సిద్దార్థ్‌ కౌల్‌ చెత్త రికార్డు | Siddarth Kaul gives Most runs conceded in a season | Sakshi
Sakshi News home page

సిద్దార్థ్‌ కౌల్‌ చెత్త రికార్డు

Published Mon, May 28 2018 11:46 AM | Last Updated on Mon, May 28 2018 2:50 PM

Siddarth Kaul gives Most runs conceded in a season - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సిద్దార్థ్‌ కౌల్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో సిద్దార్థ్‌ కౌల్‌ ఇచ్చిన పరుగులు 547, కాగా, ఆ తర్వాత స్థానంలో డ్వేన్‌ బ్రేవో ఉన్నాడు. ఐపీఎల్‌-11వ సీజన్‌లో బ్రేవో 533 పరుగులు ఇచ్చాడు.

ఇలా ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో సిద్దార్థ్‌ కౌల్‌, బ్రేవోలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఉమేశ్‌ యాదవ్‌(508-2013) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మెక్లీన్‌గన్‌(507-2017) నాల్గో స్థానంలో ఉండగా, ఆపై మళ్లీ డ్వేన్‌ బ్రేవో(497-2013; 494-2016) రెండు సార్లు అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement