Karn Sharma
-
లేటు వయసులో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా నలుగురు 'శర్మ'లు
ఐపీఎల్-2023లో భారత వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి పెర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్‌కు ముగ్దులవుతున్నారు. అవకాశాలు లేవన్న కసితో బౌలింగ్ చేస్తున్న ఈ వెటరన్లు తమ కెరీర్లు పీక్స్‌లో ఉండగా చేయని అద్భుతాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా నలుగరు 'శర్మ'లు తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బౌలర్లతో పాటు భారత వెటరన్ బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు. వీరు కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు లేవన్న కసితోనే తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రదర్శన కారణంగానే రహానే ఏకంగా జాతీయ జట్టును నుంచి పిలుపునందుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. వీరు ఈ సీజన్లో మన్ముందు మరెన్ని అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. ఐపీఎల్-2023లో రఫ్ఫాడిస్తున్న భారత వెటరన్ బౌలర్లు.. ఇషాంత్ శర్మ (ఢిల్లీ, 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 34 yrs కర్ణ్ శర్మ (ఆర్సీబీ, 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) 35 yrs మోహిత్ శర్మ (గుజరాత్, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 34 yrs సందీప్ శర్మ (రాజస్థాన్, 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 30 yrs అమిత్ మిశ్రా (లక్నో, 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 40 yrs పియూశ్ చావ్లా (ముంబై, 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 34 yrs అశ్విన్ (రాజస్థాన్, 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 36 yrs ఐపీఎల్-2023లో రెచ్చిపోతున్న భారత వెటరన్ బ్యాటర్లు.. శిఖర్ ధవన్ (పంజాబ్, 6 మ్యాచ్‌ల్లో 148.86 స్ట్రయిక్ రేట్‌తో 65.50 సగటున 262 పరుగులు) 37 yrs అజింక్య రహానే (చెన్నై, 7 మ్యాచ్‌ల్లో 189.83 స్ట్రయిక్ రేట్‌తో 44.80 సగటున 224 పరుగులు) 34 yrs -
ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. ఎందుకంటే..?
Karn Sharma Only Player To Win 3 Consecutive IPL Titles: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ ఎవరంటే..? నిస్సంకోచంగా కర్ణ శర్మ పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే, ఆర్సీబీ మినహా అతను అడుగు పెట్టిన ప్రతి ఐపీఎల్ జట్టు టైటిల్ నెగ్గింది. వివరాల్లోకి వెళితే.. 2016 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ, ఆ తర్వాతి ఏడాది ముంబై ఇండియన్స్‌కి మారి, అక్కడ కూడా టైటిల్ గెలిచాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కర్ణ్ శర్మ ముచ్ఛటగా మూడో ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచి, వరుసగా మూడు సీజన్లలో మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మధ్యలో 2019, 2020 సీజన్లలో ఈ లక్కీ లెగ్‌కు బ్రేక్ పడినా.. తిరిగి 2021 సీజన్లో అతని విన్నింగ్ రన్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరిగిన గతేడాది ఐపీఎల్లో సీఎస్కే టైటిల్ గెలువగా, కర్ణ్ శర్మ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 34 ఏళ్ల కర్ణ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2009 సీజన్లో ఆర్సీబీకి ఎంపికైన అతను.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013-16), ముంబై ఇండియన్స్ (2017), చెన్నై సూపర్ కింగ్స్ (2018-2021) వంటి పలు జట్లకు ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో 68 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు, 15.1 బ్యాటింగ్ సగటుతో 316 పరుగులు చేశాడు. కర్ణ్ శర్మ టీమిండియా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు, ఓ టీ20లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..! -
T20 World Cup: అయ్యో అయ్యర్.. వాళ్లందరినీ వెనక్కి పిలిపించారు!
Team India send back four net bowlers: టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి నెట్ బౌలర్లుగా ఎంపికైన నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ వెనక్కి పిలిపించినట్లు సమాచారం. కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్, క్రిష్ణప్ప గౌతం ఇప్పటికే యూఏఈని వీడి భారత్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీరంతా.. నవంబరు 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రమంలో కావాల్సినంత ప్రాక్టీసు ఉండాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ వీరిని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు... ‘‘అవును.. ఒక్కసారి అసలు టోర్నీ(టీ20) ప్రారంభమైన తర్వాత పెద్దగా నెట్ సెషన్లు ఉండవు. కాబట్టి ఈ ఆటగాళ్లందరూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతించేందుకు వీలుగా జాతీయ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సినంత ప్రాక్టీసు లభిస్తుంది’’ అని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించినట్లు క్రికెట్.కామ్ పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్, ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సహా కరణ్, షాబాజ్, వెంకటేశ్ అయ్యర్, గౌతంను నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అత్యవసర సమయంలో వీరు జట్టుతో చేరేందుకు వీలుగా ఈ మేరకు సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ సూపర్-12 రౌండ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్‌తో కోహ్లి సేన వరల్డ్‌కప్ టోర్నీ ప్రయాణం ఆరంభించనుంది. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది? T20 World Cup 2021: నమీబియా సంచలనం.. శ్రీలంక హ్యాట్రిక్.. సూపర్-12కు చేరిన జట్లు ఇవే -
టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్..
ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేతనైనంత సాయం చేస్తూ, గొప్ప మానవతా వాదిగా అందరిచే కీర్తింపబడుతున్న సోనూ సూద్.. టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సోనూ సూద్.. తన పేరుపై స్వచ్చంద సంస్థను నెలకొల్పి సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. కాగా, తాను నెలకొల్పిన ఫౌండేషన్‌కు టీమిండియా ఆటగాడు కర్ణ్ శర్మ నిర్విరామంగా సేవలందిస్తున్న విషయాన్ని సోనూ సూద్ గుర్తించాడు. దీంతో మంగళవారం ట్విటర్ వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. Thank you so much brother @sharmakarn03 for your constant support to @SoodFoundation! You have inspired the youth of the nation once again and people like you truly make this world a beautiful and peaceful place. 🤗 — sonu sood (@SonuSood) May 18, 2021 సోనూ సూద్ ఫౌండేషన్‌కు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దేశంలోనే ఎంతో మంది యువకులకు నీవు స్పూర్తిగా నిలిచావు బ్రదర్, నీలాంటి గొప్ప వ్యక్తులే ఈ ప్రపంచాన్ని అందంగా, ప్రశాంతంగా మార్చగలరు అంటూ కొనియాడారు. ఇదిలా ఉంటే సోనూ సూద్ చేసిన ట్వీట్‌పై కర్ణ్ శర్మ కూడా స్పందించాడు. ఈ దేశానికి రియల్ హీరో మీరే భాయ్, ఆపదలో ఉన్న ప్రజలకు మీరందిస్తున్న సేవలకు హ్యాట్సాఫ్, మీ సేవలను ఇలానే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానంటూ రీట్వీట్ చేశాడు. సోనూ ఫౌండేషన్‌కు కర్ణ్ శర్మ చేసిన సాయం ఏంటనే విషయాన్ని ఇద్దరూ వెల్లడించకపోవడం విశేషం. కాగా, కర్ణ్ శర్మ భారత్ తరఫున ఓ టెస్టు, రెండు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. 2020 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కర్ణ్ శర్మ.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆ జట్టు వదులుకుంది. దీంతో 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగులు చేయలేదు. ఐపీఎల్లో మొత్తం 68 మ్యాచ్‌లు ఆడిన శర్మ 59 వికెట్లు తీశాడు. కర్ణ్ శర్మకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లక్కీ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017 ముంబై ఇండియన్స్, 2018 సీఎస్కే జట్లు టైటిల్లు సాధించినప్పుడు అతను ఆయా జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. దీంతో అతను లక్కీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: ఆ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్ -
ఇతను లక్కీ అయితే.. అతను అన్ లక్కీ
హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ అనంతరం ఇద్దరి ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లతో విజయాన్నందుకొని టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే చెన్నై టైటిల్ నెగ్గడానికి ఆ జట్టు లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మనే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ గత మూడు సీజన్లుగా కరణ్ శర్మ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. 2016 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిగా ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. 2017లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగగా ఈ జట్టు సైతం ట్రోఫిని సొంతం చేసుకుంది. ఇప్పుడు చెన్నైతో ఈ సెంటిమెంట్ మూడోసారి కలిసొచ్చింది. టోర్నీ ఆరంభంలోనే ఈ విషయాన్ని వెల్లడించిన అభిమానులు అది నిజమవ్వడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక ఈ సీజన్లో కరణ్ శర్మ 6 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 5 మ్యాచ్‌లు నెగ్గి ఒకటి మాత్రమే ఓడింది. ఇక ఫైనల్లో అనూహ్యంగా బజ్జీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ధోని వ్యూహంలో భాగంగా వైడ్ బంతి వేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్(47)ను బోల్తా కొట్టించాడు. దీంతో భారీ భాగస్వామ్యాన్ని అడ్డుకున్నట్లైంది సన్‌రైజర్స్ అన్‌లక్కీ గాయ్.. ఇక చెన్నైకి కరణ్ శర్మ లక్కీ ప్లేయర్ అయితే.. సన్‌రైజర్స్‌కు యువ కీపర్ శ్రీవత్స్ గోస్వామి అన్ లక్కీ గాయ్‌గా మిగిలిపోయాడని సన్ అభిమానులు అభిప్రాపడుతున్నారు. ఈ సీజన్లో గోస్వామి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచే గెలిచింది. అది కూడా తానడిన తొలి మ్యాచ్ మినహా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహ తుది జట్టులోకి రాగా ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ గెలుపొందింది. అభిమానులు ఈ లెక్కలే చెబుతూ సన్‌రైజర్స్ అన్ లక్కీ గాయ్ గోస్వామి అంటూ ట్రోల్ చేస్తున్నారు. Delhi, Punjab and Bangalore should target Karn Sharma in upcoming IPL auction to win their 1st IPL title. — Tejas Satam (@tejassatam95) May 28, 2018 -
‘సెంచరీ’ క్లబ్లో కరణ్ శర్మ
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ సెంచరీ వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. ఐపీఎల్లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో షకిబుల్ హసన్‌ను వికెట్‌ను తీయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో వందో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున కేవలం ఒక టీ 20 మ్యాచ్ మాత్రమే ఆడిన కరణ్ శర్మ..మొత్తం 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఓవరాల్‌గా కరణ్ శర్మ ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహించిన మ్యాచ్‌లు 58. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన కరణ్ శర్మ.. తాజా ఐపీఎల్లో చెన్నైకు ఆడుతున్నాడు. తాజా మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబబ్బతగిలింది. 10 పరుగులకే రికీభుయ్, మనీష్ పాండే వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. కాగా, కెప్టెన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించడంతో హైదరాబాద్ తేరుకుంది. -
ఐపీఎల్: సిక్స్ కాదు.. సింగిలే.!
హైదరాబాద్ : ఐపీఎల్ అసలు సిసలు మజా మొదలైంది. నిన్న అసాధ్యమైన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ సుసాధ్యం చేసి ఔరా అనిపించగా.. నేడు చెన్నై ఆటగాడు కరణ్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా సిక్స్‌ను సింగిల్‌గా మార్చాడు. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో శార్ధుల్ఠాకుర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్ అని భావించిన తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నకరణ్ శర్మ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని సిక్స్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. పక్కా సిక్స్ అనుకున్న విలియమ్సన్ కేవలం సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో సిక్స్ కాస్త..సింగిల్‌గా మారింది. ఈ ఫీట్‌కు మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు.. సిక్సును ఇలా కూడా ఆపవచ్చా.! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కరణ్ శర్మ సూపర్ మ్యాన్‌లా ఫీల్డింగ్
-
'ఐపీఎల్ టైటిల్ మాదే'
హైదరాబాద్: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఆదివారం జరిగే తుది పోరులో కచ్చితంగా విజయం సాధించి టైటిల్ ను సాధిస్తామని అంటున్నాడు ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ. క్వాలిఫయర్-2 మ్యాచ్ లో నాలుగు వికెట్ల సాధించి కోల్ కతా పతనాన్ని శాసించిన కరణ్ శర్మ.. రైజింగ్ పుణెపై కూడా తమదే పైచేయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'మేము ఫైనల్ మ్యాచ్ ను గెలవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. కచ్చితంగా టైటిల్ ను గెలిచి తీరుతాం. పుణెపై ఓటముల రికార్డు అనేది గతం. రేపు జరగబోయే మ్యాచ్ లో విజేతలుగా నిలుస్తాం'అని కరణ్ శర్మ స్పష్టం చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో తుది జట్టులో స్థానంపై హర్భజన్ సింగ్ తో పోటీ ఉందా అనే విషయంలో కరణ్ శర్మ సమాధానం దాటేశాడు. అది తన చేతుల్లో ఉండదని, జట్టు సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుందన్నాడు. కేవలం అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే తనకు ముఖ్యమన్నాడు. 'బౌలింగ్ చేయడమే నాకు తెలిసింది. మ్యాచ్ గెలవడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తా. నేను జట్టులో లేకపోయినప్పటికీ ఎక్కువ శ్రమిస్తునే ఉంటా'అని కరణ్ శర్మ తెలిపాడు. -
'కరణ్ ను ఆడించడం అద్భుత నిర్ణయం'
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్ కరణ్ శర్మను ఆడించడం అద్భుత నిర్ణయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి మంచి నిర్ణయం తీసుకున్నాడని కొనియాడారు. వార్నర్, క్లార్క్ ను ఎలా కట్టడి చేయాలో కరణ్ కు తెలుసునన అన్నారు. ఆడిలైడ్ పిచ్ ను పరిశీలిస్తే అతడిని జట్టులోకి తీసుకోవడం ఏమాత్రం పొరపాటు కాదన్నారు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ తొలిరోజు సెంచరీ హీరో వార్నర్(145)ను అవుట్ చేశాడు. 23 ఓవర్లు వేసి 89 పరుగులిచ్చాడు. ఒక మేడిన్ ఓవర్ వేశాడు. ఆడిలైడ్ టెస్టు కరణ్ శర్మకు తొలి టెస్టు కావడం విశేషం. ఇషాంత్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశాడని గవాస్కర్ ప్రశంసించారు. -
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న చివరి రెండు వన్డేలకు, ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టుకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కానున్నాడు. ముంజేతి గాయం కారణంగా అతడు తర్వాతి మ్యాచ్ లకు ఆడడం అనుమానంగా మారింది. ధోని పూర్తిగా కోలుకోలేదని ఫిజియో కోచ్ నిర్ధారించడంతో అతడు ఆడకపోవచ్చని తెలుస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేల సిరీస్ లో మొదటి మూడు వన్డేలకు ధోని విశ్రాంతి కోరడంతో అతడి స్థానంలో విరాట్ కోహ్లి జట్టుకు నాయకత్వం వహించాడు. లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ, కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముందని సమాచారం. డిసెంబర్ 4 నుంచి భారత్, ఆస్టేలియా టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది