రైనా, రాయుడు
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్, అంబటి రాయుడు(79;37 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సులు) సురేశ్ రైనా(54 నాటౌట్;43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగారు. దీంతో సన్‌రైజర్స్‌కు 183 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షేన్‌వాట్సన్(9) తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోయి 27 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. ఆ వెంటనే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న డుప్లెసిస్(11) సైతం దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా, అంబటి రాయుడులు సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో 10 ఓవర్లకు చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగుల మాత్రమే చేసింది.
మెరిసిన రాయుడు-రైనా
తొలుత ఆచితూచి ఆడిన రాయుడు-రైనా మెళ్లిగా వేగాన్ని పెంచుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించారు. రషీద్ ఖాన్ వేసిన 12 ఓవర్‌లో సురేశ్ రైనా వరుస రెండు సిక్సులు బాది బ్యాటింగ్ జోరును పెంచాడు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద అంబటి రాయుడు అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో సురేశ్ రైనా చెలరేగాడు. రైనా 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో ధోని (25నాటౌట్;12 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్సు) దాటిగా ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో చెన్నై 129 పరుగుల చేయడం విశేషం. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్, రషీద్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment