అలా ఎలా ? | Premier League play-off policy | Sakshi
Sakshi News home page

అలా ఎలా ?

Published Tue, May 26 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

అలా ఎలా ?

అలా ఎలా ?

లీగ్‌లో రెండో స్థానంలో నిలిస్తే ఐపీఎల్ టైటిల్ ఖాయం
 వరుసగా ఐదేళ్లూ అలాగే జరిగిన వైనం

 ఊహించిన ఫలితం ఒక్కసారి రావడమే కష్టం. రెండోసారీ అదే ఫలితం వస్తే యాదృచ్ఛికం అనుకోవచ్చు.. కానీ ప్రతిసారీ ఒకే ఫలితం వస్తే..? జట్లు మారుతున్నా, వేదికలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా... ప్రతి సీజన్‌లోనూ ఒకే ఫలితం ఉంటే..? కాకతాళీయమే అనుకోవాలా? లేక ఏదైనా ‘కథ’ జరుగుతోందని భావించాలా? ఐపీఎల్ ప్లే ఆఫ్ విధానం మొదలైన తర్వాత ప్రతి సీజన్‌లోనూ ఒకే ఫలితం వచ్చింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే ప్రతి సీజన్‌లోనూ టైటిల్ గెలిచింది. అలా ఎలా?
 
 సాక్షి క్రీడావిభాగం
 ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ విధానం మొదలై ఐదు సంవత్సరాలు. 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ఫలితాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి సీజన్‌లోనూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే టైటిల్ గెలిచింది. అంతే కాదు... ప్రతి సీజన్‌లోనూ ప్లే ఆఫ్ ఫలితాలు ఒకేలా వస్తున్నాయి. ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఒకటో స్థానంలో నిలిచిన జట్టే ఫైనల్‌కు వచ్చి రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఓడిపోతోంది. ఒక్క 2012లో మాత్రమే కొద్దిగా ఈ ట్రెండ్ మారింది. కానీ టైటిల్ గెలిచింది మాత్రం ఆ సీజన్‌లో కూడా రెండో స్థానంలో నిలిచిన జట్టే.
 
 బెంగళూరుకు బ్యాడ్‌లక్
 ఈ ఏడాది బెంగళూరు జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిస్తే రెండో స్థానంలో నిలిచేది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో ఆఖరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాని సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన ముంబై రెండో స్థానానికి చేరింది. ‘ట్రెండ్’ ప్రకారం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఒకవేళ వర్షం అడ్డుపడకుండా బెంగళూరు తమ ఆఖరి మ్యాచ్ గెలిచి రెండో స్థానంలో నిలిచి ఉంటే..? పాపం... బెంగళూరు.
 
 కాకతాళీయమేనా...
 ఫలితాలు ఒకే విధంగా ఎలా వస్తున్నాయనేదానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇది కాకతాళీ యమే అయితే ఫర్వాలేదు. ఒకవేళ కాకపోతే మా త్రం... ఐపీఎల్ మీద పందేలు కాసి నష్టపోయిన లక్షలాది మంది దారుణంగా మోసపోయినట్లే.
 ఫలితాలు ఎలా వస్తున్నాయంటే...

 పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలి చిన జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఇందులో రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలిచి ఫైనల్‌కు చేరుతుంది. (ఒక్క 2013లో మాత్రం అగ్రస్థా నంలో నిలిచిన జట్టే ఈ మ్యాచ్ గెలిచింది.)

  ఎలిమినేటర్ మ్యాచ్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు తలపడతాయి. ఇందులో ప్రతిసారీ మూడో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. (ఒక్క 2012లో మాత్రం నాలుగో స్థానంలో నిలిచిన చెన్నై గెలిచింది)

ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (మూడోస్థా నంలో నిలిచిన జట్టు)... క్వాలిఫయర్-2లో ఆడుతుంది. ఇక్కడ ఒకటో స్థానంలో నిలిచిన జట్టు గెలుస్తోంది (2012లో మాత్రం అగ్రస్థానం సాధించిన ఢిల్లీ జట్టు ఓడిపోయింది)

ఫైనల్లో మళ్లీ రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. వరుసగా ప్లే ఆఫ్ మొదలయ్యాక ఐదేళ్లూ ఇలాగే జరిగింది.
 
 2011 చెన్నై సూపర్‌కింగ్స్
 పాయింట్ల పట్టికలో టాప్-4
 1. బెంగళూరు     2. చెన్నై
 3. ముంబై     4. కోల్‌కతా
 క్వాలిఫయర్-1: బెంగళూరు ఁ చెన్నై
 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
 ఎలిమినేటర్:  కోల్‌కతా ఁ ముంబై
 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు
 క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ ముంబై
 43 పరుగులతో బెంగళూరు విజయం
 ఫైనల్: చెన్నై ఁ బెంగళూరు
 58 పరుగుల తేడాతో చెన్నై గెలుపు
 
 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్
  పాయింట్ల పట్టికలో టాప్-4
 1. ఢిల్లీ     2. కోల్‌కతా
 3. ముంబై     4. చెన్నై
 క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ ఢిల్లీ
 18 పరుగులతో కోల్‌కతా గెలుపు
 ఎలిమినేటర్: చెన్నై ఁ ముంబై
 38 పరుగులతో చెన్నై గెలుపు
 క్వాలిఫయర్-2: చెన్నై ఁ ఢిల్లీ
 86 పరుగులతో చెన్నై విజయం
 ఫైనల్: చెన్నై ఁ కోల్‌కతా
 5 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు
 
 2013 ముంబై ఇండియన్స్
  పాయింట్ల పట్టికలో టాప్-4
 1. చెన్నై     2. ముంబై,
 3. రాజస్తాన్     4. హైదరాబాద్
 క్వాలిఫయర్-1: చెన్నై ఁ ముంబై
 48 పరుగులతో చెన్నై గెలుపు
 ఎలిమినేటర్: హైదరాబాద్‌ఁ రాజస్తాన్
 4 వికెట్లతో రాజస్తాన్ విజయం
 క్వాలిఫయర్-2: రాజస్తాన్ ఁ ముంబై
 4 వికెట్లతో ముంబై గెలుపు
 ఫైనల్: ముంబై ఁ చెన్నై
 23 పరుగులతో ముంబై విజయం
 
 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్
  పాయింట్ల పట్టికలో టాప్-4
 1. పంజాబ్     2. కోల్‌కతా
 3. చెన్నై     4. ముంబై
 క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ పంజాబ్
 28 పరుగులతో కోల్‌కతా గెలుపు
 ఎలిమినేటర్: ముంబై ఁ చెన్నై
 7 వికెట్లతో చెన్నై విజయం
 క్వాలిఫయర్-2: పంజాబ్ ఁ చెన్నై
 24 పరుగులతో పంజాబ్ గెలుపు
 ఫైనల్: పంజాబ్ ఁ కోల్‌కతా
 3 వికెట్లతో కోల్‌కతా విజయం
 
 2015 ముంబై ఇండియన్స్
  పాయింట్ల పట్టికలో టాప్-4
 1. చెన్నై     2. ముంబై,
 3. బెంగళూరు     4. రాజస్తాన్
 క్వాలిఫయర్-1: ముంబై ఁ చెన్నై
 25 పరుగులతో ముంబై గెలుపు
 ఎలిమినేటర్: బెంగళూరు ఁ రాజస్తాన్
 71 పరుగులతో బెంగళూరు గెలుపు
 క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ చెన్నై
 3 వికెట్లతో చెన్నై గెలుపు
 ఫైనల్: ముంబై ఁ చెన్నై
 41 పరుగులతో ముంబై గెలుపు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement