కెప్టెన్లుగా నాయర్, మనీష్ | Karun Nair, Pandey to lead India A teams in South Africa | Sakshi
Sakshi News home page

కెప్టెన్లుగా నాయర్, మనీష్

Published Thu, Jun 29 2017 1:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

Karun Nair, Pandey to lead India A teams in South Africa



న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ 'ఎ' జట్లకు కెప్టెన్లుగా సీనియర్ జట్టు ఆటగాళ్లైన కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా 'ఎ' రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్ గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ 'ఎ' జట్టుతో పాటు ఆస్ట్రేలియా 'ఎ' జట్టుకు పాల్గొననుంది. జూలై 26వ తేదీన ఆస్ట్రేలియా 'ఎ' జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్ తో ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు దేశాల ట్రయంగులర్ వన్డే సిరీస్ఆగస్టు 8వ తేదీ వరకూ జరుగుతుండగా, ఆపై దక్షిణాఫ్రికాతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులను భారత్ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకూ  బెనోనిలో తొలి నాలుగు రోజుల మ్యాచ్ జరుగనుండగా, ఆగస్టు 19 నుంచి 22 వరకూ సెన్స్వే పార్క్లో రెండో మ్యాచ్ జరుగనుంది.

వన్డే జట్టు..

మనీష్ పాండే(కెప్టెన్), మన్ దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్యా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బాసిల్ తంపి, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్

అనధికార టెస్టు మ్యాచ్లు జట్టు..

కరుణ్ నాయర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్  కీపర్), ప్రియంక్ పాంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, హనుమ విహారి, జయంత్ యాదవ్, నదీమ్, నవదీప్ సైనీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరి, అనికిత్ చౌదరి, అంకిత్ రాజ్ పుత్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement