ముంబై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో భాగంగా ఛేజింగ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా వాట్సన్ రికార్డు సృష్టించాడు. ఆదివారంతో ముగిసిన ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో వాట్సన్(117 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. ఫలితంగా ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ పోరు లక్ష్య ఛేదనలో శతకం బాదిన మొదటి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు సాధించాడు. అంతకముందు ఐపీఎల్ ఫైనల్ పోరు ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన వారిలో మనీష్ పాండే(94-2014), మన్వీందర్ బిస్లా(89-2012), క్రిస్ గేల్(76-2016)లు మాత్రమే ఉన్నారు.
అయితే ఐపీఎల్ ఫైనల్స్‌లో శతకం సాధించిన రెండో ఆటగాడిగా వాట్సన్ నిలిచాడు. గతంలో వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ సాధించాడు. 2014 ఐపీఎల్ ఫైనల్లో కింగ్స్ పంజాబ్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా(115 నాటౌట్)..కేకేఆర్‌పై సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment