వారెవ్వా ఏం క్యాచ్‌..  | Manish Pandey takes sensational catch | Sakshi
Sakshi News home page

వారెవ్వా ఏం క్యాచ్‌.. 

Published Sun, Sep 24 2017 5:06 PM | Last Updated on Sun, Sep 24 2017 9:56 PM

Manish Pandey takes sensational catch

ఇండోర్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా ప్లేయర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. బుమ్రా వేసిన 47 ఓవర్‌ ఐదో బంతిని ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌ స్కోంబ్‌ లాంగ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ ఆ బంతిని గాల్లోకి ఎగిరి అందుకొని సమన్వయం కోల్పోతూ.. గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ దాటాడు.

అనంతరం మళ్లీ తిరిగొచ్చి అందుకున్నాడు. ఈ సెన్సెషనల్‌ క్యాచ్‌తో మైదానంలో భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. మనీష్‌ ఈ క్యాచ్‌తో 6 పరుగులు అడ్డుకోవడమే కాక హ్యాండ్స్‌ స్కోంబ్‌(7)ను పెవిలియన్‌కు చేర్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement