సూపర్ మ్యాన్‌లా కరణ్ శర్మ ఫీల్డింగ్
హైదరాబాద్ : ఐపీఎల్ అసలు సిసలు మజా మొదలైంది. నిన్న అసాధ్యమైన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ సుసాధ్యం చేసి ఔరా అనిపించగా.. నేడు చెన్నై ఆటగాడు కరణ్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా సిక్స్‌ను సింగిల్‌గా మార్చాడు. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో శార్ధుల్‌ఠాకుర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్ అని భావించిన తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నకరణ్ శర్మ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని సిక్స్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. పక్కా సిక్స్ అనుకున్న విలియమ్సన్ కేవలం సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో సిక్స్ కాస్త..సింగిల్‌గా మారింది. ఈ ఫీట్‌కు మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు.. సిక్సును ఇలా కూడా ఆపవచ్చా.! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment