యవధిలోనే పాండే అద్బుత ఫీల్డింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రస్సెల్ క్యాచ్ అందుకున్న పాండే.. ఆండ్రూరస్సెల్ (9)ను పాండే మరోసారి అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. స్టాన్లేక్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి రస్సెల్ షాట్‌కు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే ముందుకు పరుగెత్తి అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాండే ఫీల్డింగ్‌తో జాంటీ రోడ్స్‌ను తలిపించాడు. -
మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది
-
చాలా కష్టంగా ఉంటుంది: మనీష్ పాండే
సెంచూరియన్: భారత క్రికెట్ జట్టులో అవకాశాలు కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంటుందని మిడిల్ ఆర్డర్ ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో 48 బంతుల్లో 79 పరుగులు చేసిన మనీష్ పాండే..గతంలో ఇదే మైదానంలో టీ 20 శతకం సాధించాడు. దాంతో సెంచూరియన్ తనకు అచ్చొచ్చిన మైదానంగా మనీష్ పాండే పేర్కొన్నాడు. అయితే జట్టులో అవకాశాలు కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా మారిందన్నాడు. కానీ అంతా మన ఆలోచనా దృక్పథంలోనే ఉంటుందని తెలిపాడు. 'అవకాశాల కోసం ఎదురుచూడడం నిజంగానే చాలా కష్టం. అదెప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటుంది. ప్రస్తుత పర్యటనలో ఇంకా ఎక్కువగా అనిపించింది. దిగ్గజాలు నిండిన టీమిండియాలో చోటు దక్కాలంటే ఎదురుచూడక తప్పదు. ఐదో స్థానంలో ప్రయత్నించా కానీ ఇంకా మెరుగు పడాల్సి ఉంది’ అని పాండే అన్నాడు. కాగా, గతంలో యువరాజ్, రైనా వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడిన ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని పాండే అభిప్రాయపడ్డాడు. -
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
-
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశే ఎదురుకాగా, యువ ఆటగాళ్లు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. దీంతో వారిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేలంలో భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు ఊహించని రీతిలో రూ.11 కోట్ల ధరకు కొనుగోలు అయ్యారు. మనీశ్ పాండే కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ జట్లు రేట్లు పెంచుకుంటూ పోగా పదికోట్ల మార్కు చేరుకున్నాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 11 కోట్ల ధరకు మనీశ్ పాండేను సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. టీమిండియా మరో యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ కోసం జరిగిన వేలం ఆసక్తికరంగా జరిగింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు హోరాహోరీగా ధరను పెంచుతూ ఉత్కంఠ రేపారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ రూ.11 కోట్లతో రాహుల్‌ను దక్కించుకుని అతడిపై అంచనాలు పెంచేసింది. కరుణ్ నాయర్ ను సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5.6 కోట్లతో కొనుగోలు చేసింది. మరోవైపు ట్వంటీ20ల్లో మంచి పేరున్న హార్డ్ హిట్టర్ యూసఫ్ పఠాన్ కేవలం 1.9 కోట్లకు కోనుగోలు కావడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ ధరకు పఠాన్‌ను తీసుకుంది. -
అన్న దావత్లో అదరగొట్టిన తమ్ముడు.!
ముంబై :భారత క్రికెటర్ల పెళ్లీల సీజన్ నడుస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సైతం ఈ రోజే పెళ్లి పీటలెక్కుతున్నాడు. ప్రియురాలు పాంకురి శర్మను ముంబైలో పెళ్లిచేసుకోనున్నాడు. ఈ మధ్యకాలంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ భువనేశ్వర్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్లు పెళ్లి చేసుకోగా తాజాగా కృనాల్ పాండ్యా వారి సరసన చేరనున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన మెహందీ ఫంక్షన్లో కృనాల్ తమ్ముడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు. మైదానంలోనే ఆనందం వస్తేనే తట్టుకోలేక చిందులేసే హార్దిక్.. అసలే అన్న పెళ్లి ఊరుకుంటాడా.. ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్‌తో ఇరగదీశాడు. అన్న కృనాల్‌తో కలిసి పంజాబ్ మ్యూజిక్కు చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి అన్నదమ్ములకు యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా తోడయ్యాడు. కృనాల్ పాండ్యా ఈ ఏడు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. అన్న దావత్లో అదరగొట్టిన తమ్ముడు.! -
అన్న పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన హార్దిక్
-
4 లో ఎవరు?
రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో మొత్తం 11 మంది వేర్వేరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈ మధ్య కాలంలో 16 జట్లు వన్డేలు ఆడగా... ఇతర జట్లతో పోలిస్తే అందరికంటే ఎక్కువ మందిని ఆ స్థానంలో పరీక్షించింది టీమిండియానే. కీలకమైన ‘టూ డౌన్’ స్థానంలో ఏ మ్యాచ్‌లో ఎవరు దిగుతారో చెప్పలేని పరిస్థితి టీమిండియాలో ఉంది. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కూడా చేరడంతో ఇప్పటి వరకు ఈ లోపం పెద్దగా బయటపడకపోయినా, మున్ముందు దీనికి పరిష్కారం చూడాల్సిన బాధ్యత కోహ్లి సేనపై ఉంది. సాక్షి క్రీడా విభాగం: వన్డేలకు సంబంధించి నాలుగో స్థానం ఎంతో కీలకం. గుడ్డిగా బ్యాట్ ఊపినట్లు కాకుండా పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. జట్టు ఇన్నింగ్స్ బాగా సాగుతుంటే అందులో జోరు తగ్గిపోకుండా కొనసాగించడమే కాదు... టీమ్ కష్టాల్లో ఉంటే ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ఆటగాడిపై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అటు పేస్, ఇటు స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడగల నైపుణ్యం నాలుగో నంబర్ ఆటగాడికి అవసరం. పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా మారిన తర్వాత కూడా జట్టు అవసరాల దృష్ట్యా సచిన్ స్థాయి ఆటగాడు కూడా 38 వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడాడంటే ఆ స్థాయి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అయితే ఇటీవల భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌ను చూస్తే తాను నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుందని ఏ ఆటగాడు కచ్చితంగా ఊహించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ స్థానం కోసం ప్రయత్నిస్తున్న బ్యాట్స్‌మెన్‌కు నిలదొక్కుకునేందుకు తగిన సమయమే ఇవ్వడం లేదు. వన్డేల్లో మన ముగ్గురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ధావన్, రోహిత్, కోహ్లి టాపార్డర్‌లో 1, 2, 3 స్థానాల్లో ఆడతారని తడుముకోకుండా చెప్పే అవకాశం ఉండగా... నాలుగో స్థానం మాత్రం ఎవరికీ కాకుండా పోతోంది. మనీశ్ పాండే ఫెయిల్! నాలుగో స్థానంలో ఆడించి ప్రయత్నం చేసిన 11 మందిలో ముగ్గురిపై టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అనుభవం పరంగా కెరీర్ ఆరంభంలోనే ఉన్నా... వీరిలో సరైన వ్యక్తిని ఎంచుకునే అవకాశం కనిపించింది. కేదార్ జాదవ్, మనీశ్ పాండే, లోకేశ్ రాహుల్‌లకు ఇటీవల వరుసగా అవకాశాలు లభించాయి. వీరికి లభించిన పరిమిత అవకాశాల్లోనే వారిని తీసి పడేయాల్సిన అవసరం లేదు కానీ అవకాశం లభించిన సమయంలో మాత్రం వారి నుంచి ఆశించిన ఆట కనిపించలేదు. కోల్‌కతా వన్డేలో 121/2తో దాదాపు సగం ఓవర్లు మిగిలి ఉన్న మెరుగైన స్థితిలో పాండే క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ స్థితిలో భారీ స్కోరు చేసేందుకు పాండేకు మంచి అవకాశం లభించినా... అతను పేలవమైన రీతిలో అవుటై చివరి వరుస బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. నిజానికి ఇప్పుడు జట్టుకు దూరమైనా... యువరాజ్ తన ఆఖరి 9 ఇన్నింగ్స్‌లలో నాలుగో స్థానంలో 358 పరుగులు చేసి ఆ స్థానంలో తన విలువను చూపించాడు. పాండే 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 183 పరుగులే చేయగా... జాదవ్, రాహుల్ ఆకట్టుకోలేదు. ఎవరు నిలబడతారు? 2015 ప్రపంచ కప్ తర్వాతి నుంచి ఆడిన 11 మందిలో రహానే పరిస్థితి భిన్నంగా ఉంది. సత్తా ఉన్నా అతడిని నాలుగో స్థానంలో ఆడించకుండా కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా, ఎవరైనా గాయపడితేనే అవకాశం ఇస్తున్నారు. రాయుడు, దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి ఆట దాదాపుగా ముగిసి పోయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని పూర్తి స్థాయిలో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడని వినిపించింది కానీ కోహ్లి దానిని సీరియస్‌గా పట్టించుకున్నట్లు లేదు. శ్రీలంకలో పాండేకు ముందు రాహుల్‌కు నాలుగో స్థానంలో అవకాశం ఇస్తే అతను విఫలమయ్యాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో పాండే ఫెయిలవ్వగా... ఇండోర్‌లో అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు అవకాశం లభించింది. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఈ స్థానంలో పాండ్యా రెండు సార్లు విఫలమైన విషయం మరచిపోవద్దు. మనీశ్ పాండే తన కెరీర్లో ఎక్కువ భాగం మిడిలార్డర్లోనే ఆడగా, రాహుల్ కెరీర్ మొత్తం ఓపెనర్‌గానే సాగింది. 32 వన్డేలు ఆడినా ఇంకా జాదవ్‌ను నమ్మలేని పరిస్థితి ఉంది. లంకతో ఒక మ్యాచ్‌లో నంబర్ 4 అవకాశం ఇస్తే అతను దానిని ఉపయోగించుకోలేదు. 2019 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య అయితే కాదు కానీ... పూర్తిగా ఉపేక్షించాల్సిన చిన్న విషయం కూడా కాదు. కాబట్టి అందుబాటులో ఉన్నవారిలో ఒకరికి వరుసగా ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం కల్పిస్తే భారత్‌కు అవసరమైన నంబర్ 4 ఆటగాడు లభించేస్తాడు. -
వారెవ్వా ఏం క్యాచ్..
-
వారెవ్వా ఏం క్యాచ్..
ఇండోర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా ప్లేయర్ మనీష్ పాండే అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా వేసిన 47 ఓవర్ ఐదో బంతిని ఆసీస్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్ స్కోంబ్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ ఆ బంతిని గాల్లోకి ఎగిరి అందుకొని సమన్వయం కోల్పోతూ.. గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్ దాటాడు. అనంతరం మళ్లీ తిరిగొచ్చి అందుకున్నాడు. ఈ సెన్సెషనల్ క్యాచ్‌తో మైదానంలో భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. మనీష్ ఈ క్యాచ్‌తో 6 పరుగులు అడ్డుకోవడమే కాక హ్యాండ్స్ స్కోంబ్(7)ను పెవిలియన్‌కు చేర్చాడు. -
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
-
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
►ఏకైక టి20లో 7 వికెట్లతో ఘన విజయం ►గెలిపించిన కోహ్లి, మనీశ్ పాండే ►ఆతిథ్య జట్టుకు శూన్యహస్తం మూడు ఫార్మాట్లు... ఆటగాళ్లు మారారు... వేదికలు మారాయి... కానీ ఫలితం మాత్రం మారనే లేదు. శ్రీలంక గడ్డపై భారత జట్టు దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆడిన తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా సంపూర్ణ విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్న టీమిండియా సగర్వంగా పర్యటన ముగించింది. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేని అశక్తతతో, అవమాన భారంతో ఆతిథ్య శ్రీలంక ఖాతాలో అతి పెద్ద శూన్యం చేరింది. 171 పరుగుల విజయలక్ష్యం... 42 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వేటగాడు విరాట్ కోహ్లి ఆడుతూ పాడుతూ ఫినిషింగ్ లైన్ దిశగా జట్టును నడిపించాడు. అతనికి మనీశ్ పాండే అండగా నిలవడంతో భారత్ ఏ దశలోనూ ఆందోళన చెందాల్సిన అవసరమే రాలేదు. మూడో వికెట్‌కు వీరిద్దరు 119 పరుగులు జోడించడంతో జట్టుకు సునాయాస గెలుపు దక్కింది. 48 రోజుల లంక టూర్ అమితానందంతో ముగిసింది. ముఖ్యంగా ఈ పర్యటన మాజీ కెప్టెన్ ధోనికి తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సిరీస్ మొత్తంలో ధోని ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. కొలంబో: విరాట్ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన జట్టు పొట్టి క్రికెట్లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దిల్షాన్ మునవీరా (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్ ప్రియాంజన్ (40 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోగా... మనీశ్ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతనికి సహకరించాడు. తాజా విజయంతో మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 9–0 తేడాతో లంకను ఓడించినట్లయింది. మునవీరా జోరు... తొలి 10 ఓవర్లలో 90 పరుగులు...తర్వాతి 8 ఓవర్లలో 54 పరుగులు...చివరి 2 ఓవర్లలో 26 పరుగులు... సంక్షిప్తంగా శ్రీలంక ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. భారత్‌తో రెండు వన్డేల్లో విఫలమైన మునవీరా టి20లో సత్తా చాటగా... ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రియాంజన్ లంక ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి శుభారంభం అందించిన డిక్వెలా (17) చివరకు అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అంతకుముందు భువనేశ్వర్ ఓవర్లో తరంగ (5) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు మునవీరా తన ధాటిని ప్రదర్శించాడు. చహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, అక్షర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ధోని అద్భుత స్టంపింగ్‌తో మాథ్యూస్ (7)ను వెనక్కి పంపించగా, చహల్ మరో ఓవర్లో మునవీరా 2 సిక్సర్లు, ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. చివరకు కుల్దీప్, మునవీరా ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆ తర్వాత చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టి పడేయడంతో లంక పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. అయితే చివరి 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టిన ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. అదే జోరు... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రోహిత్ (9) వికెట్ కోల్పోయింది. రాహుల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే కోహ్లి, పాండే భాగస్వామ్యం భారత్‌ను విజయం వైపు నడిపించింది. శ్రీలంక బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌కు మొదట్లో పరుగులు తీయడంలో వీరిద్దరు కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు కూడా ఎదుర్కొన్నారు. ఫలితంగా పవర్‌ప్లేలో స్కోరు 43 పరుగులకే పరిమితమైంది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత ఈ జంట సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా కోహ్లి ఏ బౌలర్‌నూ వదల్లేదు. పెరీరా ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టిన భారత్... మాథ్యూస్ వేసిన ఓవర్లో మరో 17 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లు నియంత్రణ తప్పడంతో టీమిండియాకు సునాయాసంగా పరుగులు లభించాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... పాండే మిగతా పనిని పూర్తి చేశాడు. -
అందుకు సమయం అవసరం:మనీష్
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి వెనుకాడబోమని కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయాన్ని సహచర ఆటగాడు మనీష్ పాండే స్వాగతించాడు. ప్రయోగాలు చేసినా, పలు విధాల మార్పులు చేసినా జట్టులో మరింత సమతుల్యం తీసుకురావడం కోసమేనని మనీష్ అభిప్రాయపడ్డాడు.వచ్చే వరల్డ్ కప్ కు దాదాపు 24 నెలలు సమయం ఉన్నప్పటికీ, అందుకు ఇప్పట్నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం అవసరమన్నాడు. దీనిలో భాగంగా విభిన్నమైన కోణాల్లో జట్టును పరీక్షించడం ఒక ఛాలెంజ్ అన్నాడు. 'ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్ లో విరాట్ అనుసరిస్తున్న కొత్త కొత్త ప్రయోగాలకు ఆటగాళ్లు అలవాటు పడటానికి సమయం పడుతుంది. ప్రధానంగా టాప్ ఆర్డర్ లో నాల్గో స్థానంలో నేను బ్యాటింగ్ కు వస్తూ ఉంటా. ఇప్పటి జట్టు పరిస్థితులకు తగ్గట్టు చూసుకుంటే ఆరోస్థానంలో రావాల్సి ఉంటుంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నామంటే అది ఎక్కువ శాతం 40 ఓవర్ల తరువాతే మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు కేఎల్ రాహుల్ ని తీసుకుంటే అతను ఎప్పుడూ ఓపెనర్ గా వస్తూ ఉంటాడు. అటువంటిది సడన్ గా 30 ఓవర్ల తరువాత వస్తే కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే జట్టు ప్రయోజనం కోసం ఎక్కడైనా ఆడాలి. దీన్ని అలవరుచుకోవడానికి సమయం పడుతుంది'అని మనీష్ పాండే అభిప్రాయపడ్డాడు.ఇటీవల శ్రీలంకతో జరిగిన నాల్గో వన్డేలో మనీష్ పాండే అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
ప్రపంచకప్ సైన్యం కోసం!
♦ ప్రయోగాల బాటలో భారత్ ♦ ధోనిపైనే అందరి దృష్టి ♦ శ్రీలంకతో నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్ ♦ మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను సునాయాసంగా 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. అయితే భారత్ మాత్రం దీన్ని కేవలం ద్వైపాక్షిక సిరీస్‌గా మాత్రమే చూడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభమైనట్టే అని ప్రకటించారు. ఓ ఏడాదిపాటు రొటేషన్ ప్రకారం తమ యువ ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే తమ వనరులను సరిచూసుకునేందుకు ఇది ఓ అవకాశంగా తీసుకోనుంది. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనిపై అందరి దృష్టీ నెలకొనడంతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రపంచకప్‌కు నేరుగా బెర్త్ దక్కించుకోవాలంటే శ్రీలంక మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. అసలే ఆత్మవిశ్వాసం అడుగంటిన వేళ ఈ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఏమేరకు రాణించగలదో వేచిచూడాలి. దంబుల్లా: టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా వన్డేల్లోనూ మెరుపులు మెరిపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు స్థానిక రణగిరి దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్ మేనేజిమెంట్ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. ఇప్పటికే యువరాజ్ సింగ్‌పై వేటు వేయగా... మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై తాను ప్రపంచ కప్ జట్టులో ఉండాల్సిన ఆటగాడినే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వేపై అవమానకర రీతిలో 2–3 తేడాతో ఓడిన లంక పటిష్ట భారత్‌ను నిలువరించి పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానం (88 పాయింట్లు)లో ఉన్న లంక సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీలోపు నేరుగా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. నాలుగో స్థానంలో రాహుల్... వన్డేల కోసం భారత జట్టు మారినా ఫామ్‌కు మాత్రం ఢోకా లేదు. అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ భీకర ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే వన్డేల్లో అతడిని నాలుగో స్థానంలో బరిలోకి దించనున్నారు. గతేడాది అరంగేట్రంలోనే శతకం బాదిన అతను గాయాల కారణంగా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అన్నింట్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. అయితే ఈసారి ఓపెనింగ్ స్లాట్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో భర్తీ చేస్తారు. ప్రపంచకప్ అంచనాల్లో రాహుల్ కచ్చితంగా ఉంటాడు కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేయలేరు. అందుకే అతడి స్థానాన్ని మిడిలార్డర్‌కు మార్చనున్నారు. అయితే 2015 వరల్డ్ కప్ నుంచి ఇదే స్థానంలో అజింక్య రహానే మెరుగ్గానే ఆడుతున్నాడు. కానీ రహానే ఇప్పుడు మూడో ఓపెనర్‌గానే ఉండే అవకాశం ఉంది. ఐదో స్థానంలో ధోని రావడం ఖాయమే. ఇక మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత స్థానాల్లో దిగనున్నారు. బుమ్రా, భువనేశ్వర్ పేస్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. స్పిన్‌లో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఒత్తిడిలో శ్రీలంక... టెస్టుల్లో వైట్‌వాష్ అనంతరం వన్డే సిరీస్ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం.తరంగ, మాథ్యూస్, చండి మాల్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకలా నిల వనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ పుష్పకుమార అరంగేట్రం ఖాయమే. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ లసిత్ మలింగ, ఫెర్నాండోలపై ఎక్కువగా ఆధార పడనుంది. జట్లు: (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, పాండే/జాదవ్, పాండ్యా, కుల్దీప్, భువనేశ్వర్, చహల్, బుమ్రా. శ్రీలంక: తరంగ (కెప్టెన్), గుణతిలక, మెండిస్, డిక్వెలా, మాథ్యూస్, కపుగెడెర, హసరంగా, పెరీరా, ఫెర్నాండో, మలింగ, సందకన్. పిచ్, వాతావరణం ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇక్కడ 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ అలాంటి పరిస్థితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 4 శ్రీలంకతో ఈ మైదానంలో ఆడిన 11 వన్డేల్లో భారత్ నాలుగు మాత్రమే గెలిచింది. 2 ప్రపంచకప్‌లో నేరుగా అర్హత దక్కించుకునేందుకు శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్‌లు. -
ఫైనల్ కు చేర్చిన మనీష్
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్-ఎ జట్టు ఫైనల్ కు చేరింది. దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మ్యాచ్ లో భారత-ఎ జట్టు వికెట్ తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్ విజయంలో కెప్టెన్ మనీష్ పాండే(93 నాటౌట్; 85 బంతులు) కీలక పాత్ర పోషించాడు. మనీష్ చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది. అతనికి జతగా సంజూ శాంసన్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇది భారత్ కు వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ జట్టు.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
కెప్టెన్లుగా నాయర్, మనీష్
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ 'ఎ' జట్లకు కెప్టెన్లుగా సీనియర్ జట్టు ఆటగాళ్లైన కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా 'ఎ' రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్ గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ 'ఎ' జట్టుతో పాటు ఆస్ట్రేలియా 'ఎ' జట్టుకు పాల్గొననుంది. జూలై 26వ తేదీన ఆస్ట్రేలియా 'ఎ' జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్ తో ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు దేశాల ట్రయంగులర్ వన్డే సిరీస్ఆగస్టు 8వ తేదీ వరకూ జరుగుతుండగా, ఆపై దక్షిణాఫ్రికాతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులను భారత్ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకూ బెనోనిలో తొలి నాలుగు రోజుల మ్యాచ్ జరుగనుండగా, ఆగస్టు 19 నుంచి 22 వరకూ సెన్స్వే పార్క్‌లో రెండో మ్యాచ్ జరుగనుంది. వన్డే జట్టు.. మనీష్ పాండే(కెప్టెన్), మన్ దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్యా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బాసిల్ తంపి, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్ అనధికార టెస్టు మ్యాచ్‌లు జట్టు.. కరుణ్ నాయర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రియంక్ పాంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, హనుమ విహారి, జయంత్ యాదవ్, నదీమ్, నవదీప్ సైనీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరి, అనికిత్ చౌదరి, అంకిత్ రాజ్ పుత్ -
మనీశ్ పాండే స్థానంలో దినేశ్ కార్తీక్
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఐపీఎల్లో గాయపడిన మనీశ్ పాండే స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్ తరఫున కార్తీక్ ఆఖరిసారిగా 2014 మార్చిలో వన్డే ఆడాడు. 2016–17 సీజన్లో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కార్తీక్ 9 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సహా 607 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి తమిళనాడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే కారణంగా అతనికి వన్డేల్లో మళ్లీ చోటు దక్కింది. -
‘అతడు మంచి ఆల్ రౌండర్’
ముంబై: చివరి ఓవర్లలో తమ బౌలర్ల బౌలింగ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ మనీశ్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరల్లో తమ బౌలర్లు లయ తప్పుతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ చేజార్చుకున్నారు. ‘గుజరాత్ లయన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనూ చివరి ఓవర్లలో మా బౌలర్లు లయ తప్పారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మరింత మెరుగుపడాల్సివుంది. బౌలర్లు క్రమం తప్పకుండా యార్కర్లు సంధిస్తే బ్యాట్స్ మన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. అయితే చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్ మన్ బాగా ఆడారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ పదును తేలడానికి మరింత కష్టపడాల్సివుంది. ఈ సమస్యను అధిగమిస్తామ’ని పాండే అన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ... హార్ధిక పాండ్యా, నితీశ్ రాణా తమ నుంచి మ్యాచ్ లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, మ్యాచ్ ను ఎలా ముగించాలో పాండ్యా చూపించాడని మెచ్చుకున్నాడు. అతడు మంచి ఆల్ రౌండర్ అని కితాబిచ్చాడు. -
మనీష్ పాండే సూపర్ షో
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మనీష్ పాండే మెరుపులు మెరిపించి ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మనీష్ మాత్రం మొక్కువోని దీక్షతో ఆడాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్ మెక్లీన్ గన్ వేసిన ఆఖరి ఓవర్ లో మనీష్ పాండే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు సాధించి కోల్ కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంతకుముందు క్రిస్ లిన్(32) ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గౌతం గంభీర్, క్రిస్ లిన్ లు దాటిగా ఆరంభించారు. అయితే గంభీర్(19)ను జోరుగా ఆడుతున్న సమయంలో కృణాల్ పాండ్యా బౌలింగ్ లో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.. అనంతరం రాబిన్ ఊతప్ప(4) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యాడు. ఇక గత మ్యాచ్ హీరో లిన్ ను సైతం ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవకపోవడంతో కోల్ కతా తడబడినట్టు కనబడింది. ఆ తరుణంలో బాధ్యత తీసుకున్న మనీష్ పాండే చూడచక్కని ఆట తీరుతో అలరించాడు. వరుస విరామాల్లో కోల్ కతా వికెట్లు కోల్పోయినప్పటికీ మనీష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ చేసుకున్న మనీష్.. ఆ తరువాత బ్యాట్ ఝుళిపించడంతో కోల్ కతా ఇన్నింగ్స్ ను గాడిలోపడింది. ముంబై బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు వికెట్లు సాధించగా, మలింగాకు రెండు వికెట్లు, మెక్లీన్ గన్, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది. -
దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘బి’
విశాఖపట్నం: దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘బి’ జట్టు వరుసగా రెండో విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మనీశ్ పాండే (110 బంతుల్లో 104; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టడంతో... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ జట్టు 32 పరుగుల తేడాతో విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడుపై విజయం సాధించింది. ఇక్కడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ ‘బి’ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ (48 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించాడు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తమిళనాడు 48.4 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ కౌషిక్ గాంధీ (134 బంతుల్లో 124; 9 ఫోర్లు) వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించేందుకు విఫలప్రయత్నం చేశాడు. జగదీశన్ (64; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ధవల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లు తీశారు. హైదరాబాద్ ఆటగాడు సీవీ మిలింద్కు 2 వికెట్లు దక్కాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో తమిళనాడు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో తలపడుతుంది. -
నేటినుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు
-
ముంబైలో ‘మూడు’ కావాలి
►సిరీస్ విజయంపై భారత్ కన్ను ► నేటినుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ► గాయంతో రహానే అవుట్, షమీ డౌట్! ► తీవ్ర ఒత్తిడిలో కుక్ సేన సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే వాంఖెడే మైదానంలో ఇంగ్లండ్ జట్టు భారత్‌ను చిత్తు చేసి ఆపై సిరీస్ విజయానికి బాటలు వేసుకుంది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు భారత జట్టులో ఉన్నారు. నాటితో పోలిస్తే పరిస్థితులు, బలాబలాలు మారిపోయినా... అదే వేదికపై కుక్ సేనను ఓడించి మనం సిరీస్‌ను సొంతం చేసుకుంటే ఆ కిక్ వేరు. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా అదే ఆలోచనతో ఉంది. ప్రస్తుత ఫామ్, గత రెండు టెస్టుల్లో ప్రదర్శన చూస్తే నిస్సందేహంగా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే సిరీస్‌లో కొన్ని కీలక అవకాశాలను అంది పుచ్చుకోలేకపోయిన ఇంగ్లండ్, ఈసారి మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. వారం రోజుల విశ్రాంతితో కాస్త ఉత్సాహంగా ఆ జట్టు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నాలుగో టెస్టు కూడా ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమిండియా, ఇదే జోరు కొనసాగించి మరో మ్యాచ్ గెలిస్తే ఆ అంకె ఐదుకు పెరుగుతుంది. పైగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం కపిల్‌దేవ్ నేతృత్వంలో వరుసగా 17 మ్యాచ్‌లలో ఓడని భారత రికార్డు కూడా సమమవుతుంది. ముంబై: వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ పని పట్టిన భారత్ ఇప్పుడు సిరీస్ సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) ఇక్కడి వాంఖెడే మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మరో గెలుపుపై పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా సిరీస్ కోహ్లి సేన సొంతమవుతుంది. మరోవైపు రాజ్‌కోట్ టెస్టు తర్వాత ఇంగ్లండ్ ఆట దిగజారింది. ఇప్పటికే భారీ తేడాతో రెండు మ్యాచ్‌లు కోల్పోయిన ఆ జట్టు, పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంది. భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో గాయపడటంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ కూడా గాయంతో బాధపడుతున్నాడు. దాంతో వారి స్థానాల్లో మనీశ్ పాండే, శార్దుల్ ఠాకూర్లను ఎంపిక చేశారు. జోరు కొనసాగాలి... ఈ సిరీస్‌లో భారత్ ఇంత పటిష్ట స్థితిలో నిలిచిందంటే బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారాలే కారణం. వీరిద్దరు తొలి మ్యాచ్ నుంచి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. 405 పరుగులతో కోహ్లి అగ్రస్థానంలో ఉండగా, పుజారా 338 పరుగులు చేశాడు. మరోసారి వీరిద్దరు జట్టు ఇన్నింగ్సలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఓపెనర్ మురళీ విజయ్ ఫామ్ కాస్త ఆందోళనపరుస్తోంది. రాజ్‌కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్సలో సెంచరీ చేసిన తర్వాత అతను వరుసగా ఐదు ఇన్నింగ్సలలో విఫలమయ్యాడు. ఇప్పుడైనా అతను రాణించి కోచ్ కుంబ్లే నమ్మకాన్ని నిలబెట్టాలి. గాయంతో గత టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ మళ్లీ ఓపెనింగ్‌కు సిద్ధమయ్యాడు. వైజాగ్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్‌సలలోనూ విఫలమయ్యాడు. గాయాలతో వస్తూ, పోతూ ఉన్నా... టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఎంతో అండగా నిలుస్తున్న నేపథ్యంలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స ఆడాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉంది. వేలి గాయంతో రహానే దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు మరో అవకాశం దక్కనుంది. మనీశ్ పాండేను కూడా ఎంపిక చేసినా... గత టెస్టులో కోహ్లి కారణంగా రనౌటైన కరుణ్‌కు మరో అవకాశం ఇవ్వడమే సరైందిగా జట్టు భావిస్తోంది. రాహుల్ రాకతో పార్థివ్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. ముగ్గురు ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, జయంత్‌లు ఆడుతున్న తీరు భారత్‌కు మరో విజయంపై నమ్మకాన్ని కలిగిస్తున్నారుు. వీరు ఈ సారి ఎంతగా చెలరేగిపోతారో చూడాలి. షమీ ఫిట్‌నెస్‌పై మ్యాచ్‌కు ముందే స్పష్టత వస్తుంది. అతను ఫిట్‌గా లేకపోతే భువనేశ్వర్ బరిలోకి దిగుతాడు. కోలుకుంటారా... మరోవైపు ఇంగ్లండ్ కూడా వరుస ఓటముల నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఉంది. గత రెండు టెస్టుల లోపాలను అధిగమించి ఈసారి గట్టిగా నిలబడాలని కుక్ సేన భావిస్తోంది. రెండు సార్లు ఆట చివరి ఓవర్లో వికెట్ కోల్పోవడం, మొహాలీ మ్యాచ్‌లో భారత్‌ను 156/5 నుంచి 417 పరుగులు చేయనీయడం ఆ జట్టును బాగా దెబ్బ తీశాయి. భారత గడ్డపై దీనికంటే ముందు జరిగిన సిరీస్‌లతో పోలిస్తే ఈసారి పిచ్‌లు స్పిన్‌కూ మరీ అనుకూలంగా ఏమీ లేవు. అలాంటి చోట కూడా ఇంగ్లండ్ తడబడింది. రూట్ (299 పరుగులు), కుక్ (246 పరుగులు) బ్యాటింగ్ ఆశించిన స్థారుులో లేదు. ఇంగ్లండ్ పరిస్థితి మెరుగవ్వాలంటే వీరిద్దరు భారీ స్కోర్లు చేయాల్సిందే. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా సమర్థంగా తన పాత్ర పోషించగా, ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. కొత్త కుర్రాడు కీటన్ జెన్నింగ్‌స, కుక్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. బెరుుర్‌స్టో, మొరుున్ అలీ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. మన స్పిన్ త్రయాన్ని ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందనేదే కీలకం. గత మ్యాచ్‌కు భిన్నంగా ఈసారి ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ ఈ మ్యాచ్ ఆడితే జట్టు బలం పెరగడం ఖాయం. ఆదిల్ రషీద్ పేరుకు 18 వికెట్లు పడగొట్టినా, అతను భారత బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఇంగ్లండ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న మొయిన్ అలీ (7 వికెట్లు) స్పిన్ ఎందుకూ పనికి రాలేదు. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉన్నా, ఇంగ్లండ్ తమ పేస్ బలంపైనే ఆశలు పెట్టుకుంటూ నలుగురికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది. 41 కోహ్లి మరో 41 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. 10 వాంఖెడే మైదానంలో భారత్ 24 టెస్టులు ఆడగా, 10 గెలిచి, 7 ఓడింది. మరో 7 డ్రాగా ముగిశాయి. అయితే ఇంగ్లండ్ ఇక్కడ ఆడిన గత రెండు టెస్టుల్లోనూ (2006, 2012) గెలిచింది. 0 భారత గడ్డపై తొలి టెస్టు జరిగిన 1933 నాటి నుంచి గత 83 ఏళ్లలో ముంబైకి చెందిన ఆటగాడు భారత తుది జట్టులో లేకుండా ముంబైలో ఒక్క టెస్టు కూడా జరగలేదు. శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం లభించకపోతే ఇదే మొదటిసారి అవుతుంది. మా జట్టులో ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని రాణిస్తున్నారు. కాబట్టి ఒకరు బాగా ఆడుతున్నారని, మరొకరు విఫలమవుతున్నారని అనుకోవద్దు. దీనిని ఏ ఒక్కరి గురించో కాకుండా మొత్తం జట్టు కోసం అన్నట్లుగా భావించాలి. గాయాల వల్ల లేదా ఆయా వికెట్ స్వభావాన్ని బట్టే తుది జట్టులో తరచుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏం చేసినా జట్టు గెలవడమే ముఖ్యం. ఆ స్థానంలో రాణించేందుకు మరొకరు సిద్ధంగా ఉన్నారని భువీ చూపించాడు. అవకాశాలు అంది పుచ్చుకోవడమే ముఖ్యం. సిరీస్ మధ్యలో వారికి ఎనిమిది రోజుల విశ్రాంతి, వన్డే సిరీస్‌కు ముందు సెలవులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఇది షెడ్యూల్లో భాగం కాబట్టి నేనేమీ చెప్పలేను గానీ మేం కూడా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాకూ ఇలాంటి విరామమే కావాలని కోరుతున్నా. మేం మూడున్నర నెలలు అక్కడ ఉంటే ప్రతీ రోజు మీడియా కంట్లో కనిపిస్తూనే ఉంటాం. ఇప్పుడు దుబాయ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా గడిపారో నాకై తే తెలీదు. అలాంటిది మాకూ కావాలి. -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ రాజ్‌కోట్ టెస్టు మాకు బ్లూప్రింట్లాంటిది. మేం ఇక్కడ సరిగ్గా అదే తరహాలో ఆడాలి. తర్వాతి రెండు టెస్టుల్లో ఆ పట్టుదల తగ్గడం వల్లనేమో మ్యాచ్‌లు కోల్పోయాం. మరీ నత్తనడక బ్యాటింగ్‌తో పోలిస్తే మేం దూకుడుగా ఆడాల్సి ఉంది. కొత్త ఓపెనర్ కీటన్లో మంచి ప్రతిభ ఉంది. గతంలో మాకు బాగా అచ్చొచ్చిన మైదానంలో తిరిగి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. పరిస్థితులు మారినా ఈ గ్రౌండ్లో ఈ సారీ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. దుబాయ్‌లో సెలవులు గడిపిన తర్వాత మేం మరింత ఉత్సాహంతో ఉన్నాం. -అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ పిచ్, వాతావరణం ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లోనూ పిచ్‌లపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అనూహ్యంగా స్పందించకుండా చక్కగా ఆటకు అవకాశం కల్పించారుు. స్పిన్‌కు గానీ, బ్యాటింగ్‌కు గానీ పూర్తిగా అనుకూలించలేదు. ఈసారి కూడా అలాంటి పిచ్‌నే రూపొందించారు. అయితే మూడు రోజు నుంచి బంతి తిరిగేందుకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, కరుణ్ నాయర్/మనీశ్ పాండే, అశ్విన్, పార్థివ్, జడేజా, జయంత్, ఉమేశ్, షమీ/భువనేశ్వర్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), కీటన్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, అండర్సన్, బ్రాడ్/ఫిన్. ఉ. గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం -
వైస్ కెప్టెన్ రహానేపై వేటు
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ముంబై టెస్టుకు ముందురోజు టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. సిరీస్‌లో పేలవఫామ్ కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై వేటు పడింది. ముంబైలో రేపు(గురువారం) ప్రారంభం కానున్న నాలుగో టెస్టు, చెన్నైలో జరిగే ఐదో టెస్టుకూ రహానే దూరం కానున్నాడు. ఫామ్ లేమి కారణంగానే అతడిని రెండు టెస్టులకు పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావించింది. అయితే రహానే కుడిచేతి చూపుడువేలుకు గాయమైనందున విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గాయం తీవ్రత తక్కువగా ఉన్నా రహానే ఫామ్ లేమి వల్లే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.రహానే స్థానంలో మనీశ్ పాండే చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చేయనున్నట్లు ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ ముంబై టెస్టుకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య వల్ల షమీ ఇబ్బంది పడుతున్నట్లు టీమిండియా ఫిజియో తెలిపాడు. షమీ స్థానంలో కొత్త పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు. మనీశ్ పాండే ఈ రంజీ సీజన్లో రెండు మ్యాచులలో కలిపి 188 పరుగులు చేయగా, మరోవైపు పేసర్ శార్దూల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 45 మ్యాచ్‌లు ఆడి 155 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే జట్టులో మనీశ్ స్థానం పర్మినెంట్ చేయాలనే ఉద్దేశంతోనే టెస్టుల్లో అతడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో ఇప్పటికే టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. -
ఒక్క పరుగుతో భారత్ ‘ఎ’ ఓటమి
* మనీష్ పాండే సెంచరీ వృథా * ఆస్ట్రేలియా ‘ఎ’తో వన్డే మకే (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా ఏడు పరుగులు మాత్రమే చేసింది. అరుుతే ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇరు జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రమైంది. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ 50 ఓవర్లలో 6 వికెట్లకు 322 పరుగులు చేసింది. ప్యాటర్సన్ (123 బంతుల్లో 115; 16 ఫోర్లు), మాడిసన్ (117 బంతుల్లో 118; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలు చేశారు. శార్ధుల్ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ మనీష్ పాండే (91 బంతుల్లో 110; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా... సంజూ శామ్సన్ (74 బంతుల్లో 87; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తుదికంటా పోరాడాడు. -
పాండే సెంచరీ బాదాడు
టౌన్స్ విల్లే: కెప్టెన్ మనీష్ పాండే సెంచరీకి, ధవళ్ కులకర్ణి పదునైన బౌలింగ్ తోడవడంతో దక్షిణాఫ్రికా-ఎ టీమ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్-ఎ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 7 వికెట్లు కో్ల్పోయి ఛేదించింది. వరుసగా వికెట్లు పడుతున్నా సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు పాండే. 105 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 100 పరుగులు సాధించి నాటౌట్ గా మిగిలాడు. బంతితో పాటు బ్యాటింగ్ లోనూ రాణించిన కులకర్ణి 23 పరుగులతో పాండేకు తోడుగా నిలిచాడు. జాదవ్ 26 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. మిల్లర్(90), ఆడమ్స్(52), బ్రుయిన్(40) రాణించారు. కులకర్ణి 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్, హార్థిక్ పాండ్యా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. పాండేకు 'మ్యాన్ ది మ్యాచ్' దక్కింది. -
తొలి టి20లో భారత్ ఓటమి
-
చివర్లో చేతులెత్తేశారు...
తొలి టి20లో భారత్ ఓటమి రెండు పరుగులతో గెలిచిన జింబాబ్వే భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. క్రీజులో సూపర్ ఫినిషర్ ధోనితో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు... మామూలుగా అయితే ఈ జోడీకిది పెద్ద స్కోరు కాదు... అందులోనూ బౌలింగ్ వేయడానికి వచ్చిన మద్జీవా కూడా ఓవర్‌కు 9కి పైగా పరుగులు ఇచ్చాడు. దీంతో ఇక భారత్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో జింబాబ్వే అనూహ్యంగా షాకిచ్చింది. క్రీజులో ఉన్న ధోనికి సరైన అవకాశం ఇవ్వకుండా ఇతర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి కేవలం ఐదు పరుగులతోనే సరిపెట్టింది. దీంతో ఈ టూర్లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. హరారే: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఊపుమీదున్న భారత్‌ను జింబాబ్వే ఒకే ఒక్క మ్యాచ్‌తో కిందకు దించింది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తూ టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. చిగుంబురా (26 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో... శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 2 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే (35 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. సిరీస్‌లో రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది. సిక్సర్ల జాతర... అనుభవం లేని భారత కుర్ర పేసర్లపై ఓపెనర్ మసకద్జా మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డా... ఐదో ఓవర్లో బుమ్రా దెబ్బకు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్లో ముతుబామి (0) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన జింబాబ్వే.. ఏడో ఓవర్లో చిబాబా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ దశలో రజా (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), వాలర్ (30) సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 34 బంతుల్లో 47 పరుగులు జత చేశారు. ఆఖర్లో చిగుంబురా భారత బౌలర్ల దుమ్ముదులిపాడు. ఏడు సిక్సర్లు బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సాధించాడు. మనీష్ హవా... వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన లోకేశ్ రాహుల్ (0) తొలి బంతికే డకౌట్ అయినా... మన్దీప్ సింగ్, రాయుడు (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఒకర్నిమించి ఒకరు బౌండరీలు బాదారు. అయితే ఆరో ఓవర్లో రాయుడు అనూహ్యంగా అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో మనీష్ పాండే నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నా.. రెండో ఎండ్‌లో మన్దీప్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక కేదార్ జాదవ్ (19), మనీష్‌లు సింగిల్స్‌కు పరిమితమైనా.. చెరో సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించుకున్నారు. నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించాకా జాదవ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 90/4. తర్వాత ధోని (19 నాటౌట్) అండతో మనీష్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. చకచకా ఐదో వికెట్‌కు 53 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. దీంతో స్కోరు 143/5కి చేరుకుంది. ఇక 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ (18)... 19వ ఓవర్లో 13 పరుగులు రాబట్టినా... ఆఖరి ఓవర్లో పేలవమైన బ్యాటింగ్‌తో భారత్ బోల్తా పడింది. ► 2 టి20ల్లో భారత్‌పై జింబాబ్వేకిది వరుసగా రెండో విజయం. గతేడాది జులై 19న హరారేలోనే జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగులతో నెగ్గింది. ► 1 టి20ల్లో ఒకే మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు (రిషి ధావన్, మన్దీప్ సింగ్, ఉనాద్కట్, రాహుల్, చాహల్) అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. ► 1 టి20 మ్యాచ్‌లో తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (బి) ధావన్ 20; మసకద్జా (సి) ధోని (బి) బుమ్రా 25; ముతుబామి రిటైర్డ్ హర్ట్ 0; సికిందర్ రజా రనౌట్ 20; వాలర్ (బి) చాహల్ 30; ముటోంబోది (సి) ధావన్ (బి) పటేల్ 3; చిగుంబురా నాటౌట్ 54; క్రెమర్ (సి) ధావన్ (బి) బుమ్రా 4; మద్జీవా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-33; 2-50; 3-97; 4-98; 5-111; 6-130. బౌలింగ్: ఉనాద్కట్ 4-0-43-0; రిషీ ధావన్ 4-0-42-1; బుమ్రా 4-1-24-2; అక్షర్ పటేల్ 4-0-18-1; చాహల్ 4-0-38-1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) తిరిపానో 0; మన్దీప్ (సి) ముటోంబోడి (బి) చిబాబా 31; రాయుడు (బి) చిబాబా 19; మనీష్ పాండే (సి) తిరిపానో (బి) ముజురబాని 48; కేదార్ జాదవ్ (బి) ముజురబాని 19; ధోని నాటౌట్ 19; అక్షర్ పటేల్ (సి) సబ్ మసకద్జా (బి) మద్జీవా 18; రిషీ ధావన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1-0; 2-44; 3-53; 4-90; 5-143; 6-164. బౌలింగ్: తిరిపానో 4-0-35-1; మద్జీవా 4-0-34-1; ముజురబాని 4-0-31-2; చిబాబా 2-0 -13-2; రజా 3-0-18-0; క్రెమెర్ 3-0-35-0. -
ప్రయోగాల వేళ...
► ఉత్సాహంతో కొత్త కుర్రాళ్లు ► సత్తా నిరూపించుకునేందుకు సిద్ధం ► నేడు జింబాబ్వేతో తొలి వన్డే ప్రతిభాన్వేషణ... ప్రయోగాలు... భవిష్యత్తు కోసం సన్నద్ధత... సత్తా నిరూపించుకునే అవకాశం... పేరు ఏదైనా కావచ్చు... భారత ‘జూనియర్’ జట్టు ఇప్పుడు జింబాబ్వే ‘సీనియర్’ టీమ్‌తో పోటీకి సిద్ధమైంది. దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనేక మంది ఆటగాళ్లకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక లభించింది. నేటినుంచి జరిగే సిరీస్‌లో కొత్త కుర్రాళ్లకు ఇదో మంచి అవకాశం కాగా... ఈ జట్టును ధోని నడిపిస్తుండటం వారిలో మరింత స్ఫూర్తి పెంచే అంశం. అనుభవం లేకపోయినా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, సొంతగడ్డపై జింబాబ్వే ఏ మాత్రం పోటీనివ్వగలదో చూడాలి. హరారే: కెప్టెన్ ధోని ఒక్కడే 275 వన్డేలు ఆడితే, మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 మాత్రమే. జింబాబ్వేతో సిరీస్‌లో తలపడే భారత జట్టు అనుభవం ఏమిటో చెప్పే లెక్క ఇది. అయితే ఐపీఎల్ ద్వారా కావాల్సినంత అనుభవం సంపాదించిన వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు. ఇప్పుడు ఈ జట్టు జింబాబ్వేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. మరో వైపు జింబాబ్వే మాత్రం సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమై తన నంబర్‌వన్ జట్టునే బరిలోకి దించుతోంది. 2013, 2015లో కూడా ద్వితీయ శ్రేణి జట్టుతోనే జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఆ రెండు సార్లూ వన్డే సిరీస్‌లను 5-0, 3-0తో క్లీన్ స్వీప్ చేయడం విశేషం. తుది జట్టులో ఎవరు భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కేఎల్ రాహుల్ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. మరికొందరు జింబాబ్వేలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ జూనియర్ బృందంతోనే ఫలితాలు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ధోనిని పక్కన పెడితే...రాయుడు, అక్షర్ పటేల్ చెప్పుకోదగ్గ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడారు. ఆరంభంలో ఆకట్టుకొని తర్వాత సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన వీరిద్దరు మళ్లీ రాణిస్తే రెగ్యులర్ స్థానం కోసం పోటీ పడవచ్చు. అదే విధంగా తన చివరి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన మనీశ్ పాండే కూడా తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇక్కడ బాగా ఆడటం అవసరం. రెగ్యులర్ టీమ్‌లో రైనా స్థానాన్ని భర్తీ చేయాలంటే పాండేతో పాటు కరుణ్ నాయర్‌కు కూడా మంచి అవకాశం లభించింది. బుమ్రా స్ట్రైక్ బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా, ధావల్ సహకరిస్తాడు. మూడో పేసర్ కోసం ఉనాద్కట్, బరీందర్ మధ్య పోటీ ఉంటుంది. ఇక యజువేంద్ర చహల్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తే...భవిష్యత్తులో లెగ్‌స్పిన్నర్‌గా ప్రధాన జట్టుకూ ఎంపికయ్యే అవకాశం ఉంది. సంచలనంపై ఆశలు ఈ సిరీస్ ఆరంభానికి ముందే జింబాబ్వే తమ కోచ్ వాట్మోర్, కెప్టెన్ హామిల్టన్ మసకద్జలను తప్పించింది. వారి స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఎన్తిని, క్రీమర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. గాయంతో దూరమైన పన్యగర మినహా జింబాబ్వే తమ అత్యుత్తమ జట్టునే సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే గత ఏడాది కాలంగా ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో సూపర్ 10కు అర్హత కూడా సాధించలేకపోయిన జింబాబ్వే వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్కంటే దిగువగా ఉంది. వేర్వేరు కారణాలతో ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌తో పోటీ పడలేక వెనుకబడిపోయింది. జట్టు తాజా ఫామ్ చూస్తే కనీసం 50 ఓవర్లు పూర్తిగా ఆడగలదా అనే సందేహం కూడా కనిపిస్తోంది. అయితే సికందర్ రజా, సీన్ విలియమ్స్, హామిల్టన్ మసకద్జా, చిగుంబురా, ఇర్విన్ జట్టులో ఇప్పటికీ కీలక ఆటగాళ్లు. టీమ్ జయాపజయాలు వీరిపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి వన్డేలో బరిలోకి దిగితే చిగుంబురా జింబాబ్వే తరఫున ఆండీ, గ్రాంట్ ఫ్లవర్ తర్వాత 200 వన్డేలు ఆడిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. జట్లు భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్ జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్. ధోని ఏం చేస్తాడు? జింబాబ్వేతో సిరీస్ తర్వాత ఈ సీజన్లో భారత్ పెద్ద సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లే ఆడనుంది. సొంతగడ్డపై కొన్ని వన్డేలు, టి20లు ఉన్నా వాటికి చాలా సమయం, మధ్యలో విరామం ఉంది. కాబట్టి కెప్టెన్‌గా ధోని అంతర్జాతీయ క్రికెట్లో కనిపించేది తక్కువే. ఇప్పుడు పసికూనవంటి జట్టును నడిపించేందుకు అతను సిద్ధమయ్యాడు. జింబాబ్వేతో సిరీస్ గెలిస్తే అందులో పెద్దగా విశేషం ఏమీ కనిపించకపోవచ్చు. ధోని కెప్టెన్సీకి అదనంగా కలిసొచ్చేదీ ఏమీ లేదు. కానీ పొరపాటున ఏదైనా తేడా రావడమో, మ్యాచ్ ఓడటమో జరిగితే అతని పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోవచ్చు. ఈ ఒక్క సిరీస్‌తోనే నాయకత్వానికి ముప్పు వచ్చే సమస్య లేదు గానీ... కోహ్లి ఫామ్ నేపథ్యంలో ఇప్పటికే ధోనికి పొగ పెడుతున్నవారి సంఖ్య మరింత పెరిగిపోతుంది. కాబట్టి జట్టులో జూనియర్లే ఉన్నా రెండు సిరీస్‌లు గెలవడమే ధోని లక్ష్యం. 11 ఏళ్ల తర్వాత అతను జింబాబ్వే గడ్డపై సిరీస్ ఆడుతుండటం విశేషం. -
కొత్త బాధ్యత
జింబాబ్వేతో సిరీస్‌కు ధోనియే కెప్టెన్ ► తొలిసారి జట్టులోకి ఆరుగురు ► ఫైజ్ ఫజల్‌కు అనూహ్య అవకాశం దాదాపు తొమ్మిదేళ్ల కెప్టెన్సీలో దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన సమకాలికులతోనూ, జూనియర్లతోనూ జట్లను నడిపించి అద్భుత విజయాలు సాధించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. కెరీర్ చివర్లో ఇప్పుడు మరింత మంది కొత్త కుర్రాళ్లకు మార్గదర్శనం చేసే బాధ్యతను అతనిపై బీసీసీఐ పెట్టింది. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటించనున్న ‘యంగ్ బ్రిగేడ్’ను అతను నడిపించనున్నాడు. ఈ బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఉండటం విశేషం. ముంబై: వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచి కుర్రాళ్లను గుర్తించి, తీర్చిదిద్దాలని బీసీసీఐ నిర్ణయించిందా...లేక రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువగా టెస్టులు మాత్రమే ఆడనుంది కాబట్టి విరామం వద్దంటూ ధోని తానే సిద్ధమయ్యాడా...ఈ సిరీస్‌తో అతని కెప్టెన్సీ ముగుస్తుందా... కారణమేదైనా వన్డే, టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల జట్టు ప్రకటన కాస్త ఆశ్చర్యపరిచింది. గత ఆస్ట్రేలియా పర్యటననుంచి టి20 ప్రపంచ కప్ వరకు భారత వన్డే, టి20 జట్టులో సభ్యులుగా ఉన్న 17 మందిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టడం విశేషం! సీనియర్లలో ధోని ఒక్కడే ఇప్పుడు జింబాబ్వేకు వెళుతున్నాడు. జూన్ 11నుంచి 22 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 3 టి20ల్లో జింబాబ్వేతో తలపడుతుంది. ధోనిలో మూడో వంతు ఈ టూర్ కోసం ఎంపికైన జట్టులో ధోని ఒక్కడే 275 వన్డేలు, 68 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 వన్డేలు, 28 టి20లు మాత్రమే. ఈ జట్టుకు ఎంత అనుభవం ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. ‘మేం ఎవరికీ విశ్రాంతి ఇవ్వలేదు. ఏ ఆటగాడు కూడా తాను అందుబాటులో ఉండనని, తనను ఎంపిక చేయవద్దని కోరలేదు కూడా. జింబాబ్వేకు యువ జట్టును, విండీస్‌కు మరో జట్టును ఎంపిక చేయడమనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమే’ అని కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. అయితే వన్డేలు, టి20లు రెగ్యులర్‌గా ఆడుతున్న కోహ్లి, రోహిత్, అశ్విన్, ధావన్‌లాంటి ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా క్రికెట్ ఆడని రైనా, యువరాజ్, జడేజా, భువనేశ్వర్‌లను ఎందుకు పక్కన పెట్టినట్లో! పైగా వరల్డ్ కప్ మొత్తం కూర్చున్నా ఒక్క మ్యాచ్ ఆడని హర్భజన్, నేగి, ఇంకా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ పాండ్యాలను కూడా తప్పించి సెలక్టర్లు ఏం చెప్పదల్చుకున్నారు? అటు విశ్రాంతి కాకుండా ఇటు వేటు వేయకుండా 17 మందిని పక్కన పెట్టడం నిజంగా ఆశ్చర్యకరం. ఎలా వచ్చారంటే..? జట్టు సభ్యులలో కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో రెగ్యులర్ కాగా, వన్డేలకు మాత్రం ఇప్పుడే ఎంపికయ్యాడు. ఐపీఎల్లో చెలరేగడం అతనికి కలిసొచ్చింది. కరుణ్ నాయర్ గత ఏడాది శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా, మ్యాచ్ లభించలేదు. ఇతనూ ఐపీఎల్ ప్రదర్శనతోనే వచ్చాడు. మిగతా నలుగురు మన్దీప్ సింగ్, యజువేంద్ర చహల్, జయంత్ యాదవ్, ఫైజ్ ఫజల్లకు భారత జట్టు పిలుపు రావడం ఇదే తొలిసారి. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలవడం మన్‌దీప్‌కు, ఐపీఎల్లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండటం చహల్ ఎంపికకు కారణమయ్యాయి. టి20ల్లో 6కంటే తక్కువ ఎకానమీ ఉన్న హర్యానా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు మొదటి అవకాశం దక్కింది. 2011 తర్వాత ఐపీఎల్లో ఏ జట్టుకూ ఆడని 30 ఏళ్ల ఫైజ్ ఫజల్‌కు తొలిసారి టీమిండియా చాన్స్ రావడం విశేషం. విదర్భ జట్టుకు చెందిన ఫజల్ ఈ ఏడాది నాలుగు దేశవాళీ టోర్నీలు ఇరానీ, దేవధర్, విజయ్‌హజారే, ముస్తాక్ అలీలో నిలకడగా రాణించాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్‌లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్. ► జింబాబ్వే సిరీస్ షెడ్యూల్ జూన్ 11: తొలి వన్డే, జూన్ 13: రెండో వ న్డే జూన్ 15: మూడో వన్డే, జూన్ 18: తొలి టి20 జూన్ 20: రెండో టి20, జూన్ 22: మూడో టి20 8 అన్ని మ్యాచ్ లు హరారేలో జరుగుతాయి. 8 వన్డేలు మ. 12.30 నుంచి, టి20లు సా. 4.30 నుంచి. దేశవాళీ ప్రతిభకు గుర్తింపు: గవాస్కర్ న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన కోసం భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను జాతీయ సెలక్షన్ కమిటీ గుర్తించడం అభినందనీయమని అన్నారు. ‘దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేయడం సంతోషం కలిగించింది. ఐపీఎల్ కూడా దేశవాళీయే అని వాదిస్తారు. కానీ రంజీ, ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో చూపిన ప్రదర్శనను జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి’ అని అన్నారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ, శార్దూల్ ఠాకూర్. ► వెస్టిండీస్‌లో టెస్టులు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇంకా తేదీలు, వేదికలు ఖరారు కాలేదు. -
'రెండొందల స్కోరును చేయాల్సింది'
కోల్‌కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమి తమకు ఓ గుణపాఠమని కోల్‌కతా నైట్ రైడర్స్ టాపార్డర్ ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్‌లో 180 పరుగులకు పైగా స్కోరు నమోదు చేసినా పరాజయం చెందడం ఒకింత నిరాశకు గురి చేసిందన్నాడు. మరో 20కు పైగా పరుగులు సాధిస్తే మ్యాచ్ ఫలితం తమకు అనుకూలంగా ఉండేదన్నాడు. 'ముంబైతో మ్యాచ్‌లో 200 పరుగులు చేస్తామనుకున్నాం. అదే దిశగా మా బ్యాటింగ్ కూడా కొనసాగింది. అయితే కీలక సమయాల్లో వికెట్లను చేజార్చుకోవడంతో అనుకున్న పరుగులు సాధించడంలో విఫలమయ్యాం. కెప్టెన్ గౌతం గంభీర్, ఆండ్రీ రస్సెల్‌లు చివరి వరకూ క్రీజ్‌లో ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవి. ఏది ఏమైనా ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం. మేము మరింత పుంజుకోవడానికి నిన్నటి పరాజయం దోహదం చేస్తుంది' అని పాండే పేర్కొన్నాడు. -
టీమిండియా వ్యూహం ఫలించింది..
ముంబై: వెస్టిండీస్‌తో టి-20 ప్రపంచ కప్ సెమీస్‌లో టీమిండియా వ్యూహం ఫలించింది. ఈ టోర్నీలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్‌ను పక్కనబెట్టి అతని స్థానంలో అజింక్యా రహానెను తుది జట్టులోకి తీసుకోవడం సత్ఫలితాన్నిచ్చింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె శుభారంభాన్నందించారు. రోహిత్, రహానె తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. కాగా 31 బంతుల్లో మూడేసి ఫోర్లు, సిక్సర్లతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న రోహిత్ (43).. బద్రీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక రహానె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రహానె భారీ షాట్లకు ప్రయత్నించకున్నా.. రోహిత్‌కు, ఆ తర్వాత కోహ్లీకి అండగా ఉంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. రహానె 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. -
ధవన్ స్థానంలో రహానె వచ్చాడు..
ముంబై: వెస్టిండీస్‌తో టి-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేశారు. ఈ మెగా ఈవెంట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్‌ను కీలక సెమీస్ పోరుకు పక్కనబెట్టారు. రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన అజింక్యా రహానెను ధవన్ స్థానంలో ఓపెనర్‌గా తీసుకున్నారు. ఇక గాయం కారణంగా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దూరమవడంతో మనీశ్ పాండేకు తుది జట్టులో చాన్స్ దక్కింది. టీమిండియా కెప్టెన్ ధోనీ అండ్ కో బస చేసిన హోటల్లో ఈ రోజు సమావేశమై తుది జట్టులో మార్పుల గురించి చర్చించారు. ఈ టోర్నీలో టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో విరాట్‌కు ధోనీ, యువరాజ్ మాత్రమే అండగా ఉంటున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధవన్‌తో పాటు సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోతున్నారు. దీనికితోడు యువరాజ్ గాయంతో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో మార్పులు చేశారు. రహానె, పాండేలకు అవకాశం ఇచ్చారు. -
యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్
ముంబై: అనుకున్నట్లే జరిగింది. చీలమండ గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రేపు(గురువారం) ముంబైలో వెస్టిండీస్ తో జరగనున్న సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం యువరాజ్ స్థానంలో మనీశ్ పాండేను జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు నిర్ధారించారు. నిజానికి యువరాజ్ గాయపడ్డప్పుడే మనీశ్ జట్టులోకి వస్తాడని ఊహించినప్పటికీ బుధవారం సెలెక్టర్ల ప్రకటనతో అది ఖరారయింది. సెమీస్ లోకి ప్రవేశించేందుకు గత ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగన అమీతుమీ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఒక్కసారిగా కూలబడ్డ యువరాజ్ ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తొలి, మలి టీ20 వరల్డ్ కప్ ల్లో సత్తా చాటినంతగా యువరాజ్ ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన అతను.. కేవలం 63 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పాకిస్థాన్ పై సాధించిన 24 పరుగులే అత్యధిక స్కోరు. మూడు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసే అవకాశం రాని యువరాజ్ ఆసీస్ తో జరిగి మ్యాచ్ లో మాత్రం మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు. -
యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువరాజ్ సింగ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే భారత జట్టుతో పాటు చేరాడు. ఒకవేళ యువీ సెమీస్ సమయానికి ఫిట్‌గా లేకపోతే రహానే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆఖరి క్షణంలో మరో బ్యాట్స్‌మన్ గాయపడ్డా ఇబ్బంది లేకుండా పాండే కూడా ముంబైలో జట్టుతో పాటు చేరాడు. -
'మనీష్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు'
కోల్‌కతా: త్వరలో జరుగనున్న ఆసియా కప్, వరల్డ్ టీ 20కు ప్రకటించిన భారత జట్టులో స్థానం దక్కని మనీష్ పాండే తన ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ఇటువంటి సమయాల్లోనే మరింత ధృడంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని గంగూలీ పేర్కొన్నాడు. 'పాండే నిరాశను దరిచేరనీయొద్దు. మరింత రాణించేందుకు ప్రయత్నించు. పాండే కంటే రహానే మెరుగ్గా ఉన్నందువల్లే స్థానం దక్కలేదు. నీకంటే రహానే చాలా ముందు వరుసలో ఉన్నాడు. నువ్వు ఆడటానికి వరల్డ్ టీ 20, ఆసియా కప్ ఒక్కటే క్రికెట్ కాదు. ఇప్పటికే నీ పేరు సెలక్టర్లు దృష్టిలో ఉన్నందున బాధ పడాల్సిన అవసరం లేదు. త్వరలో నీకు తప్పకుండా మరో ఛాన్స్ వస్తుంది' అని గంగూలీ భరోసా ఇచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో పాండే అజేయ శతకంతో రాణించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా క్లిష్ట సమయంలో రాణించడంతో సెలక్టర్లను పాండే విపరీతంగా ఆకర్షించాడు. దాంతో అతనికి శ్రీలంకతో ఈనెలలో జరిగే మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో పాండేకు అవకాశం కల్పించారు. అయితే ఆసియా కప్ , టీ 20 వరల్డ్ కప్ టోర్నీలలో ప్రకటించే జట్టులో మనీష్ పాండేకు చోటు దక్కే అవకావం ఉందని తొలుత భావించినా.. అతనికి నిరాశే ఎదురైంది. -
‘ ఆ ఒక్క’ స్థానంలో ఎవరు?
♦ అజింక్య రహానే, మనీశ్ పాండే మధ్య పోటీ ♦ టి20 ప్రపంచకప్‌కు నేడు భారత జట్టు ఎంపిక ♦ ఆసియా కప్ టోర్నీకి కూడా న్యూఢిల్లీ: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లోనే భారత జట్టు కూర్పుపై ఒక అంచనా వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మార్పు కూడా లేకుండా అదే 11 మంది ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. కెప్టెన్ ధోని కూడా దాదాపు ఇదే టీమ్ అంటూ ప్రస్తుత సభ్యులకే తన ఓటు వేశాడు. కాబట్టి సొంతగడ్డపై జరిగే టి20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఎంపికలో ఎలాంటి సంచలనాలకు పెద్దగా అవకాశం లేదు. ఆసీస్‌ను చిత్తు చేసిన టీమ్‌పై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు (శుక్రవారం) ఇక్కడ సమావేశమవుతోంది. పనిలో పనిగా ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే జట్టును కూడా ప్రకటిస్తారు. అయితే బంగ్లాదేశ్ పరిస్థితులకు, భారత్‌కు పెద్దగా తేడా ఉండకపోవడం, ఈసారి ఆసియా కప్ ఫార్మాట్ కూడా టి20 కావడంతో రెండు వేర్వేరు జట్లు కాకుండా ఒకే టీమ్‌ను రెండింటికీ ఎంపిక చేసే అవకాశం ఉంది. కుర్రాళ్లు ఖాయం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో బరిలోకి దిగిన జట్టులో రెగ్యులర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ధోని మద్దతును బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ స్థానానికి కూడా వచ్చిన ప్రమాదమేమీ లేదు. తమ ప్రదర్శనతో కొత్త కుర్రాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తమ స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆశిష్ నెహ్రాపై కూడా మేనేజ్మెంట్కు నమ్మకముంది. అయితే ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైన జట్టులో అజింక్య రహానే, మనీశ్ పాండేలు ఇద్దరూ ఉన్నారు. విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో పాండేకు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు ప్రపంచకప్ కోసం ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు తప్పుకోవాల్సిన పరిస్థితి. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో రహానే నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగా, ఇటీవలి సిడ్నీ వన్డే ఇన్నింగ్స్, టి20 శైలి బ్యాటింగ్ పాండేకు ఉన్న అనుకూలతలు. చివరి ఓవర్లలో రహానే హిట్టింగ్ సామర్థ్యంపై స్వయంగా ధోనికే సందేహాలు ఉన్నా... ఒక జూనియర్ కోసం అతడిని ఉన్నపళంగా పక్కన పెడతారా అనేది సందేహమే. ఇర్ఫాన్ పఠాన్ ఆశలు... ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో కొత్త ఆటగాడు పవన్ నేగి కూడా ఉన్నాడు. అతడిని ఇదే సిరీస్ వరకు పరిమితం చేస్తే ఆ స్థానంలో మరో ఆటగాడికి వరల్డ్ కప్ అవకాశం ఉంది. నెహ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహం ఉండటంతో మరో లెఫ్టార్మ్ సీమర్‌ను ఎంపిక చేయవచ్చు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చిన ఇర్ఫాన్ పఠాన్ ఆ స్థానం ఆశిస్తున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉంటే మొహమ్మద్ షమీ తిరిగొచ్చే అవకాశం కూడా ఉంది. -
రహానే వర్సెస్ పాండే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి పొట్టి ఫార్మెట్ లో తమ సత్తాను చాటుకుంది. దీంతో పాటు టీ 20లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. త్వరలో భారత్ లో ప్రారంభమయ్యే వరల్డ్ టీ 20 జట్టు ఎంపికలో మాత్రం భారత సెలక్టర్లకు పరీక్ష ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఆస్ట్రేలియాలో వన్డే, టీ20లో ఆడిన జట్టునే వరల్డ్ ట్వంటీ 20 కి దాదాపు ఎంపిక చేసే అవకాశం ఉన్నా.. ప్రత్యేకంగా ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడింది. ఒకరు అజింకా రహానే అయితే.. మరొకరు మనీష్ పాండే. ఆ ఇద్దరూ మిడిల్ ఆర్డర్ లో విశేషంగా రాణిస్తుండటమే వారి మధ్య పోటీకి కారణం. కాగా, టీమిండియా ఎన్నాళ్ల నుంచో ఏడో స్థానంపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇక్కడ సరైన ఆటగాడు లేకపోవడంతోనే టీమిండియా కీలక సమయాల్లో ఓటమి పాలవుతుందనేది అటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు, సెలక్టర్ల భావన. దీనిని అధిగమించాలంటే ఆ స్థానాన్నిఎంత తొందరగా భర్తీ చేస్తే అంత మంచిదని బీసీసీఐ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రహానే-మనీష్‌లు తెరపైకి వచ్చారు. మరోవైపు ఈ నెలలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు యువరాజ్ తో పాటు, రహానే, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఇక్కడ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చినా.. యువరాజ్ ను, మనీష్‌లను పరీక్షించాలనేది టీమిండియా మొదటి ఆలోచన. ఆసీస్ తో చివరి టీ 20 అనంతరం యువీపై ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరికొన్ని మ్యాచ్ లు ఆడితే యువీ తన ఫామ్ ను అందుకుంటాడని పేర్కొన్నాడు. యువరాజ్ ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలనే ఆలోచలో ఉన్నట్లు కూడా వెల్లడించాడు. దీనిలో భాగంగానే శ్రీలంకతో టీ 20 సిరీస్ కు యువీని ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆసియా కప్ తో పాటు, టీ 20 వరల్డ్ కప్ లో యువీకి చోటు దక్కడంతో పాటు, తుది జట్టులో ఆడే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంచితే ఆసియా కప్ తో పాటు, వరల్డ్ టీ 20కి ముందుగానే జట్టును ఎంపిక చేస్తుండటంతో రహానేకు మనీష్ పోటీగా నిలిచాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో రహానే ఆకట్టుకున్నా.. ఆ తరువాత గాయం కారణంగా ఒక వన్డేతో పాటు, టీ 20 లకు దూరమయ్యాడు. కాగా, ఆఖరి వన్డేలో అద్భుతమైన శతకంతో ఆసీస్ కు షాకిచ్చిన మనీష్ పాండే ఒక్కసారిగా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆసీస్ తో టీ 20 సిరీస్ లో పాండేకు ఆడే అవకాశం దక్కలేదు. కాగా, వరుసగా శ్రీలకంతో టీ 20 సిరీస్, ఆసియా టీ 20 టోర్నమెంట్ తో పాటు, వరల్డ్ టీ 20 జరుగుతున్న నేపథ్యంలో మనీష్ పాండేను ఏడోస్థానంలో పరీక్షించాలని టీమిండియా సెలక్టర్ల యోచనగా కనబడుతోంది. భారత వరల్డ్ టీ 20 ప్రాబబుల్స్ లో రహానే, మనీష్ లకు అవకాశం కల్పించినా...తుది జట్టులో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. తొలి ఆరు స్థానాల్లో రోహిత్ శర్మ , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉండే అవకాశం ఉండటంతో ఏడో స్థానం కోసమే పోటీ నెలకొంది. అటు ఫామ్ , క్లాస్ ను పరిశీలిస్తే మాత్రం రహానే వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నా, పాండే నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. శుక్రవారం ఆసియా కప్, వరల్డ్ టీ 20 లకు టీమిండియా జట్టును ఎంపిక చేయనున్న తరుణంలో రహానే, పాండేల పేర్లే సెలక్షన్ కమిటీలో చర్చనీయాంశంగా మారనున్నాయి. -
నాలుగో స్థానమే నా ఖిల్లా: పాండే
సిడ్నీ: తాను ఎప్పుడూ పిచ్ ను బట్టి బ్యాటింగ్ శైలిని త్వరగా మార్చుకుంటూ ఉంటానని టీమిండియా ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో అజేయ శతకంతో దుమ్మురేపి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పాండే నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. 'నాకు నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా బ్యాటింగ్ శైలికి ఆ స్థానమే కచ్చితంగా సరిపోతుంది. గత రెండు మ్యాచ్ ల్లో ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసే అవకాశం దొరకలేదు. నేను క్రీజ్ లోకి వచ్చాక మూడు-నాలుగు బంతుల్ని చూసుకుని ఒక అంచనాకు వస్తా. దాన్ని బట్టే నా శైలిని మార్చుకుంటా. ప్రతీ బంతిని బౌండరీకి పంపాలంటే సాధ్యం కాదు. ఒకటి-రెండు పరుగులు తీస్తూ స్ట్రైక్ రోటేట్ చేస్తేనే స్కోరు బోర్దు కదులుతుంది' అని మనీష్ తెలిపాడు. కాగా, పాండే ఐదో స్థానానికి సరిపోతాడని ఆఖరి వన్డే ముగిసిన అనంతరం ధోని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మనీశ్ మహిమ...
-
మనీశ్ మహిమ...
♦ అజేయ సెంచరీతో గెలిపించిన పాండే ♦ రాణించిన రోహిత్, శిఖర్, ధోని ♦ చివరి వన్డేలో నెగ్గిన టీమిండియా ఆడుతోంది కెరీర్లో నాలుగో వన్డే మాత్రమే. ఎదురుగా ఆస్ట్రేలియాతో వారి గడ్డపై భారీ లక్ష్యఛేదన. కానీ యువ ఆటగాడు మనీశ్ పాండే ఏ దశలోనూ తొణకలేదు. ఆద్యంతం సాధికారిక షాట్లు ఆడిన అతను చివరకు అదే దూకుడుతో భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. 11 పరుగుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు అవుటైన స్థితిలో బరిలోకి దిగి ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. ధోని అండగా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన విలువేమిటో చూపించాడు. చివరి మూడు ఓవర్లలో భారత్ విజయానికి 35 పరుగులు కావాలి. క్రీజ్‌లో ధోని, పాండే ఉన్నారు. రెండు ఓవర్లలో 22 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. మిషెల్ మార్ష్ వేసిన తొలి బంతి వైడ్ కాగా, ఆ వెంటనే భారీ సిక్సర్ బాదిన ధోని తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అయితే బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న పాండే మరుసటి బంతికే ఆటను ముగించాడు. లక్ష్యానికి చేరువగా వచ్చినా... మళ్లీ విజయంపై సందేహాలు రేకెత్తించిన టీమిండియా ఈసారి మ్యాచ్ చేజారనివ్వలేదు. మొత్తానికి 4 పరాజయాల తర్వాత దక్కిన విజయంతో భారత్ పరువు నిలిచింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించగా, పలు రికార్డులు వెల్లువెత్తిన చివరి వన్డేలో భారత్‌కు గెలుపు దక్కింది. టి20 సిరీస్‌కు ముందు ధోని సేనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ధోనికి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. వహ్వా పాండేజీ..! ఆ ఇన్నింగ్స్‌లో బాధ్యత ఉంది, దూకుడూ ఉంది... బ్యాటింగ్‌లో జాగ్రత్త కనిపించింది, గెలిపించాలన్న పట్టుదలా కనిపించింది. ఫామ్‌లో ఉన్న టాప్ ఆటగాళ్లు వెనుదిరిగాక, రన్‌రేట్ కొండలా పెరిగిపోతుండగా, ఎవరూ నమ్మకం పెట్టుకోని దశ నుంచి ‘ఫినిషింగ్ టచ్’ ఇచ్చే వరకు 26 ఏళ్ల మనీశ్ పాండే బ్యాటింగ్ అద్భుతంలా కనిపించింది. నేను ఎదురు చూస్తోంది ఇలాంటి చాన్స్ కోసమే అన్నట్లుగా అతను చెలరేగిపోయిన తీరు మరో ప్రతిభ గల యువ ఆటగాడిని క్రికెట్ ప్రపంచం గుర్తించేలా చేసింది. మూడో వన్డేలో ఐదు బంతులే ఆడే అవకాశం రాగా, తర్వాతి మ్యాచ్‌లో అతను పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. రహానే లేకపోవడంతో బరిలోకి దిగిన ఈ కర్ణాటక స్టార్ భారత అభిమానుల్లో ఆనందం నింపాడు. రోహిత్, ధావన్‌లు కూడా బాగా ఆడినా... జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది మాత్రం పాండేనే. తీవ్రమైన ఒత్తిడి మధ్య బరిలోకి దిగినా ఎక్కడా అతను దానిని కనబడనీయకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం ఈ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ అంశం. క్రీజ్‌లో వెనక్కి వెళుతూ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా కొట్టిన మూడు బౌండరీలు సూపర్ అయితే హేస్టింగ్స్ బౌలింగ్‌లో ఒంటికాలిపై కొట్టిన అప్పర్కట్ మరో స్పెషల్ షాట్. చివర్లో విజయానికి కీలకంగా మారిన రెండు థర్డ్‌మ్యాన్ బౌండరీలు అతని తెలివితేటలకు నిదర్శనం. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వెలుగులోకి వచ్చిన మనీశ్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో మరో మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించి అందరినీ ఆకర్షించాడు. నైనిటాల్లో పుట్టినా... తండ్రి ఆర్మీ ఉద్యోగం కారణంగా బెంగళూరులో స్థిరపడిన మనీశ్... ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల కర్ణాటక జట్లలో సత్తా చాటాడు. 2009-10 రంజీ సీజన్లో నాలుగు సెంచరీలతో 882 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచిన అతను, కర్ణాటక జట్టు వరుసగా రెండేళ్లు రంజీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీనియర్ల గైర్హాజరీతో గత ఏడాది జింబాబ్వేతో కెరీర్లో తొలి వన్డే ఆడి 71 పరుగులు చేసిన మనీశ్, ఈ సిరీస్‌లో తన ఫీల్డింగ్ మెరుపులు కూడా ప్రదర్శించాడు. సిడ్నీలో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతను మంగళవారం తొలి టి20లో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే పాండే ఎంపికైంది వన్డేలకే! -సాక్షి క్రీడావిభాగం సిడ్నీ: ఎట్టకేలకు ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఓ విజయం దక్కింది. భారీ ఛేదనలో కాస్త తడబడినా చివరకు టీమిండియా లక్ష్యాన్ని చేరి క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్ (113 బంతుల్లో 122; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (84 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 4 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (81 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ (108 బంతుల్లో 99; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో కోల్పోయాడు. శిఖర్ (56 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హేస్టింగ్స్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 4-1 తో సొంతం చేసుకుంది. మొత్తం 441 పరుగులు చేసిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం మొదలవుతుంది. సెంచరీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. తొలి ఓవర్లోనే ఫించ్ (6)ను అవుట్ చేసి ఇషాంత్ భారత్‌కు శుభారంభం అందించాడు. కొద్దిసేపటికే తన మూడో ఓవర్లో స్మిత్ (28)ను అవుట్ చేసి బుమ్రా వన్డేల్లో తొలి వికెట్ సాధిం చాడు. ఆ వెంటనే బెయిలీ, షాన్ మార్ష్ కూడా అవుటవ్వడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. దాంతో వార్నర్ కూడా తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోరు 117/4గా ఉన్న దశలో జత కలిసిన వార్నర్, మిషెల్ మార్ష్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 100 బంతుల్లో భారత్‌పై తొలి సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ చివరకు ఇషాంత్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఒక దశలో అద్భుతంగా ఆడిన మిషెల్ మార్ష్ తొలి సెంచరీ కోసం చివర్లో తడబడటంతో ఆసీస్ పరుగుల జోరు తగ్గింది. భారత బౌలర్లలో బుమ్రా ఆకట్టుకోగా... ఉమేశ్ పేలవ బౌలింగ్ ఆసీస్‌కు కోలుకునే అవకాశం ఇచ్చింది. రోహిత్ సెంచరీ మిస్... భారీ ఛేదనలో మరోసారి రోహిత్, శిఖర్ శుభారంభం అందించారు. ప్రతి బౌలర్‌ను చితకబాది వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 68 పరుగులకు చేరింది. లయోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న శిఖర్... షాన్ మార్ష్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. సిరీస్‌లో చెలరేగుతూ వచ్చిన కోహ్లి (8) ఈసారి విఫలమయ్యాడు. రహానే స్థానంలో జట్టులోకి వచ్చిన మనీశ్ పాండే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడి సిరీస్‌లో మూడో సెంచరీకి చేరువైన రోహిత్‌ను దురదృష్టం వెంటాడింది. 99 వద్ద హేస్టింగ్స్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఆడబోయి అతను కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 91 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన దశలో ధోని (42 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) బరిలోకి దిగాడు. కెప్టెన్, పాండే మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. 7 పరుగుల వద్ద ధోని ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను డీప్ మిడ్వికెట్లో లయోన్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. ఒకవైపు పాండే దూకుడు ప్రదర్శించగా, ధోని జాగ్రత్తగా ఆడాడు. తాను ఎదుర్కొన్న 36వ బంతికి గానీ ధోని ఫోర్ కొట్టలేదు! గెలిచేందుకు ఆరు పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుటైనా, పాండే మిగతా పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 6; వార్నర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 122; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 28; బెయిలీ (సి) ఇషాంత్ (బి) రిషి ధావన్ 6; షాన్ మార్ష్ (రనౌట్) 7; మిషెల్ మార్ష్ (నాటౌట్) 102; వేడ్ (సి) ధోని (బి) ఉమేశ్ 36; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 1; హేస్టింగ్స్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 330. వికెట్ల పతనం: 1-6; 2-64; 3-78; 4-117; 5-235; 6-320; 7-323. బౌలింగ్: ఇషాంత్ 10-0-60-2; ఉమేశ్ 8-0-82-1; జస్ప్రీత్ బుమ్రా 10-0-40-2; రిషి ధావన్ 10-0-74-1; రవీంద్ర జడేజా 10-0-46-0; గుర్కీరత్ 2-0-17-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 99; శిఖర్ ధావన్ (సి) షాన్ మార్ష్ (బి) హేస్టింగ్స్ 78; కోహ్లి (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 8; మనీశ్ పాండే (నాటౌట్) 104; ధోని (సి) వార్నర్ (బి) మిషెల్ మార్ష్ 34; గుర్కీరత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49.4 ఓవర్లలో 4 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1-123; 2-134; 3-231; 4-325. బౌలింగ్: హేస్టింగ్స్ 10-1-61-3; బోలండ్ 10-0-58-0; మిషెల్ మార్ష్ 9.4-0-77-1; ఫాల్క్‌నర్ 10-0-54-0; లయోన్ 8-0-58-0; స్మిత్ 2-0-20-0. -
నమ్మకం పెరిగింది
♦ ప్రాక్టీస్ వన్డేలోనూ భారత్ విజయం ♦ రాణి ంచిన రోహిత్, మనీశ్ పాండే ఏడాది క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఎవరూ కనీసం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి కూడా సరిగ్గా అలాంటి పేస్ పిచ్‌ల మీదే సిరీస్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లను భారత్ సద్వినియోగం చేసుకుంది. తొలుత ప్రాక్టీస్ టి20లో నెగ్గిన ధోని సేన... శనివారం జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ టి20లో నెగ్గిన భారత్... వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. శనివారం ‘వాకా’ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేన 64 పరుగుల తేడాతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.1 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ (82 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫామ్‌లోకి రాగా... మనీశ్ పాండే (59 బంతుల్లో 58; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అజింక్య రహానే (53 బంతుల్లో 41; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్సర్) కీలక సమయంలో బాగా ఆడారు. డ్రూ పోర్టర్ ఐదు వికెట్లు తీసుకోగా... మూర్హెడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటయింది. కార్డర్ (73 బంతుల్లో 45; 2 ఫోర్లు), మోర్గాన్ (66 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో రిషి ధావన్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కీలక భాగస్వామ్యం టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన ధావన్, కోహ్లి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. దీంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్, రహానే సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే 24 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు గుర్కీరత్ కూడా అవుటయ్యాడు. మనీశ్ పాండే... ధోనితో కలిసి ఆరో వికెట్‌కు 40 పరుగులు, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సమష్టిగా రాణించిన బౌలర్లు ఓ మాదిరి లక్ష్యమే అయినా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ కార్డర్ ఓ ఎండ్‌లో నిలబడ్డా రెండో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఓ దశలో ఈ జట్టు 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మోర్గాన్ పోరాడటంతో ఇన్నింగ్స్ ముందుకు సాగింది. భారత స్పిన్ త్రయం అక్షర్, అశ్విన్, జడేజా కలిసి ఆరు వికెట్లు తీయడం విశేషం. పేసర్లు ఉమేశ్, శరణ్, రిషి ధావన్ కొత్త బంతితో చక్కగా బౌలింగ్ చేశారు. ఇదే మైదానంలో జరిగే తొలి వన్డేకు ముందు భారత బౌలర్ల ప్రదర్శన బాగుంది. అయితే బౌన్స్ బాగా ఎక్కువగా ఉండే వాకా మైదానంలో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) షార్ట్ (బి) మూర్హెడ్ 67; శిఖర్ ధావన్ (సి) మూర్హెడ్ (బి) పోర్టర్ 4; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) పోర్టర్ 7; రహానే (బి) మూర్హెడ్ 41; గుర్కీరత్ (సి) ఇంగ్లిస్ (బి) పోర్టర్ 6; మనీశ్ పాండే (సి) కార్డర్ (బి) మూడీ 58; ధోని (స్టం) ఇంగ్లిస్ (బి) ఓకానర్ 15; జడేజా (సి) కార్డర్ (బి) పోర్టర్ 26; అక్షర్ పటేల్ నాటౌట్ 8; రిషి ధావన్ రనౌట్ 0; అశ్విన్ (సి) ఇంగ్లిస్ (బి) పోర్టర్ 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 249. వికెట్ల పతనం: 1-4; 2-19; 3-107; 4-125; 5-131; 6-171; 7-231; 8-243; 9-244; 10-249. బౌలింగ్: డేవిడ్ మూడీ 6-1-24-1; పోర్టర్ 9.1-0-37-5; టర్నర్ 5-0-33-0; బెవిలాక్వ 9-0-37-0; మూర్హెడ్ 10-0-55-2; ఓకానర్ 6-0-37-1; బోసిస్టో 4-0-25-0. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇన్నింగ్స్: బోసిస్టో (సి) ధోని (బి) ఉమేశ్ 13; కార్డర్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 45; షార్ట్ (బి) అశ్విన్ 10; హాబ్సన్ (సి) ధోని (బి) రిషి 4; ఇంగ్లిస్ (బి) అక్షర్ 17; పోర్టర్ (సి) ధోని (బి) అశ్విన్ 10; జారన్ మోర్గాన్ (సి) రోహిత్ (బి) రిషి 50; మూర్హెడ్ (సి) గుర్కీరత్ (బి) జడేజా 11; మూడీ (సి) అండ్ (బి) అక్షర్ 8; టర్నర్ నాటౌట్ 2; ఓకానర్ (సి) ఉమేశ్ (బి) గుర్కీరత్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 185. వికెట్ల పతనం: 1-39; 2-61; 3-70; 4-96; 5-98; 6-127; 7-154; 8-182; 9-183; 10-185. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 7-0-29-1; బరీందర్ శరణ్ 7-1-22-0; రిషి ధావన్ 7-1-28-2; జడేజా 10-0-38-2; అశ్విన్ 10-1-32-2; అక్షర్ పటేల్ 8-0-29-2; గుర్కీరత్ 0.2-0-1-1. -
కెప్టెన్‌గా మన్దీప్
వార్మప్ టి20కి భారత ‘ఎ’ జట్టు ప్రకటన న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో వార్మప్ టి20 మ్యాచ్‌లో తలపడే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా జట్టు సుదీర్ఘ పర్యటన ప్రారంభమవుతుంది. ఇందులో చాలా మంది ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకోగా...చహల్, నేగి, పాండ్యా మినహా మిగతావారంతా భారత ‘ఎ’ తరఫున గతంలో ఆడినవారే. జట్టు వివరాలు: మన్దీప్ సింగ్ (కెప్టెన్), వోహ్రా, మనీశ్ పాండే, మయాంక్, సూర్యకుమార్, శామ్సన్, హార్దిక్ పాండ్యా, రిషి ధావన్, అనురీత్, చహల్, నేగి, కుల్దీప్ ఇషాంత్‌కు చోటు లేదు... మరో వైపు రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన ఢిల్లీ జట్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మకు స్థానం లభించలేదు. గౌతం గంభీర్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రంజీల్లో ఆడటం గురించి తమ ఫోన్ కాల్‌కు గానీ సంక్షిప్త సందేశానికి గానీ ఇషాంత్ స్పందించలేదని... అందుకే అతడిని ఎంపిక చేయలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ వినయ్ లాంబా చెప్పారు. భారత వన్డే, టి20 టీమ్‌లోకి ఎంపిక కాని ఇషాంత్‌కు టెస్టు సిరీస్‌కు ముందు రంజీల్లో ఆడేందుకు తగినంత సమయం ఉంది. -
భారత్ ‘ఎ’కు కఠిన పరీక్ష
♦ నేడు ఆసీస్ ‘ఎ’తో అమీతుమీ ♦ ముక్కోణపు సిరీస్ చెన్నై : ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో అనధికార టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ‘ఎ’ జట్టుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో కంగారులతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సీనియర్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశంగా భావించొచ్చు. మనీష్ పాండే, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, కరుణ్ నాయర్, కర్ణ్ శర్మలాంటి ఆటగాళ్లు ఇందులో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా మారింది. కెప్టెన్సీతో పాటు జట్టు బ్యాటింగ్ భారం కూడా తనపైనే ఆధారపడి ఉండటంతో ఎలాగైనా రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. చెపాక్ వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. సొంతగడ్డపై ఆడుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశంకాగా.. మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదని చెప్పిన ఉన్ముక్త్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆసీస్ పటిష్టంగా ఉంది. టెస్టు సిరీస్ గెలవడంతో జట్టులో అత్మ విశ్వాసం కూడా బాగా పెరిగిపోయింది. ఉ. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: మనీష్
హరారే : భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఆ క్షణం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండే అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో మూడో వన్డేలో తొలిసారి బరిలోకి దిగిన మనీష్‌కు సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ క్యాప్ అందించాడు. ‘భారత జట్టుకు ఆడాలన్నది నా కల. అది ఇప్పుడు నెరవేరింది. చాలాకాలంపాటు జట్టులో అవకాశం కోసం ఎదురుచూశా. ఇప్పుడు దాన్ని సాధించా. చాలా సంతోషంగా ఉంది. భజ్జీ క్యాప్ ఇచ్చిన తర్వాత ఆనందంతో దాన్ని ముద్దుపెట్టుకున్నా. ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేక క్షణాలు ఉంటాయి. నేను క్యాప్ అందుకున్న క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మనీష్ పేర్కొన్నాడు. టీమిండియాకు ఎంపిక కావడం తన తల్లిదండ్రులు, తనతో పాటు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారందరి కల అని చెప్పాడు. దేశవాళీలో ఆడిన అనుభవం ఉండటం వల్ల తొలి వన్డేలో పెద్దగా ఒత్తిడికి గురికాలేదన్నాడు. మ్యాచ్ కోసం ముందునుంచే సన్నద్ధమయ్యానని తెలిపాడు. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడానికి కష్టపడతానని చెప్పాడు. -
'రెగ్యులర్' చేస్తారా
♦ జింబాబ్వే సిరీస్‌తో ఒరిగిందేమిటి? ♦ అవకాశం అందుకోలేని ఉతప్ప, తివారీ రాయుడు, బిన్నీ సూపర్ జింబాబ్వే సిరీస్‌ను కూడా సీరియస్‌గా చూస్తున్నామని ఎవరు ఎన్ని మాటలు చెప్పినా... సీనియర్ల గైర్హాజరులో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని పరీక్షించడమే పర్యటన ముఖ్య ఉద్దేశం అనేది స్పష్టం. అయితే ‘సీనియర్లు’ మాత్రమే ఈ పర్యటనను బాగా వినియోగించుకున్నారు. కొత్త వాళ్లంత దాదాపుగా నిరాశపరిచారు. జింబాబ్వేలో రాయుడు, బిన్నీల ప్రదర్శన తర్వాతైనా వీళ్లని ‘రెగ్యులర్’ తుది జట్టులో ఉంచుతారా..! జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లలో రెగ్యులర్ జట్టు సభ్యులను మినహాయిస్తే మనీశ్ పాండే ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. మిగతా వారంతా అడపాదడపా జట్టులోకి వస్తూ పోతున్నవారే. హర్భజన్ సింగ్ లాంటి ఆటగాడికి ఈ ప్రదర్శనతో తేడా రాకపోవచ్చు కానీ...మిగతా వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు తగిన అవకాశమిది. జింబాబ్వేలాంటి జట్టుతో ప్రదర్శన నేరుగా ప్రధాన జట్టులోకి తీసుకెళ్తుందని చెప్పలేకపోయినా...బాగా ఆడితే తామూ రేసులో ఉన్నామనే సందేశాన్ని ఇస్తుంది. ఆ ఇద్దరూ అదుర్స్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తెలుగు కుర్రాడు అంబటి రాయుడు ప్రతిభ కు మరింత గుర్తింపు తెచ్చిన సిరీస్ ఇది. తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించిన రాయుడు, రెండో వన్డేలోనూ రాణించాడు. దురదృష్టవశా త్తూ మూడో మ్యాచ్ ఆడకపోయినా, ఇకపై జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా అతనికి ఇది చోటును ఖాయం చేయవచ్చు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో మొత్తం బెంచీకే పరిమితమైన అతను, తనకు దక్కిన అవకాశాలు మాత్రం బాగా ఉపయోగించుకోగలడని తేలింది. 31 వన్డేల తర్వాత 45కు పైగా బ్యాటింగ్ సగటు అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. ఇక పర్యాటకుడిగానే చాలా సిరీస్‌లు పూర్తి చేసుకున్న స్టువర్ట్ బిన్నీ ఎట్టకేలకు తన ఆల్‌రౌండర్ పేరును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 120 పరుగులతో పాటు 6 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబర్చిన బిన్నీ జట్టులో రవీం ద్ర జడేజా స్థానానికి చెక్ పెట్టేందుకు చేరువయ్యాడు. బిన్నీ నిలకడ ఇలాగే కొనసాగితే భారత్‌కు అదనపు పేసర్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుంది. మరో వైపు కోల్పోయిన తన ఫామ్‌ను, తన వేగాన్ని అందుకునేందుకు భువనేశ్వర్‌కు ఈ సిరీస్ ఉపయోగపడింది. ముఖ్యంగా రెండో వన్డేలో తొలి స్పెల్ (6-3-19-2) పాత భువీని గుర్తుకు తెచ్చింది. ఇతర బౌలర్లలో అక్షర్, మోహిత్ ఫర్వాలేదనే ప్రదర్శన ఇవ్వగా, ధావల్ విఫలమయ్యాడు. హర్భజన్ తన అనుభవంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కట్టడి చేయగలిగినా ఈ 4 వికెట్లు అతని వన్డే భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేవు. మళ్లీ మళ్లీ విఫలం భవిష్యత్తు కోసం జింబాబ్వే టూర్‌ను ఉపయోగించుకోవాల్సిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారి దానిని పూర్తిగా వృథా చేసుకున్నారు. రెగ్యులర్ వికెట్ కీపర్ కాకపోయినా, ఐపీఎల్ అనుభవంతో కీపర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఉతప్ప 44 పరుగులే చేసి నిరాశపర్చాడు. ధోని లేని సమయంలో ఉతప్ప బ్యాటింగ్‌లో సత్తా చాటితే మరిన్ని అవకాశాలు దక్కేవి. ఇక సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్‌లోకి వచ్చిన మనోజ్ తివారి కేవలం 34 పరుగులు చేసి చాన్స్‌ను వృథా చేశాడు. ఎన్ని పునరాగమనాలు చేసినా టీమిండియాలో నిలదొక్కుకునే స్థాయి ఆట మాత్రం ఒక్కసారి కనబర్చలేదు. 30 ఏళ్లకు చేరువలో ఉన్న వీరిద్దరు ఇకపై మళ్లీ టీమిండియాలోకి రావడం అంత సులువు కాదు. కేదార్ జాదవ్ శతకం అతనిపై కొంత దృష్టి పడేలా చేయగా... ఫస్ట్‌క్లాస్‌లో అద్భుత రికార్డు ఉన్న మనీశ్ పాండే తన తొలి మ్యాచ్‌లో రాణించి ఆకట్టుకున్నాడు. రహానే రాణించాడా..? మరోవైపు తొలిసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాయకత్వంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. 3-0తో క్లీన్‌స్వీప్ చేసినా వ్యూహ, ప్రతివ్యూహాల అవసరం పెద్దగా కనిపించలేదు. పైగా ఓపెనర్‌గా అతను చేసిన ప్రయత్నం విఫలంగానే చెప్పవచ్చు. 72 స్ట్రైక్‌రేట్‌తో సాగిన అతని బ్యాటింగ్ అటు రోహిత్ (82), ధావన్ (90)లకు పోటీ ఇచ్చే అవకాశం లేదు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసినా...తాను ఎదుర్కొన్న 83 బంతుల్లో 45 డాట్ బాల్స్ ఉండటం ధోని విమర్శకు న్యాయం చేసినట్లయింది! మొత్తంగా చూస్తే ఈ సిరీస్‌తో బ్యాటింగ్ పరంగా పెద్దగా టీమిండియాకు ప్రయోజనం కలిగించే సంచలనం ఏదీ నమోదు కాలేదు. అయితే మనీశ్ పాండే రూపంలో ఒక కొత్త ఆటగాడు వెలుగులోకి రాగా, బౌలింగ్‌లో మాత్రం ఎవరూ నిరూపించుకునే ప్రదర్శన ఇవ్వలేదు. - సాక్షి క్రీడా విభాగం శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు ఎంపిక 23న ముంబై: వచ్చే నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తలపడే భారత క్రికెట్ జట్టును ఈ నెల 23న ప్రకటించనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందు కోసం ఢిల్లీలో సమావేశం కానుం ది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా పూర్తి స్థాయి జట్టు ఈ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు ఆడుతుంది. ఆగస్టు 12న తొలి టెస్టు గాలేలో ఆరంభమవుతుంది. టెస్టుల కోసం ఐదేళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ పర్యటిస్తోంది. -
గోల్డెన్ లెగ్స్!
పవన్ చల్లా... జీవితం సడెన్‌గా బ్రేక్ కొడితే ఒక్కొక్కరూ... ఒక్కోలా ఎగిరిపడినవాళ్లు! అంత జరిగిందా... ఒక్కరి ఆత్మవిశ్వాసమూ చెక్కుచెదర్లేదు! ఒంటికాలితోనే లక్ష్యంవైపు అడుగులు వేస్తున్నారు. పరుగులు తీస్తున్నారు. ఎగిరి దూకుతున్నారు. వైకల్యాన్ని ‘గోల్డెన్ లెగ్’ గా బిగించుకుని అన్నీ బాగున్న వారికి సైతం స్ఫూర్తిగా,ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వస్తూ, అనంతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యార రవి శ్రీవాత్సవ. ఆయనది హైదరాబాద్‌లోని నాగోల్. మధ్యవయసులో, సంసారమనే నావను నడిపే సారధిగా ఉన్నప్పుడు ఎదురైన అంగవైకల్యం ఆయనను కొంతకాలం నిశ్చేష్టుడ్ని చేసింది. రవి తండ్రి హార్టీ కల్చరిస్ట్. ఆయన హృద్రోగం కారణంగా రవి, అతని సోదరుడు ఇద్దరూ పన్నెండేళ్ల వయసు నుంచే దినసరి వేతనానికి వెళ్లేవారు. తమ రెక్కల కష్టంతో ఇంటిని నడుపుతూనే, చదువుకునేవారు. తండ్రిని కోల్పోయేనాటికే చెల్లి, సోదరుడు తనూ కాస్త స్థిరపడుతుండగా ప్రమాదం కారణంగా మోకాలి కింద వరకూ కాలు పోగొట్టుకున్నారు రవి. దాదాపు ఐదు సర్జరీలు, రక రకాల థెరపీలు జరిగాక తేరుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాలు. భార్య అండతో, వైద్యుల సహకారంతో వైకల్యం లేనివారికన్నా బాగా నడ వడం మాత్రమే కాదు, పరుగు పోటీల్లో సైతం పాల్గొనే స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్టెల్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. విప్రో 5కెలో కూడా పాల్గొన్నారు. వచ్చే డిసెంబరు 1న చెన్నైలో, 15న ఢిల్లీలో, 25న చత్తీస్‌ఘడ్‌లో జరిగే మారథాన్లలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. రోజూ పొద్దున్న మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్న రవి తనకు మరిన్ని మారథాన్లలో పాల్గొనాలని ఉందని చెప్తున్నారు. విజయవాడలో ఉంటున్న శ్రీనివాసనాయుడిది ఇంకో స్ఫూర్తిగాథ. మొదట అందరూ ఆయన ఉద్యోగం చేయలేడన్నారు. చేశారు. ‘అయ్యో పాపం, పెళ్లి ఎలా అవుతుంది’ అన్నారు. అయ్యింది. అంతమాత్రాన తన ను తాను నిరూపించుకోవడానికి మరేమీ లేదని శ్రీనివాసనాయుడు అనుకోవడం లేదు. ప్రస్తుతం ఎం.కాం. చదువుతున్న 41 ఏళ్ల శ్రీనివాసనాయుడికి పదవ తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌బాల్ తగిలి కాలు వాచింది. అది అలా అలా ముదిరి ఆఖరికి మోకాలిపై వరకు కాలిని తొలగించే వరకూ వచ్చింది. అయితే ఆయన తన దురదృష్టాన్ని నిందించుకుంటూ చక్రాల కుర్చీకి పరిమితం కాలేదు. అలాగే చదువుకుని సెంట్రల్గవర్న్మెంట్ జాబ్ సాధించారు. పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. అన్నీ బావున్నవాళ్లు కూడా హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని బండి లాగించేయాలని భావించే మధ్య వయసులో... తనకెంతో నచ్చిన స్విమ్మింగ్‌ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. విఎంసి స్విమ్మింగ్‌పూల్‌లో జేరి ఈత నేర్చుకున్నారు. అదే సంవత్సరం మిగిలిన సాధారణ వ్యక్తులతో కలిసి మాస్టర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. కన్సొలేషన్ ప్రైజ్ గెలుపొందారు. రిపబ్లిక్‌డే సందర్బంగా కృష్ణానదిలో జరిగిన కృష్ణా రివర్ క్రాస్ ఈవెంట్లో అంగవైకల్యం లేని సాధారణ వ్యక్తులతో కలిసి పాల్గొన్నారు. నగదు బహుమతి గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైథ్లాన్లో పాల్గొని 30 నిమిషాల్లో 750 మీటర్ల ఈతను పూర్తి చేసి వహ్వా అనిపించారు. తన వయసు దాటిపోయింది కానీ లేకపోతే వికలాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనాలని అందనీ శ్రీనివాసనాయుడు అంటున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్నుంచి కెరీర్‌ను వెదుక్కుంటూ హైదరాబాద్‌కి వచ్చిన కిరణ్ కనోజియా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా చేరి ఒక్కోమెట్టు ఎక్కుతున్న తరుణంలో... నడిచే రైలు నుంచి జారిపడి కాలు విరగ్గొట్టుకున్నారు. ఆ సంఘటన గురించి వివరిస్తూ... తానెంతో ముచ్చటపడి నెల ముందే బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి కొన్న బంగారు నగను బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుని రైల్లో కిటికీ దగ్గర కూర్చున్నానని, ఆ బ్యాగ్‌ను ఇద్దరు వ్యక్తులు లాక్కోని పరిగెత్తుతుంటే వారిని పట్టుకునే ప్రయత్నంలో కాలు జారి అప్పుడే కదిలిన రైలు కింద పడిపోయానని గుర్తు చేసుకున్నారామె. ఆ సంఘటనలో ఆమె కేవలం బంగారునగను మాత్రమే కాదు అంతుకు మించిన విలువైన అవయవాన్ని కూడా కోల్పోయారు. ‘‘అమ్మానాన్న ఇంటికి తీసుకెళ్లారు. కొన్నినెలలు అక్కడున్నాను. సుధాచంద్రన్ లాంటివాళ్లను జ్ఞాపకం చేసుకున్నాను. పిచ్చి పట్టుదల వచ్చింది. ఇంట్లోవాళ్లు వారిస్తున్నా వినకుండా మళ్లీ హైదరాబాద్ వచ్చాను. మళ్లీ అంతకు ముందు పనిచేసిన కంపెనీకి వెళ్లాను. ఉద్యోగం చేస్తానని చెప్పి ఒప్పించాను. కంపెనీ వాళ్లు కూడా మాన వత్వంతో స్పందించి అంతకుముందు చేసిన ఉద్యోగాన్నే అదే జీతంతో తిరిగి ఇచ్చారు’’ అని చెప్పారు కిరణ్. అలా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడామె మారథాన్ రన్నర్‌గా మారారు. అద్భుతమైన భవిష్యత్తువైపు నడవడమే కాదు, ఏకంగా పరుగులు తీస్తున్నారు. ‘‘బస్ దిగి, రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దేసిందండీ’’ అంటూ కాలికి బ్లేడ్ బిగించుకుంటున్న పవన్‌ని చూసినప్పుడు అంగవైకల్యం ఉందన్న భావనే ఆయనలో కనిపించలేదు. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటారు పవన్. ‘‘లోపం అని భావిస్తేనే కదా సమస్య?’’అని ప్రశ్నించే రవి ఆ భావనను అధిగమించడం మాత్రమే కాదు, అంతకు మించిన విజయాలను సాధించే దిశగా దూసుకుపోతున్నారు. కొడుకు పరిస్థితికి తగ్గట్టుగా, కూచుని పని చేసుకునేందుకు వీలు అవుతుందని సినిమా ఎడిటర్‌గా అవ్వమని తండ్రి ఇచ్చిన సూచనను పాటించిన పవన్ అంతటితో ఆగిపోలేదు. తనను తను నిరూపించుకునేందుకు కఠినమైన క్రీడలవైపు ప్రయాణిస్తున్నాడు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బ్లేడ్న్న్రర్‌గా ఎవరూ లేరు. అందుకే ఆ క్రీడను నేను ఎంచుకున్నాను’’ అని చెప్పారు పవన్. రెండేళ్లక్రితం భారతదేశం ప్రపంచకప్ సాధించింది. ఆ మ్యాచ్ చూడాలనే ఆదుర్దాతో బయలుదేరిన మనీష్‌పాండే ఒక కాలు పోగొట్టుకున్నాడు. ‘‘ఎప్పుడూ బస్‌లో వెళ్లేవాడ్ని. మ్యాచ్ టైమ్‌కి ఇంటికి చేరుకోవాలని రెలైక్కా. బాగా రద్దీగా ఉంది. తోపులాటలో కిందపడిపోయా’’నని గుర్తుచేసుకున్నాడీ చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌పూర్ కుర్రాడు. పైలట్ కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మనీష్ ఆ సంఘటన తర్వాత కొంతకాలం తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. ఆ తర్వాత తేరుకుని లక్ష్యాన్ని మార్చుకున్నాడు. అందుకు అనుగుణంగా క్రీడలవైపు లాంగ్‌జంప్ చేశాడు. జాతీయస్థాయి లాంగ్జంపింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అంతేకాదు బ్లేడ్న్న్రర్గానూ రాణిస్తున్నాడు. పారాఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. జీవితమనే రహదారిలోని మలుపుల్ని ఏ గూగుల్‌మ్యాప్ కూడా పసిగట్టలేదు. అందుకేనేమో అవి అంత తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తమ కాళ్ల మీద తాము నిలబడాలని తపించేవారిని ఆత్మవిశ్వాసం ఉన్నవారంటాం. ఒక కాలు కోల్పోయినా... ఆ ప్రభావాన్ని దరిచేరనీయని ధైర్యం చూపేవారిని ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉన్నవారనాలేమో. - ఎస్.సత్యబాబు ‘‘అంగవికలుర క్రీడల కోసం ప్రత్యేక అకాడమీ రావాల్సిన అవసరం ఉంది’’ అంటు న్నారు ఆదిత్యమెహతా. వైకల్యంపై పైచేయి సాధించిన వారందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న ఆదిత్య కూడా అంగవికలురే. గత మే నెల 28 న లండన్‌లో తన ఒంటికాలితోనే దాదాపు 500 కి.మీ ప్రతిష్టాత్మక చాలెంజ్‌ను మూడున్నర రోజుల్లో పూర్తి చేసి అందులో పాల్గొన్న తొలి అంగవికలుడైన సైక్లిస్ట్‌గా ఘనత సాధించారు ఆదిత్యామెహతా. కాలేజీ సరదాలు, కుర్రవయసు హుషారులతో జీవితం పరుగులు తీస్తున్నప్పుడు... బైక్ మీద వెళుతుంటే హైదరాబాద్, బాలానగర్ సమీపంలో ఆదిత్యను ఆరీ్టిసీబస్సు వెనుకనుంచి గుద్దేసింది. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండి... అతి కష్టమ్మీద కళ్లు తెరిచి కాళ్లు కదిలించబోతే... అర్థమైంది. తనకు ఓ కాలు లేదని, వికలాంగుడిగా మిగిలానని. పిచ్చిగా అరిచాడు. చచ్చిపోవాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచనల్లేని అంధకారంలోకి జారిపోయాడు. కొన్ని రోజుల పాటు అయిన వాళ్లంతా ఇచ్చిన మద్దతుతో మెల్లగా మామూలు మనిషయ్యాడు. కృత్రిమకాలు అమర్చుకుని నడవడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రోత్సాహంతో కిలోమీటరు మొదలుకుని 11కి.మీ దాకా నడిచే స్థాయికి చేరాడు. అదే ఊపులో సైకిలెక్కాడు. హైదరాబాద్‌లో జరిగిన కొన్ని చిన్నచిన్న సైకిల్రేస్లలో పాల్గొన్నాడు. తిరిగే చక్రం... రికార్డులే గమ్యం... వేగంగా 100 కి.మీ (5.5 గంటల్లో) పూర్తి చేసిన అంగవైకల్యం కలిగిన సైక్లిస్ట్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు ఆదిత్య. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు అంటే 540 కి.మీ దూరాన్ని కేవలం 3 రోజుల్లో సైకిల్ మీద చేరుకున్నాడు. ఏషియన్ పారా సైకిల్ ఛాంపియన్ షిప్లో 2 రజత పతకాలు గెలుచుకున్నాడు. తాజాగా లండన్-ప్యారిస్ సైక్లింగ్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం మీద గత ఏడాదిన్నరగా తాను సైక్లింగ్ చేసిన దూరాన్ని లెక్కిస్తే దాదాపు 17 వేలకి.మీ వస్తుందని చెప్పాడు ఆదిత్య. ఏ మనిషికైనా ఆలోచనల్లో లోపం లేకపోతే అవయవ లోపం అనేది లోపమే కాదంటాడు.