నాలుగో స్థానమే నా ఖిల్లా: పాండే | Batting at No. 4 is my forte, says Manish Pandey | Sakshi
Sakshi News home page

నాలుగో స్థానమే నా ఖిల్లా: పాండే

Published Sun, Jan 24 2016 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

నాలుగో స్థానమే నా ఖిల్లా: పాండే

నాలుగో స్థానమే నా ఖిల్లా: పాండే

సిడ్నీ: తాను ఎప్పుడూ పిచ్ ను బట్టి బ్యాటింగ్ శైలిని త్వరగా మార్చుకుంటూ ఉంటానని టీమిండియా ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో అజేయ శతకంతో దుమ్మురేపి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పాండే నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు.

 

'నాకు నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా బ్యాటింగ్ శైలికి ఆ స్థానమే కచ్చితంగా సరిపోతుంది. గత రెండు మ్యాచ్ ల్లో ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసే అవకాశం దొరకలేదు. నేను క్రీజ్ లోకి వచ్చాక మూడు-నాలుగు బంతుల్ని చూసుకుని ఒక అంచనాకు వస్తా.  దాన్ని బట్టే నా శైలిని మార్చుకుంటా.  ప్రతీ బంతిని బౌండరీకి పంపాలంటే సాధ్యం కాదు. ఒకటి-రెండు పరుగులు తీస్తూ స్ట్రైక్ రోటేట్ చేస్తేనే స్కోరు బోర్దు కదులుతుంది' అని మనీష్ తెలిపాడు. కాగా, పాండే ఐదో స్థానానికి సరిపోతాడని ఆఖరి వన్డే ముగిసిన అనంతరం ధోని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement