IPL title
-
ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. ఎందుకంటే..?
Karn Sharma Only Player To Win 3 Consecutive IPL Titles: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ ఎవరంటే..? నిస్సంకోచంగా కర్ణ శర్మ పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే, ఆర్సీబీ మినహా అతను అడుగు పెట్టిన ప్రతి ఐపీఎల్ జట్టు టైటిల్ నెగ్గింది. వివరాల్లోకి వెళితే.. 2016 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ, ఆ తర్వాతి ఏడాది ముంబై ఇండియన్స్‌కి మారి, అక్కడ కూడా టైటిల్ గెలిచాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కర్ణ్ శర్మ ముచ్ఛటగా మూడో ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచి, వరుసగా మూడు సీజన్లలో మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మధ్యలో 2019, 2020 సీజన్లలో ఈ లక్కీ లెగ్‌కు బ్రేక్ పడినా.. తిరిగి 2021 సీజన్లో అతని విన్నింగ్ రన్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరిగిన గతేడాది ఐపీఎల్లో సీఎస్కే టైటిల్ గెలువగా, కర్ణ్ శర్మ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 34 ఏళ్ల కర్ణ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2009 సీజన్లో ఆర్సీబీకి ఎంపికైన అతను.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013-16), ముంబై ఇండియన్స్ (2017), చెన్నై సూపర్ కింగ్స్ (2018-2021) వంటి పలు జట్లకు ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో 68 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు, 15.1 బ్యాటింగ్ సగటుతో 316 పరుగులు చేశాడు. కర్ణ్ శర్మ టీమిండియా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు, ఓ టీ20లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..! -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్‌లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్‌తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్‌లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్‌లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్‌ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్‌కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్‌కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్‌తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్‌కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్‌కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్‌కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్‌లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్‌కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్‌ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్‌ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్‌కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్‌వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్‌వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్‌మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్‌లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
రెండేళ్లుగా కేకేఆర్ విఫలం.. మరి మోర్గాన్ మ్యాజిక్ చేస్తాడా!
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఘనమైన ఆరంభమిచ్చిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్). బ్రెండన్ మెకల్లమ్ కళ్లు చెదిరే సెంచరీ ఇన్నింగ్స్‌తోనే ఐపీఎల్ మెరుపుల లీగ్‌గా మారిపోయింది. ఇన్నేళ్లలో రెండుసార్లు టైటిల్ కూడా సాధించిన కేకేఆర్ ఈ సీజన్లో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. 2019లో ఇంగ్లండ్‌ను వన్డే వరల్డ్ చాంపియన్‌గా చేసిన మోర్గాన్ ఇప్పుడు కేకేఆర్‌ను మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలుపుతాడనే అంచనాలతో ‘సై’ అంటోంది. –సాక్షి క్రీడావిభాగం ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ జట్టు కేకేఆర్ 2014లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అనంతరం 2015లో లీగ్ దశలో ఇంటిదారి పట్టాక వరుసగా మూడేళ్లు (2016, 2017, 2018) ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినా ఫైనల్‌కు చేరలేకపోయింది. గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ గత రెండు సీజన్లలో మాత్రం తడబడింది. లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే ఈసారి టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో సమతూకం పాటిస్తూ కుర్రాళ్లపై కూడా నమ్మకం పెట్టుకుంది. వేలంలో దేశవాళీ ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనంలో జట్టును మరో దశకు చేర్చేందుకు మోర్గాన్ సేన సన్నద్ధమవుతుంది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్ గిల్ మరింత రాటుదేలాడు. అంతర్జాతీయ సిరీస్‌లలో అసాధారణ ప్రదర్శన కనబరచడం జట్టుకు లాభించే అంశం. మిడిలార్డర్లో మోర్గాన్, రసెల్, షకీబ్ మెరిపిస్తే నరైన్ తన స్పిన్ మాయాజాలాన్ని పునరావృతం చేస్తే ‘మూడో’ టైటిల్ ముచ్చట తీరుతుంది. కొత్తగా వచ్చినవారు... వేలానికి ముందు కోల్‌కతాకు నరైన్, రసెల్‌ల కోసం ప్రత్యామ్నాయ ఆటగాళ్ల అవసరం కనిపించింది. అయితే భారీ మొత్తం అందుబాటులో లేకపోవడంతో మ్యాక్స్‌వెల్, గౌతమ్, క్రిస్టియాన్‌ల కోసం పోటీ పడి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే షకీబ్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ జట్టుకు దక్కడం సానుకూలాంశం. రసెల్ ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే బెన్ కటింగ్ కొంత ఉపయోగపడగలడు. ఇక చివర్లో వేలం ముగిసే సమయంలో హర్భజన్ సింగ్‌ను తీసుకున్నా 2019 ఐపీఎల్ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది సందేహమే. వేలంలో కరుణ్ నాయర్, పవన్ నేగిలను ఎంచుకున్న టీమ్... ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లు షెల్డన్ జాక్సన్, వెంకటేశ్ అయ్యర్, వైభవ్ అరోరాలను వారి కనీస విలువ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. తుది జట్టు అంచనా/ఫామ్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. నరైన్, రసెల్లలో పదును తగ్గినట్లు రెండు సీజన్లుగా కనిపిస్తూనే ఉంది. తుది జట్టులో కచ్చితంగా ఉండే విదేశీ ఆటగాళ్లు కెప్టెన్ మోర్గాన్, కమిన్స్. గత సీజన్లో 14 మ్యాచ్‌లలో 12 వికెట్లే తీసిన ఆసీస్ పేసర్ ఈ సారైనా ప్రభావం చూపించగలడా అనేది ఆసక్తికరం. మోర్గాన్ తన స్థాయి మేరకు బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనం ఉంటుంది. భారత జట్టుకు ఆడి రెండేళ్లయిన దినేశ్ కార్తీక్ గత ఐపీఎల్లో 14.08 సగటుతో 169 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రెగ్యులర్ సభ్యుడే అయినా అతని స్ట్రయిక్‌రేట్ పేలవం. ‘వన్ సీజన్ వండర్’లాంటి నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠిలనే నమ్ముకుంటే కష్టం. బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ ఒక్కడే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. యువ పేసర్లు శుభమ్ మావి, కమలేశ్ నాగర్కోటి ఏమాత్రం రాణిస్తారో చూడాలి. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం కాగా... ఇటీవలి ప్రదర్శనను బట్టి చూస్తే కుల్దీప్ యాదవ్ ఇక ఏమాత్రం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసరగలడనేది సందేహమే. ఓవరాల్‌గా చూస్తే తొలి బంతి నుంచే విరుచుకుపడి ప్రత్యర్థికి దడ పుట్టించే లైనప్ లా మాత్రం కేకేఆర్ కనబడటం లేదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరగలిగితే గొప్ప. