IPL 2015
-
ముంబై మళ్లీ కొట్టింది
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ రెండోసారి లీగ్ విజేతగా నిలిచింది. 2015 సీజన్ తొలి రెండు వారాల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఒక్కసారిగా జూలు విదిల్చి దూసుకుపోయింది. రెండేళ్ల క్రితంలాగే అదే కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో అదే ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. నెమ్మదైన ఈడెన్ గార్డెన్ పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని నిర్ణయంపై ఆ తర్వాత కొంత చర్చ కూడా జరిగింది. గెలిపించిన కెప్టెన్: ఫైనల్లో ముందుగా సిమన్స్ (68), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (26 బంతుల్లో 50) సహాయంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 8 వికెట్లకు 161 పరుగులే చేసి 41 పరుగుల తేడాతో ఓడింది. డ్వేన్ స్మిత్ (48 బంతుల్లో 57) స్లో హాఫ్ సెంచరీతో ఛేదనలో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు ముంబై కూడా రెండు టైటిళ్లు గెలిచిన చెన్నై, కోల్‌కతా సరసన నిలిచింది. ►నాలుగు సెంచరీలు: 2015 లీగ్‌లో డివిలియర్స్, గేల్, వాట్సన్, మెకల్లమ్ శతకాలతో చెలరేగారు. గేల్ అత్యధికంగా 38 సిక్సర్లు బాదాడు. ►ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: ఆండ్రీ రసెల్ (కోల్‌కతా – 193 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు, 14 వికెట్లు) ►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): డేవిడ్ వార్నర్ – సన్‌రైజర్స్, 562 పరుగులు ►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): డ్వేన్ బ్రేవో – చెన్నై, 26 వికెట్లు -
అలా ఎలా ?
లీగ్‌లో రెండో స్థానంలో నిలిస్తే ఐపీఎల్ టైటిల్ ఖాయం వరుసగా ఐదేళ్లూ అలాగే జరిగిన వైనం ఊహించిన ఫలితం ఒక్కసారి రావడమే కష్టం. రెండోసారీ అదే ఫలితం వస్తే యాదృచ్ఛికం అనుకోవచ్చు.. కానీ ప్రతిసారీ ఒకే ఫలితం వస్తే..? జట్లు మారుతున్నా, వేదికలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా... ప్రతి సీజన్లోనూ ఒకే ఫలితం ఉంటే..? కాకతాళీయమే అనుకోవాలా? లేక ఏదైనా ‘కథ’ జరుగుతోందని భావించాలా? ఐపీఎల్ ప్లే ఆఫ్ విధానం మొదలైన తర్వాత ప్రతి సీజన్లోనూ ఒకే ఫలితం వచ్చింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే ప్రతి సీజన్లోనూ టైటిల్ గెలిచింది. అలా ఎలా? సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్లో ప్లే ఆఫ్ విధానం మొదలై ఐదు సంవత్సరాలు. 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్ల పాటు ఫలితాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి సీజన్లోనూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టే టైటిల్ గెలిచింది. అంతే కాదు... ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్ ఫలితాలు ఒకేలా వస్తున్నాయి. ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఒకటో స్థానంలో నిలిచిన జట్టే ఫైనల్‌కు వచ్చి రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఓడిపోతోంది. ఒక్క 2012లో మాత్రమే కొద్దిగా ఈ ట్రెండ్ మారింది. కానీ టైటిల్ గెలిచింది మాత్రం ఆ సీజన్లో కూడా రెండో స్థానంలో నిలిచిన జట్టే. బెంగళూరుకు బ్యాడ్‌లక్ ఈ ఏడాది బెంగళూరు జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిస్తే రెండో స్థానంలో నిలిచేది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో ఆఖరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాని సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన ముంబై రెండో స్థానానికి చేరింది. ‘ట్రెండ్’ ప్రకారం టైటిల్ ఎగరేసుకుపోయింది. ఒకవేళ వర్షం అడ్డుపడకుండా బెంగళూరు తమ ఆఖరి మ్యాచ్ గెలిచి రెండో స్థానంలో నిలిచి ఉంటే..? పాపం... బెంగళూరు. కాకతాళీయమేనా... ఫలితాలు ఒకే విధంగా ఎలా వస్తున్నాయనేదానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇది కాకతాళీ యమే అయితే ఫర్వాలేదు. ఒకవేళ కాకపోతే మా త్రం... ఐపీఎల్ మీద పందేలు కాసి నష్టపోయిన లక్షలాది మంది దారుణంగా మోసపోయినట్లే. ఫలితాలు ఎలా వస్తున్నాయంటే... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలి చిన జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఇందులో రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలిచి ఫైనల్‌కు చేరుతుంది. (ఒక్క 2013లో మాత్రం అగ్రస్థా నంలో నిలిచిన జట్టే ఈ మ్యాచ్ గెలిచింది.) ఎలిమినేటర్ మ్యాచ్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు తలపడతాయి. ఇందులో ప్రతిసారీ మూడో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. (ఒక్క 2012లో మాత్రం నాలుగో స్థానంలో నిలిచిన చెన్నై గెలిచింది) ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (మూడోస్థా నంలో నిలిచిన జట్టు)... క్వాలిఫయర్-2లో ఆడుతుంది. ఇక్కడ ఒకటో స్థానంలో నిలిచిన జట్టు గెలుస్తోంది (2012లో మాత్రం అగ్రస్థానం సాధించిన ఢిల్లీ జట్టు ఓడిపోయింది) ఫైనల్లో మళ్లీ రెండో స్థానంలో నిలిచిన జట్టే గెలుస్తుంది. వరుసగా ప్లే ఆఫ్ మొదలయ్యాక ఐదేళ్లూ ఇలాగే జరిగింది. 2011 చెన్నై సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. బెంగళూరు 2. చెన్నై 3. ముంబై 4. కోల్‌కతా క్వాలిఫయర్-1: బెంగళూరు ఁ చెన్నై 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు ఎలిమినేటర్: కోల్‌కతా ఁ ముంబై 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ ముంబై 43 పరుగులతో బెంగళూరు విజయం ఫైనల్: చెన్నై ఁ బెంగళూరు 58 పరుగుల తేడాతో చెన్నై గెలుపు 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. ఢిల్లీ 2. కోల్‌కతా 3. ముంబై 4. చెన్నై క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ ఢిల్లీ 18 పరుగులతో కోల్‌కతా గెలుపు ఎలిమినేటర్: చెన్నై ఁ ముంబై 38 పరుగులతో చెన్నై గెలుపు క్వాలిఫయర్-2: చెన్నై ఁ ఢిల్లీ 86 పరుగులతో చెన్నై విజయం ఫైనల్: చెన్నై ఁ కోల్‌కతా 5 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు 2013 ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. చెన్నై 2. ముంబై, 3. రాజస్తాన్ 4. హైదరాబాద్ క్వాలిఫయర్-1: చెన్నై ఁ ముంబై 48 పరుగులతో చెన్నై గెలుపు ఎలిమినేటర్: హైదరాబాద్ఁ రాజస్తాన్ 4 వికెట్లతో రాజస్తాన్ విజయం క్వాలిఫయర్-2: రాజస్తాన్ ఁ ముంబై 4 వికెట్లతో ముంబై గెలుపు ఫైనల్: ముంబై ఁ చెన్నై 23 పరుగులతో ముంబై విజయం 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. పంజాబ్ 2. కోల్‌కతా 3. చెన్నై 4. ముంబై క్వాలిఫయర్-1: కోల్‌కతా ఁ పంజాబ్ 28 పరుగులతో కోల్‌కతా గెలుపు ఎలిమినేటర్: ముంబై ఁ చెన్నై 7 వికెట్లతో చెన్నై విజయం క్వాలిఫయర్-2: పంజాబ్ ఁ చెన్నై 24 పరుగులతో పంజాబ్ గెలుపు ఫైనల్: పంజాబ్ ఁ కోల్‌కతా 3 వికెట్లతో కోల్‌కతా విజయం 2015 ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-4 1. చెన్నై 2. ముంబై, 3. బెంగళూరు 4. రాజస్తాన్ క్వాలిఫయర్-1: ముంబై ఁ చెన్నై 25 పరుగులతో ముంబై గెలుపు ఎలిమినేటర్: బెంగళూరు ఁ రాజస్తాన్ 71 పరుగులతో బెంగళూరు గెలుపు క్వాలిఫయర్-2: బెంగళూరు ఁ చెన్నై 3 వికెట్లతో చెన్నై గెలుపు ఫైనల్: ముంబై ఁ చెన్నై 41 పరుగులతో ముంబై గెలుపు -
లేటు వయసులో రెచ్చిపోయారు
కోల్‌కతా: టీ-20 ఫార్మాట్లో సాధారణంగా కొత్త ముఖాలు, యువ క్రికెటర్లు సత్తాచాటుతుంటారు. సీనియర్లు, అందులోనూ 35 ప్లస్ వయసులో ఉన్న ఆటగాళ్లు ఈ ఫార్మాట్ పెద్దగా రాణించలేరు. తాజాగా జరిగిన ఐపీఎల్-8లో వెటరన్లు దుమ్మురేపారు. వయసు అన్నది ఓ సంఖ్య మాత్రమే కానీ ఆటకు ప్రతికూలం కాదంటూ లేటు వయసులో అదరగొట్టారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల నెహ్రా 22 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 35 హర్భజన్ కూడా ఐపీఎల్ ప్రదర్శన ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ముంబై తరపున బరిలో దిగిన బంతితో పాటు కొన్నిసార్లు బ్యాట్‌తో రెచ్చిపోయాడు. ఈ సీజన్లో 18 వికెట్లు పడగొట్టిన భజ్జీ.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు. కోల్‌కతా బౌలర్ బ్రాడ్ హాగ్ లేటు వయసులో విజృంభించాడు. 44 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా బౌలర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వయసు క్రికెటర్. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. చెన్నైతో మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఆటగాడి వయసు 32 ఏళ్లు. ఢిల్లీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించకపోయినా ఆ జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా రాణించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 36 ఏళ్ల బౌలర్ 15 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో 4 సెంచరీలు నమోదు కాగా, ఈ నాలుగూ 30 ప్లస్ వయసు ఆటగాళ్లే బాదడం విశేషం. బెంగళూరు క్రికెటర్లు డివిల్లీర్స్ (31), క్రిస్ గేల్ (36), రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (34), చెన్నై ఓపెనర్ మెకల్లమ్ (34) సెంచరీలతో కదంతొక్కారు. ఐపీఎల్-8లో అత్యధిక సిక్సర్లు (38) సంధించింది 36 ఏళ్ల గేల్ కావడం మరో విశేషం. డివిల్లీర్స్ 513, గేల్ 491, మెకల్లమ్ 436 పరుగులు చేశారు. -
IPLకు ఎక్కువ రేటింగ్
-
ధనా ధన్ ఐపీఎల్ - 2015
-
అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు
-
రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్
-
ఏప్రిల్ 8న ఐపీఎల్ 2015 ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ వేసవి అంతా క్రికెట్ అభిమానులకు కనువిందే. వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2015 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. ఈ సిజన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ అన్ని మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో ఆడనుంది.