రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ రెండోసారి లీగ్ విజేతగా నిలిచింది. 2015 సీజన్ తొలి రెండు వారాల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఒక్కసారిగా జూలు విదిల్చి దూసుకుపోయింది. రెండేళ్ల క్రితంలాగే అదే కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో అదే ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. నెమ్మదైన ఈడెన్ గార్డెన్ పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని నిర్ణయంపై ఆ తర్వాత కొంత చర్చ కూడా జరిగింది.
గెలిపించిన కెప్టెన్: ఫైనల్లో ముందుగా సిమన్స్ (68), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (26 బంతుల్లో 50) సహాయంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 8 వికెట్లకు 161 పరుగులే చేసి 41 పరుగుల తేడాతో ఓడింది. డ్వేన్ స్మిత్ (48 బంతుల్లో 57) స్లో హాఫ్ సెంచరీతో ఛేదనలో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు ముంబై కూడా రెండు టైటిళ్లు గెలిచిన చెన్నై, కోల్‌కతా సరసన నిలిచింది.
►నాలుగు సెంచరీలు: 2015 లీగ్‌లో డివిలియర్స్, గేల్, వాట్సన్, మెకల్లమ్ శతకాలతో చెలరేగారు. గేల్ అత్యధికంగా 38 సిక్సర్లు బాదాడు.
►ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: ఆండ్రీ రసెల్ (కోల్‌కతా – 193 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు, 14 వికెట్లు)
►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): డేవిడ్ వార్నర్ – సన్‌రైజర్స్, 562 పరుగులు
►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): డ్వేన్ బ్రేవో – చెన్నై, 26 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment