ముంబై: క్రికెట్‌లో ఐపీఎల్ ఓ సంచలనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీవీ వీక్షకుల ఆదరణలో లీగ్ కొత్త రికార్డును అధిగమించింది. గత నెల 27న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా ఒక్క స్టార్ టీవీ నెట్‌వర్క్ చానళ్లలోనే 16 కోట్ల మందికి పైగా వీక్షించారు.
దూరదర్శన్‌లో చూసిన వీక్షకులు దీనికి అదనం. అలా డీడీలో కాకుండానే అత్యధిక వీక్షక రికార్డును ఈ ఫైనల్ నమోదు చేసింది. గత ఏడాది టైటిల్ పోరును 12 కోట్ల 10 లక్షల మంది తిలకించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది 32 శాతం వీక్షకులు పెరగడం పెద్ద విశేషం. ఈసారి డిజిటల్ వీక్షకులు కూడా ఐపీఎల్ తుదిపోరుపై కన్నేశారు. గతంతో పోలిస్తే... హాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై 19 శాతం వీక్షకులు పెరిగారు. ఈ ఏడాది స్టార్ నెట్‌వర్క్ ప్రాంతీయ భాషల వ్యాఖ్యానంపై ఎక్కువగా కసరత్తు చేసింది. స్టార్‌కు చెందిన 8 చానళ్లలో స్థానిక వ్యాఖ్యానం ఉండటంతో వీక్షకులు గతంకంటే బాగా పెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment