క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అంత్యంత పిన్న వయస్కుడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో 18 ఏళ్ల మఫాకా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనతను మఫాకా తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాది జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో మఫాకాకు సీనియర్ ప్రోటీస్ జట్టులో చోటు దక్కింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ సంచలనం అందిపుచ్చుకోలేకపోయాడు. విండీస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 54 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఐపీఎల్‌లో కూడా మఫాకా ఆడాడు.
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరపున క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఈ ప్రోటీస్ యువ పేసర్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఐపీఎల్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన మఫాక ఏకంగా 89 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ సాధించాడు. దీంతో మిగితా మ్యాచ్‌లకు ముంబై ఫ్రాంచైజీ అతడిని పక్కన పెట్టింది. అయితే మఫాకా వికెట్లు సాధించకపోయినప్పటకి 150 పైగా వేగంతో బౌలింగ్ చేసి అందరని ఆకట్టుకున్నాడు.
చదవును కొనసాగిస్తున్నా?
ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాక పలు అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఓ వైపు క్రికెట్‌ను, మరో వైపు తన చదువును ఎలా బ్యాలెన్స్ చేశాడో అతడు చెప్పుకొచ్చాడు.
"నేను తిరిగి ఇంటికి వెళ్లాక ప్రిలిమ్స్(స్కూల్ ఎడ్యూకేషన్) కోసం సిద్దమవుతాను. మళ్లీ నా స్కూల్‌కు వెళ్తాను. విండీస్ టార్ సమయంలో కూడా నా చదువును కొనసాగించాను. ఓ వైపు కొంచెం కొంచెం చదవుతూ నా ఆటపై దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పరీక్షలతో నా పాఠశాల విద్య పూర్తి అవుతోంది.
దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అదే విధంగా ప్రోటీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.
ఇది ప్రతీ ఒక్క ఆటగాడి చిరకాల స్వప్నం. క్రికెట్ అంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ ఎక్కువ. ఆరు, ఏడేళ్ల వయస్సు నుంచే దక్షిణాఫ్రికా తరపున ఆడాలని కలలు కన్నాను అని ఐవోఎల్.కామ్( iol.com.za)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment