హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ సెంచరీ వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో షకిబుల్ హసన్‌ను వికెట్‌ను తీయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో వందో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున కేవలం ఒక టీ 20 మ్యాచ్ మాత్రమే ఆడిన కరణ్ శర్మ..మొత్తం 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఓవరాల్‌గా కరణ్ శర్మ ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహించిన మ్యాచ్‌లు 58.
గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన కరణ్ శర్మ.. తాజా ఐపీఎల్‌లో చెన్నైకు ఆడుతున్నాడు. తాజా మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబబ్బతగిలింది. 10 పరుగులకే రికీభుయ్, మనీష్ పాండే వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. కాగా, కెప్టెన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించడంతో హైదరాబాద్ తేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment