కరణ్ శర్మ, శ్రీవత్స్ గోస్వామి
హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ అనంతరం ఇద్దరి ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లతో విజయాన్నందుకొని టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే చెన్నై టైటిల్ నెగ్గడానికి ఆ జట్టు లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మనే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ గత మూడు సీజన్లుగా కరణ్ శర్మ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది.
2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిగా ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. 2017లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగగా ఈ జట్టు సైతం ట్రోఫిని సొంతం చేసుకుంది. ఇప్పుడు చెన్నైతో ఈ సెంటిమెంట్ మూడోసారి కలిసొచ్చింది. టోర్నీ ఆరంభంలోనే ఈ విషయాన్ని వెల్లడించిన అభిమానులు అది నిజమవ్వడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక ఈ సీజన్‌లో కరణ్ శర్మ 6 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 5 మ్యాచ్‌లు నెగ్గి ఒకటి మాత్రమే ఓడింది. ఇక ఫైనల్లో అనూహ్యంగా బజ్జీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ధోని వ్యూహంలో భాగంగా వైడ్ బంతి వేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్(47)ను బోల్తా కొట్టించాడు. దీంతో భారీ భాగస్వామ్యాన్ని అడ్డుకున్నట్లైంది
సన్‌రైజర్స్ అన్‌లక్కీ గాయ్..
ఇక చెన్నైకి కరణ్ శర్మ లక్కీ ప్లేయర్ అయితే.. సన్‌రైజర్స్‌కు యువ కీపర్ శ్రీవత్స్ గోస్వామి అన్ లక్కీ గాయ్‌గా మిగిలిపోయాడని సన్ అభిమానులు అభిప్రాపడుతున్నారు. ఈ సీజన్‌లో గోస్వామి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచే గెలిచింది. అది కూడా తానడిన తొలి మ్యాచ్ మినహా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహ తుది జట్టులోకి రాగా ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ గెలుపొందింది. అభిమానులు ఈ లెక్కలే చెబుతూ సన్‌రైజర్స్ అన్ లక్కీ గాయ్ గోస్వామి అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Delhi, Punjab and Bangalore should target Karn Sharma in upcoming IPL auction to win their 1st IPL title.
— Tejas Satam (@tejassatam95) May 28, 2018
Comments
Please login to add a commentAdd a comment