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, గుర్కీరత్ మన్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, కమలేశ్ నాగర్కోటి, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కరుణ్ నాయర్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, హర్భజన్ సింగ్. విదేశీ ఆటగాళ్లు: మోర్గాన్ (కెప్టెన్), రసెల్, కమిన్స్, షకీబ్, నరైన్, ఫెర్గూసన్, బెన్ కటింగ్, టిమ్ సీఫెర్ట్. అత్యుత్తమ ప్రదర్శన రెండుసార్లు చాంపియన్ (2012, 2014) 2020లో ప్రదర్శన: యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్ టోర్నీలో దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ అభిమానుల్ని నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 7 పరాజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. అసలు ఏ దశలోనూ టీమ్‌నుంచి అబ్బురపరచే ప్రదర్శన ఒక్కటీ రాలేదు. సిరాజ్ దెబ్బకు 84 పరుగులకే పరిమితమైనప్పుడే జట్టు ఆటపై సందేహాలు కనిపించాయి. ఆశలు పెట్టుకున్న నరైన్, రసెల్ అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయారు. తొలి 7 మ్యాచ్‌ల తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... అప్పటికే ఆలస్యం కావడంతో జట్టును ముందుకు నడిపించడం మోర్గాన్ వల్ల కూడా కాలేదు. -
నైట్‌రైడర్స్ దూకుడు
రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ కెప్టెన్సీలో కొత్త జట్టుతో అద్భుత ప్రదర్శన కనబర్చి తొలిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 2014లో కూడా దానిని పునరావృతం చేసింది. రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని చెన్నై తర్వాత ఈ ఘనత సాధించిన మరో జట్టుగా నిలిచింది. ఈ టీమ్‌లో 2012లో విజేతగా నిలిచిన జట్టులోని వారే ఎక్కువ మంది ఉండి కీలక పాత్ర పోషించారు. అనూహ్యమైన ఆటతీరుతో లీగ్ దశలో ఏకంగా 11 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరకు ఫైనల్లో చతికిల పడింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బోర్డుతో విభేదాల కారణంగా పుణే వారియర్స్ తప్పుకోవడంతో లీగ్ మొదలైన కొత్తలో ఉన్నట్లుగా మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్ జరగడం విశేషం. యూఏఈలో.... ఐపీఎల్ మొదలైన తర్వాత రెండోసారి 2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2009లాగే మళ్లీ దక్షిణాఫ్రికాలో నిర్వహించాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు తెచ్చింది. అయితే ఈసారి ఫ్రాంచైజీలు దానిని వ్యతిరేకించాయి. ఆర్థికపరంగా, నిర్వ హణాపరంగా 2009లో తమకు చాలా సమస్యలు తలెత్తాయని చెప్పడంతో చివరకు రెండు దశలుగా లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తొలి 20 మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, తర్వాతి 40 మ్యాచ్‌లు భారత్‌లో జరిగాయి. ఫైనల్ ఫలితం... క్వాలిఫయర్–1లో పంజాబ్‌ను ఓడించి కోల్‌కతా... క్వాలిఫయర్ 2లో చెన్నైని ఓడించి పంజాబ్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. వృద్ధిమాన్ సాహా (115 నాటౌట్) అద్భుత సెంచరీ, మనన్ వోహ్రా (67) అర్ధ సెంచరీ సహాయంతో ముందుగా పంజాబ్ 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత కోల్‌కతా మరో 3 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లకు 200 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. ‘మ్యా¯Œ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (94) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు శతకాలు... టోర్నీలో మూడు సెంచరీలు నమోదయ్యాయి. సెహ్వాగ్ (122), సాహా (115), లెండిల్ సిమ¯Œ ్స (100) ఈ ఘనత సాధించగా... 4 అర్ధ సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్ 95, 95, 90, 89 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. లీగ్‌లో అత్యధికంగా మ్యాక్స్‌వెల్ 36 సిక్సర్లు బాదడం మరో విశేషం. వేలం విశేషాలు... 2014 సీజన్లో మళ్లీ కొత్తగా వేలం జరిగితే... మొదటిసారి ఆటగాళ్లకు డాలర్లు రూపంలో కాకుండా రూపాయలుగా చెల్లించారు. అన్నింటికంటే ప్రధాన మార్పు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్స్ విషయంలో జరిగింది. అప్పటి వరకు వారిని వేలంలో ఉంచకుండా నిర్ణీత మొత్తం అందజేసిన గవర్నింగ్ కౌన్సిల్ వారికీ వేలంలో చేరే అవకాశం ఇచ్చింది. దీని వల్ల భారత జట్టుకు ఆడకపోయినా ప్రత్యేక ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు భారీ మొత్తం అందుకునే అవకాశం దక్కింది. వీరిలో అత్యధికంగా కరణ్ శర్మ (రూ. 3.75 కోట్లు)కు దక్కాయి. ఇద్దరు మినహా... లీగ్‌లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి కోల్‌కతా విజయంలో భాగంగా నిలిచిన 17 మంది ఆటగాళ్లలో మన్వీందర్ బిస్లా, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతావారంతా అంతర్జాతీయ క్రికెటర్లు కావడం విశేషం. -
సూపర్ కింగ్స్‌కు ఘన స్వాగతం
చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
వారికంటే ఆ కసి నాకే ఎక్కువగా ఉంది: కోహ్లి
బెంగళూరు : ఐపీఎల్ టైటిల్ నెగ్గాలనే కసి అభిమానులకు కన్నా తనకే ఎక్కువగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. బుధవారం ట్రైనింగ్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘టైటిల్ గెలవాలనే కోరిక అభిమానుల కన్నా నాకే ఎక్కువగా ఉంది. గత పదేళ్లుగా నేను బెంగళూరు జట్టుతో కొనసాగుతున్నా. మూడు సార్లు ఫైనల్‌కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్నాం. ఈ సారి 120 శాతం ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకుంటాం. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉండేది. కానీ ఈ సారి వేలం మా బౌలింగ్ విభాగానికి ఊపును తీసుకొచ్చింది. ఈ సీజన్లో మా అవకాశాలు గురించి నేను ఆశావాహక ధృక్పథంతో ఉన్నానని’ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సారీ వేలంలో బౌలర్లపై దృష్టి సారించిన ఆర్సీబీ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుంధర్, పవన్ నేగి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీలను తీసుకుంది. ఉమేశ్ యాదవ్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్‌వోక్స్, నవదీప్‌సైనీ, సిరాజ్, టీమ్ సౌతీలతో పేస్ విభాగం సైతం బలంగా కనిపిస్తోంది. -
అలా ఎలా ?
లీగ్‌లో రెండో స్థానంలో నిలిస్తే ఐపీఎల్ టైటిల్ ఖాయం వరుసగా ఐదేళ్లూ అలాగే జరిగిన వైనం ఊహించిన ఫలితం ఒక్కసారి రావడమే కష్టం. రెండోసారీ అదే ఫలితం వస్తే యాదృచ్ఛికం అనుకోవచ్చు.. కానీ ప్రతిసారీ ఒకే ఫలితం వస్తే..? జట్లు మారుతున్నా, వేదికలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా... ప్రతి సీజన్లోనూ ఒకే ఫలితం ఉంటే..? కాకతాళీయమే అనుకోవాలా? లేక ఏదైనా ‘కథ’ జరుగుతోందని భావించాలా? ఐపీఎల్ ప్లే ఆఫ్ విధానం మొదలైన తర్వాత ప్రతి సీజన్లోనూ ఒకే ఫలితం వచ్చింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే ప్రతి సీజన్లోనూ టైటిల్ గెలిచింది. అలా ఎలా? సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్లో ప్లే ఆఫ్ విధానం మొదలై ఐదు సంవత్సరాలు. 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ఫలితాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి సీజన్లోనూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే టైటిల్ గెలిచింది. అంతే కాదు... ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్ ఫలితాలు ఒకేలా వస్తున్నాయి. ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఒకటో స్థానంలో నిలిచిన జట్టే ఫైనల్‌కు వచ్చి రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఓడిపోతోంది. ఒక్క 2012లో మాత్రమే కొద్దిగా ఈ ట్రెండ్ మారింది. కానీ టైటిల్ గెలిచింది మాత్రం ఆ సీజన్లో కూడా రెండో స్థానంలో నిలిచిన జట్టే. బెంగళూరుకు బ్యాడ్‌లక్ ఈ ఏడాది బెంగళూరు జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిస్తే రెండో స్థానంలో నిలిచేది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో ఆఖరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాని సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన ముంబై రెండో స్థానానికి చేరింది. ‘ట్రెండ్’ ప్రకారం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఒకవేళ వర్షం అడ్డుపడకుండా బెంగళూరు తమ ఆఖరి మ్యాచ్ గెలిచి రెండో స్థానంలో నిలిచి ఉంటే..? పాపం... బెంగళూరు. కాకతాళీయమేనా... ఫలితాలు ఒకే విధంగా ఎలా వస్తున్నాయనేదానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇది కాకతాళీ యమే అయితే ఫర్వాలేదు. ఒకవేళ కాకపోతే మా త్రం... ఐపీఎల్ మీద పందేలు కాసి నష్టపోయిన లక్షలాది మంది దారుణంగా మోసపోయినట్లే. ఫలితాలు ఎలా వస్తున్నాయంటే... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలి చిన జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఇందులో రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలిచి ఫైనల్‌కు చేరుతుంది. (ఒక్క 2013లో మాత్రం అగ్రస్థా నంలో నిలిచిన జట్టే ఈ మ్యాచ్ గెలిచింది.) ఎలిమినేటర్ మ్యాచ్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు తలపడతాయి. ఇందులో ప్రతిసారీ మూడో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. (ఒక్క 2012లో మాత్రం నాలుగో స్థానంలో నిలిచిన చెన్నై గెలిచింది) ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (మూడోస్థా నంలో నిలిచిన జట్టు)... క్వాలిఫయర్-2లో ఆడుతుంది. ఇక్కడ ఒకటో స్థానంలో నిలిచిన జట్టు గెలుస్తోంది (2012లో మాత్రం అగ్రస్థానం సాధించిన ఢిల్లీ జట్టు ఓడిపోయింది) ఫైనల్లో మళ్లీ రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. వరుసగా ప్లే ఆఫ్ మొదలయ్యాక ఐదేళ్లూ ఇలాగే జరిగింది. 2011 చెన్నై సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. బెంగళూరు 2. చెన్నై 3. ముంబై 4. కోల్‌కతా క్వాలిఫయర్-1: బెంగళూరు ఁ చెన్నై 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు ఎలిమినేటర్: కోల్‌కతా ఁ ముంబై 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ ముంబై 43 పరుగులతో బెంగళూరు విజయం ఫైనల్: చెన్నై ఁ బెంగళూరు 58 పరుగుల తేడాతో చెన్నై గెలుపు 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. ఢిల్లీ 2. కోల్‌కతా 3. ముంబై 4. చెన్నై క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ ఢిల్లీ 18 పరుగులతో కోల్‌కతా గెలుపు ఎలిమినేటర్: చెన్నై ఁ ముంబై 38 పరుగులతో చెన్నై గెలుపు క్వాలిఫయర్-2: చెన్నై ఁ ఢిల్లీ 86 పరుగులతో చెన్నై విజయం ఫైనల్: చెన్నై ఁ కోల్‌కతా 5 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు 2013 ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. చెన్నై 2. ముంబై, 3. రాజస్తాన్ 4. హైదరాబాద్ క్వాలిఫయర్-1: చెన్నై ఁ ముంబై 48 పరుగులతో చెన్నై గెలుపు ఎలిమినేటర్: హైదరాబాద్ఁ రాజస్తాన్ 4 వికెట్లతో రాజస్తాన్ విజయం క్వాలిఫయర్-2: రాజస్తాన్ ఁ ముంబై 4 వికెట్లతో ముంబై గెలుపు ఫైనల్: ముంబై ఁ చెన్నై 23 పరుగులతో ముంబై విజయం 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. పంజాబ్ 2. కోల్‌కతా 3. చెన్నై 4. ముంబై క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ పంజాబ్ 28 పరుగులతో కోల్‌కతా గెలుపు ఎలిమినేటర్: ముంబై ఁ చెన్నై 7 వికెట్లతో చెన్నై విజయం క్వాలిఫయర్-2: పంజాబ్ ఁ చెన్నై 24 పరుగులతో పంజాబ్ గెలుపు ఫైనల్: పంజాబ్ ఁ కోల్‌కతా 3 వికెట్లతో కోల్‌కతా విజయం 2015 ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. చెన్నై 2. ముంబై, 3. బెంగళూరు 4. రాజస్తాన్ క్వాలిఫయర్-1: ముంబై ఁ చెన్నై 25 పరుగులతో ముంబై గెలుపు ఎలిమినేటర్: బెంగళూరు ఁ రాజస్తాన్ 71 పరుగులతో బెంగళూరు గెలుపు క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ చెన్నై 3 వికెట్లతో చెన్నై గెలుపు ఫైనల్: ముంబై ఁ చెన్నై 41 పరుగులతో ముంబై గెలుపు