mumbai indian
-
'మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా'
క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అంత్యంత పిన్న వయస్కుడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో 18 ఏళ్ల మఫాకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనతను మఫాకా తన పేరిట లిఖించుకున్నాడు.ఈ ఏడాది జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో మఫాకాకు సీనియర్ ప్రోటీస్ జట్టులో చోటు దక్కింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ సంచలనం అందిపుచ్చుకోలేకపోయాడు. విండీస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 54 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఐపీఎల్లో కూడా మఫాకా ఆడాడు.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరపున క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఈ ప్రోటీస్ యువ పేసర్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఐపీఎల్లో 2 మ్యాచ్‌లు ఆడిన మఫాక ఏకంగా 89 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ సాధించాడు. దీంతో మిగితా మ్యాచ్‌లకు ముంబై ఫ్రాంచైజీ అతడిని పక్కన పెట్టింది. అయితే మఫాకా వికెట్లు సాధించకపోయినప్పటకి 150 పైగా వేగంతో బౌలింగ్ చేసి అందరని ఆకట్టుకున్నాడు.చదవును కొనసాగిస్తున్నా?ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాక పలు అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఓ వైపు క్రికెట్‌ను, మరో వైపు తన చదువును ఎలా బ్యాలెన్స్ చేశాడో అతడు చెప్పుకొచ్చాడు."నేను తిరిగి ఇంటికి వెళ్లాక ప్రిలిమ్స్(స్కూల్ ఎడ్యూకేషన్) కోసం సిద్దమవుతాను. మళ్లీ నా స్కూల్‌కు వెళ్తాను. విండీస్ టార్ సమయంలో కూడా నా చదువును కొనసాగించాను. ఓ వైపు కొంచెం కొంచెం చదవుతూ నా ఆటపై దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పరీక్షలతో నా పాఠశాల విద్య పూర్తి అవుతోంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అదే విధంగా ప్రోటీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతీ ఒక్క ఆటగాడి చిరకాల స్వప్నం. క్రికెట్ అంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ ఎక్కువ. ఆరు, ఏడేళ్ల వయస్సు నుంచే దక్షిణాఫ్రికా తరపున ఆడాలని కలలు కన్నాను అని ఐవోఎల్.కామ్( iol.com.za)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. -
ఈ సీజనే అత్యుత్తమం
ఈ ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లు ఆఖరి ఓవర్‌దాకా సాగి ఉత్కంఠ రేపాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. తాజా ఫైనల్ పోరులో ఆఖరి బంతే విజేతను తేల్చింది. అసలు సిసలైన ఫైనల్ మజానిచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే ఈ సీజన్ టోర్నీ అత్యుత్తమమైంది. మొత్తానికి ఏటికేడు ఐపీఎల్ స్థాయి పెరుగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్‌కు అభినందనలు. రోహిత్ సారథ్యంలో ముంబై నాలుగో టైటిల్ నెగ్గింది. లీగ్ చరిత్రలో అతనిప్పుడు విజయవంతమైన కెప్టెన్. ఆదివారం ఉత్తమ కెప్టెన్ల మధ్య అత్యుత్తమ సమరమే జరిగింది. బెంగళూరు, చెన్నైల మధ్య బోర్ కొట్టిన మ్యాచ్‌తో ఈ సీజన్ మొదలైంది. (బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది) కానీ రానురాను మ్యాచ్‌ల స్వరూపం మారింది. అయితే నిర్వాహకులు గత చాంపియన్, అట్టడుగున నిలిచిన జట్ల మధ్య కాకుండా విజేత, రన్నరప్ జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహిస్తే బాగుంటుంది. అలాగే మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలి. కొన్ని మ్యాచ్‌లైతే 4 గంటలపాటు జరిగాయి. 190 నిమిషాలు లేదంటే 200 నిమిషాల్లో మ్యాచ్‌లు ముగిసేలా చర్యలు తీసుకోవాలి. లేట్ ఓవర్ రేట్‌కు కేవలం ఆర్థిక జరిమానా సరిపోదు... ‘క్రికెటింగ్ పెనాల్టీ’లను విధించాలి. తద్వారా వాళ్ల పాయింట్లతో పాటు మ్యాచ్‌లకూ ఇది తీవ్రంగా పరిణమిస్తుంది. ఔటైతే తదుపరి బ్యాట్స్‌మన్ 2 నిమిషాల్లో కాకుండా 45 సెకన్లలోనే క్రీజులోకి వచ్చేలా నిబంధనలు తేవాలి. ఓవర్ ముగిసిన తర్వాత మొదలయ్యే ఓవర్ తొలి బంతికి టైమ్ పీరియడ్ ఉండాలి. ఆ సమయంలోపు బంతి వేయకుంటే అంపైర్ ఫ్రీహిట్‌గా ప్రకటించాలి. అప్పుడే మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో ముగించేందుకు ప్రయత్నిస్తారు. పిచ్‌లపై కూడా నిర్వాహకులు దృష్టి పెట్టాలి. ఫైనల్ మ్యాచ్ సాగినట్లే బ్యాట్స్‌మన్, బౌలర్లకు సమాన అవకాశమిచ్చే పిచ్‌లను రూపొందించాలి. ఇవన్నీ అమలు చేస్తే భవిష్యత్‌లోనూ ఇక ఐపీఎల్‌కు తిరుగుండదు. -
ముంబై మళ్లీ కొట్టింది
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ రెండోసారి లీగ్ విజేతగా నిలిచింది. 2015 సీజన్ తొలి రెండు వారాల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఒక్కసారిగా జూలు విదిల్చి దూసుకుపోయింది. రెండేళ్ల క్రితంలాగే అదే కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో అదే ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. నెమ్మదైన ఈడెన్ గార్డెన్ పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని నిర్ణయంపై ఆ తర్వాత కొంత చర్చ కూడా జరిగింది. గెలిపించిన కెప్టెన్: ఫైనల్లో ముందుగా సిమన్స్ (68), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (26 బంతుల్లో 50) సహాయంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 8 వికెట్లకు 161 పరుగులే చేసి 41 పరుగుల తేడాతో ఓడింది. డ్వేన్ స్మిత్ (48 బంతుల్లో 57) స్లో హాఫ్ సెంచరీతో ఛేదనలో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు ముంబై కూడా రెండు టైటిళ్లు గెలిచిన చెన్నై, కోల్‌కతా సరసన నిలిచింది. ►నాలుగు సెంచరీలు: 2015 లీగ్‌లో డివిలియర్స్, గేల్, వాట్సన్, మెకల్లమ్ శతకాలతో చెలరేగారు. గేల్ అత్యధికంగా 38 సిక్సర్లు బాదాడు. ►ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: ఆండ్రీ రసెల్ (కోల్‌కతా – 193 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు, 14 వికెట్లు) ►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): డేవిడ్ వార్నర్ – సన్‌రైజర్స్, 562 పరుగులు ►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): డ్వేన్ బ్రేవో – చెన్నై, 26 వికెట్లు -
కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన రికీ పాంటింగ్!
ముంబై:ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇక నుంచి కొత్త అవతారంలోకనిపించబోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కోచ్ గా పాంటింగ్ సరికొత్త బాధ్యతలను చేపట్టాడు. ఈ మేరకు గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న రికీ.. తన కొత్త ఇన్నింగ్స్ కు సోమవారం శ్రీకారం చుట్టాడు. 2013 ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టీంలో ఆటగాడిగా కనువిందు చేసిన పాంటింగ్.. ఐపీఎల్-8 వచ్చే సరికి కోచ్ గా మారాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న రికీ పాంటింగ్ ఆటగాళ్లతో కలిసి శిక్షణలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ -8నుంచి ఐపీఎల్ ఆరంభ కానున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్ లో జరిగే తన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.