సన్‌రైజర్స్ ఆటగాడు మనీష్ పాండే
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమ తమ ఫేవరెట్ టీమ్‌ల గురించి, ఆటగాళ్ల గురించి కొందరు అనుకూలంగా పోస్టులు పెడితే, ట్రోలింగ్ మాత్రం అంతకు మించే జరుగుతూ వస్తోంది. సన్‌రైజర్స్ ప్లేయర్ మనీష్ పాండేను టార్గెట్ చేస్తూ వేస్తున్న జోకులకు కోదవు లేకుండా పోతోంది. రూ.11 కోట్లతో ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తే.. కనీసం పరుగులు చెయ్యకపోతుండటం, దానికి తోడు మైదానంలో క్యాచ్‌లు వదిలేస్తూ ఫీల్డింగ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు.(అఫ్ కోర్స్ ఒక మ్యాచ్‌లో 57 పరుగులు.. ఒకటి రెండు అద్భుతమైన క్యాచ్‌లను వాళ్లు పరిగణనలోకి తీసుకోలేదు). దీంతో ఫేస్‌బుక్‌లోని కొన్ని ట్రోలింగ్ పేజీలు అతన్ని దారుణంగా ఏకీపడేశాయి. సినిమాల్లోని ఫన్నీ డైలాగులన్నింటిని మనీష్‌కు ఆపాదించి మెమెలు సృష్టించాయి. అది తట్టుకోలేక పాండే సైతం ఘాటుగానే బదులిచ్చాడు. చివరాఖరికి రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతన్ని జట్టులోకి తీసుకోకపోవటం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న వారు లేకపోలేదు.
అయితే నేటి ఫైనల్ నేపథ్యంలో మళ్లీ పాండేపై ట్రోల్ మొదలైపోయింది. ‘ప్లీజ్.. మనీష్ అన్నా ఇవాళ మ్యాచ్‌కు దూరంగా ఉండూ’... ‘విలియమ్‌సన్ సర్ పాండే అన్నకు ఇవాళ కూడా రెస్ట్ చాలా అవసరం’... ‘మనీష్ అన్న ఇన్ కప్ అవుట్’.. ఇలాంటి కామెడీ డైలాగులు పేలుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరో అంశంలో కూడా అతను బుక్కయ్యాడు. అఫీషియల్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ ఉన్న ఫోటోలనే ఇంకా కవర్ ఫోటోగా ఉంచటంతో ఏకీపడేస్తున్నారు. ఇది కాస్త ఆలస్యంగా గమనించిన కొందరు.. ఇంకా ఆ టీమ్‌లోనే ఉన్నాడనుకుంటున్నాడా? అంటూ కొందరు, మ్యాచ్‌ల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అంతే బద్ధకమా? అని మరికొందరు, అది నెక్స్ట్ సాల్(వచ్చే ఏడాది) జెర్సీ.. అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతనికి మద్ధతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment