
Karn Sharma Only Player To Win 3 Consecutive IPL Titles: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ ఎవరంటే..? నిస్సంకోచంగా కర్ణ శర్మ పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే, ఆర్సీబీ మినహా అతను అడుగు పెట్టిన ప్రతి ఐపీఎల్ జట్టు టైటిల్ నెగ్గింది. వివరాల్లోకి వెళితే.. 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ, ఆ తర్వాతి ఏడాది ముంబై ఇండియన్స్‌కి మారి, అక్కడ కూడా టైటిల్ గెలిచాడు.
అనంతరం 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కర్ణ్ శర్మ ముచ్ఛటగా మూడో ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచి, వరుసగా మూడు సీజన్లలో మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మధ్యలో 2019, 2020 సీజన్లలో ఈ లక్కీ లెగ్‌కు బ్రేక్ పడినా.. తిరిగి 2021 సీజన్‌లో అతని విన్నింగ్ రన్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరిగిన గతేడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే టైటిల్ గెలువగా, కర్ణ్ శర్మ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన 34 ఏళ్ల కర్ణ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2009 సీజన్‌లో ఆర్సీబీకి ఎంపికైన అతను.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013-16), ముంబై ఇండియన్స్ (2017), చెన్నై సూపర్ కింగ్స్ (2018-2021) వంటి పలు జట్లకు ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో 68 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు, 15.1 బ్యాటింగ్ సగటుతో 316 పరుగులు చేశాడు. కర్ణ్ శర్మ టీమిండియా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు, ఓ టీ20లో 5 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..!